Monday, April 5, 2010

నేను చదివిన / చూసిన పాత తెలుగు నవలలు

మళ్లీ నేను మర్చిపోకుండా :)

  1. మట్టి బొమ్మలు (తాడిగిరి పోతరాజు)
  2. వైకుంఠపాళి (ద్వివేదుల విశాలాక్షి)
  3. గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి)
  4. నానృషిః కురుతే కావ్యం (సి ఆనందరామం)
  5. సంపెంగలూ సన్నజాజులు (అవసరాల రామకృష్ణారావు)
  6. శాంతినికేతన్ (కోడూరి కౌసల్యాదేవి)
  7. విజేత (యుద్ధనపూడి సులోచనారాణి)
  8. ఇడియట్ (కొమ్మూరి వేణుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ)
  9. మాయావి (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
  10. మాయావిని (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
  11. రత్నదీపం (సగం సగం) (బెంగాలీ మూలం: ప్రభాత్కుమార్ ముఖోపాధ్యాయ్)
  12. పూర్వా సంధ్యా ప్రవర్తతే (?)
  13. పుణ్యభూమీ కళ్లుతెరు (బీనాదేవి)
  14. ఇంద్రధనుస్సు (?)
  15. విధి విధానం (?)
  16. చదరంగం (?)
  17. స్త్రీ (ముప్పాళ్ల రంగనాయకమ్మ)
  18. పసిడి హృదయాలు (?)
  19. నాతి చరామి (?)
  20. మ్రోగింది వీణ (అనుమానం) (?)
  21. గుడి గంటలు (అనుమానం) (?)
  22. కన్యాశుల్కం (నాటకం) (గురజాడ అప్పారావు)
  23. వరవిక్రయం (నాటకం) (కాళ్లకూరి నారాయణరావు)
  24. వేయిపడగలు (విశ్వనాథ సత్యన్నారాయణ)
  25. రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం)
  26. సమాంతర రేఖలు (పసుపులేటి మల్లికార్జున రావు)
  27. ఎండమావులు (దూర్వాసుల కామేశ్వరి)
  28. చక్రవాకం (కోడూరి కౌసల్యాదేవి)
  29. కెప్టెన్ కథ (బీనాదేవి)
నాకు గుర్తున్నంత వరకు రచయితల పేర్లు ఇచ్చాను. మీకెవరికైనా మిగిలినవాటి రచయితల పేర్లు తెలిస్తే తెలియచేయండి. మా ఇంట్లో ఈ పుస్తకాలన్నీ ఒకప్పుడుండేవి, ఇప్పుడు లేవు, కనీసం పేర్లైనా వ్రాసుంచుకుంటే అని ...

ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.

~సూర్యుడు :-)

Sunday, April 4, 2010

Alexander Stepanov మీద ఇంకొంత శోధన

మొన్నెప్పుడో ఓ ఫార్వార్డ్ మెయిల్ వచ్చింది, Alexander Stepanov అడోబీ ఇండియాలో ఇచ్చిన ప్రసంగ పాఠమని, సరే చదివితే బాగా అనిపించి ఆ డాక్యుమెంట్‌కోసం కొంత గూగిలించి, ఆ లింక్‌ని ఇక్కడ పోస్టాను. కాకపోతే ఆ లింక్ దగ్గర ఇది నేనిచ్చిన ప్రసంగానికి దగ్గరగా లేదని Alexander Stepanov వ్రాసినట్లు ఓ కామెంటుందని ఎవరో నా పోస్ట్ లో కామెంటారు. సరే ఓ సారి ఇతని గురించి చదవాల్సిందేనని నిశ్చయించి గూగుల్‌ని ఆశ్రయించాను.

రవి కాంచనిది కవి కాంచునో లేదా కవి కాంచనిది రవి కాంచునో అనేది పూర్వపు మాట, రవి, కవి కాంచనిది గూగుల్ కాంచుననేది ఇప్పటిమాట :-) (మనలో మనమాట, నే గూగుల్లో పనిచేయట్లేదు ;))

Alexander Stepanov గురించి వెతికితే మామూలుగానే ఓ గుట్టలు గుట్టలు లింకులొచ్చాయి, అందులో ఒకటి మాత్రం Stepanov వ్రాసిన పుస్తకాలు, పేపర్లు, సోర్స్ కోడు రిపోజిటరీ పేజ్ దొరికింది : http://www.stepanovpapers.com/. ఇందులో Stepanov అడోబీ లో ఇచ్చిన ప్రసంగమని ఓ పవర్‌పోయింట్ ప్రెజెంటేషన్ పిడిఎఫ్ రూపంలో, http://www.stepanovpapers.com/Professionalism%20in%20Programming.pdf. ఇది చదివిన తర్వాత నాకనిపించిందేమంటే ఆయన అదే స్లైడ్‌సెట్‌ని అడోబీ ఇండియాలో కూడా ప్రెజెంట్ చేసుండొచ్చని. ఈ స్లైడ్స్ బాగా డ్రైగా ఉన్నాయి, వాటిని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వాటిని ఎలాబొరేట్ చెయ్యాల్సిందే, అదే జరిగుండొచ్చు (ఇది నా ఊహ మాత్రమే :))

సరే ఏది ఏమైనా, ఈ సైట్లో సమాచారం (ప్రోగ్రామర్లకి) చాలా విలువైనది నా అభిప్రాయం, వీలైతే మీరు (ఓ ప్రొగ్రామరైతే) కూడా ఓ లుక్కేయండి :-)

~సూర్యుడు :-)

Friday, April 2, 2010

గూగుల్ కళ్లజోడు

గూగుల్ కళ్లజోడు గురించి తెలియకపోతే ఓ సారి ఇక్కడ చూడండి. కొన్నిరోజుల క్రితం GNOME ఆర్ట్ వర్క్ నుండి కొన్ని వాల్‌పేపర్లు డౌన్‌లోడ్ చేసుకుంటుంటే ఓ కొండ (కొండేనా?) బొమ్మ దొరికింది కాని అదెక్కడిదో దాని విశేషాలేమిటో తెలీలేదు, బ్లాగు జనాభాని అడిగినా సమాధానం లేదు. కాని గూగుల్ కళ్లజోడు లాంటి ఫీచర్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ గా దొరికితే, ఏ జెపిజి లాంటి బొమ్మలమీద రైట్ క్లిక్ చేసి దీని చరిత్ర చెప్పు అంటే చెప్పేలా ఉంటే ఎలా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది, కదా? :)

అలాగే, సెమాంటిక్ వెబ్ కాన్సెప్ట్ పూర్తై, మనకి ఏది కావాలో మరింత సులువుగా వెతుక్కునేట్టు ఉంటే, ఎలాగంటే, మాయల ఫకీర్ ఏదో అద్దం దగ్గర నిల్చుని ఈ ప్రపంచంలోకెల్లా అందమైన రాజకుమారిని చూపించు అంటే చూపించినట్టు, గూగుల్ సెర్చ్ బార్‌లో, ప్రపంచంలో అందమైన అమ్మాయిని చూపించు అంటే, మాయల ఫకీర్ కి కనిపించినట్టు ఒక భారతీయ అమ్మాయిలే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరికన్న అందమైన అమ్మాయి బొమ్మ చూపిస్తే ఎలా ఉంటుంది, మస్త్ కదా :)

సరే ఇవన్నీ ఎప్పుడొస్తాయో, నా కొండ బొమ్మ ఎక్కడిదో ఇప్పటిదాకా తెలియలేదు :-(