Sunday, January 28, 2018

గూగుల్ ఎలా అనువదిస్తోంది :)

గూగుల్ వూరికే అనువదిస్తా అనువదిస్తా అని విసికింకేచేస్తోందని సరే నా పాత టపాని ఇంగ్లీష్ లోకి అనువదించమన్నా. ఇక్కడ చూడండి నా టపా తర్వాత దాని కింద గూగుల్ అనువాదం :-)

సామాజిక ప్రసార మాధ్యం - వ్యక్తిగత అభిరుచులు

సామాజిక ప్రసార మాధ్యం అంటే అదే నా ఉద్దేశ్యంలో సోషల్ మీడియా. ఇంతకు ముందు అంటే వాట్సాప్ లేని రోజుల్లో, ఇష్టం ఉంటే బ్లాగులు, పేస్బుక్కులు, ట్విట్టర్లు చూసుకునేవారు, లేదంటే గమ్మునుండేవారు. కానీ ఇప్పుడలా కాదే, స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ లేకుండా ఉండదు (ఇప్పుడర్ధమవుతోంది ఎఫ్ బి వాడు అంత పెట్టి ఎందుకు కొన్నాడో :)), అదుంటే గ్రూపులు ఉండకుండా ఉండవు, అందులో ఉంటే మెసేజస్ రాకుండా ఉండవు. సరే మెసేజస్ వస్తే వచ్చే నష్టమేంటి అంటే ఏమి లేదు కానీ ఒక గుంపులో ఉన్నవాళ్ళందరూ ఒకేలా ఆలోచించాలని లేదు కదా. ఇక్కడ బ్లాగులైతే మనకి నచ్చినవి చూస్తాం, నచ్చనివి వదిలేస్తాం. అలాగే మిగిలిన పేస్బుక్కులు, ట్విట్టర్లు వగైరాల్లో.

ఈ వాట్సాప్ మెసేజస్ లో ప్రోపగాండా మెసేజస్ ఎక్కువైపోతున్నాయి. మనకి నచ్చిన రాజకీయ పార్టీని కీర్తిస్తూ కొన్ని, ప్రతిపక్ష పార్టీని దూషిస్తూ కొన్ని. ఇవన్నీ బహుశా రాజకీయ పార్టీల సోషల్ మీడియా సెల్స్ సృష్టించి మనమీదకి వదులుతారనుకుంటా.

ఇలాంటి మెసేజస్ మిత్రుల గుంపుల్లో సాధారణంగా రావు ఎందుకంటే అలా పంపిస్తే ఆ గ్రూపులో ఎవరో ఒకరు గొడవ చేస్తారు అందువల్ల ఎవరు అలాంటి సాహసం చెయ్యరు. కానీ కుటుంబ గుంపులో ఇలాంటివి వస్తే అభ్యంతరం చెప్పడం కష్టం. ఎవరిని ఏమంటే ఎవరేమనుకుంటారో అని.

నా ఉద్దేశ్యంలో రాజకీయ పార్టీ ఇష్టా ఇష్టాలు అంటే సినేమా నాయక నాయకిల ఇష్టా ఇష్టాల్లాటివి. అందరికి ఒకరే నచ్చరు. ఎవరు ఎవరికీ ఎందుకు నచ్చుతారో ఎవరికీ తెలీదు. అందువల్ల ఇలాంటి అభిప్రాయాల్ని సోషల్ మీడియా గ్రూపుల్లో వ్యక్తీకరించడం అంత మంచిది కాదని భవదీయుని అభిప్రాయం. మీరేమంటారు?

~సూర్యుడు :-)


Social broadcasting - personal interests

Social media is the social media in my mind as well. In the days that have not been in Watsap, the blogs, Facebook, Twitter, or others would be gum if they liked it. But now, if you have a smart phone, you will not be without Watsup (now you know why FB did not like it :)), then the groups do not exist, in which case the messages are not coming. Okay, that's not what the loss of messages comes to, but the people in a group do not have to think the same. If we blog here, we will see what we like, we do not like it. Besides the rest of the Facebook and Twitter,

In Watsap Messages Propaganda Messages are overflowing. Some of us applaud the political party that we like, some of the Opposition party. All of these will probably create social media cells for political parties and let us go.

Such messages do not come out of the group of friends because they do not make such an adventure because someone in the group makes a difference. But it is hard to object if the family group does. Whom does anyone want?

In my opinion, the political party's likes are the likes of the Cinemas leaders. Not everyone likes it. Nobody knows why anyone will like it. Therefore, the opinion of the thinker is that it is not good to express such opinions in social media groups. Alors?


~ Sun :-)

Friday, January 19, 2018

బాడీ ఆఫ్ లైస్

మొత్తానికి బాడీ ఆఫ్ లైస్ నవల పూర్తిచేశాను. నవల బాగుంది. ఇప్పుడు ద ఇంక్రిమెంట్ మొదలుపెట్టాను, చూడాలి ఎలా ఉంటుందో. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లు తూర్పు పడమరలు. ఒకరు ఇజ్రాయిల్ ను సప్పోర్ట్ చేస్తే ఇంకొకరు ఆరబ్బులని సప్పోర్ట్ చేస్తారు. రాసే విధానం డానియల్ సిల్వా ది  బాగుంటుంది, డేవిడ్ ఇగ్నేషియస్ ఇతివృత్తాలు, వ్యూహాలు కొద్దిగ సింపుల్ గా ఉంటాయి. మొత్తానికి ఇద్దరూ బాగానే వ్రాస్తారు.

ద ఇంక్రిమెంట్ చదవడం పూర్తయ్యాక ఎలా ఉందో వ్రాస్తా .

~సూర్యుడు :-)

Monday, January 1, 2018

Happy New Year 2018!!

Wish You A Very Happy New Year 2018!!