Sunday, May 15, 2011

ఏంటో విసుగ్గా ...

ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మిగిలిన చోట్ల ఉప ఎన్నికలైనా, కొన్ని పార్టీలు తలక్రిందులైనా, ఎవరూ రిగ్గింగనడంలేదు, ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లడంలేదు, అందరికీ సడెన్‌గా ఏమైందబ్బా :p

Saturday, May 14, 2011

Sunday, May 8, 2011

ఫెడోరా 15 లో కష్ట సుఖాలు

ఈ మధ్య వచ్చిన లీనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ లో ఫెడోరా 15 బాగా నచ్చింది. గ్నోం ౩ చాలా బాగుంది, డెస్క్‌టాప్‌ని క్లట్టర్ చెయ్యడానికి వీలులేకుండా చెయ్యడమే ఓ గొప్ప మార్పు, లేకపోతే డెస్క్‌టాప్ ఎప్పుడూ పనికిరాని ఫైళ్లతో నిండిపోతుండేది :)

ఆమధ్య ఎప్పుడో యు‌ఎస్‌బి బేస్డ్ వైర్‌లెస్స్ అడాప్టర్ కొన్నాను కాని అదెప్పుడూ లీనక్స్ లో పనిచెయ్యలేదు, ఆర్‌ఎలింక్ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసినాకూడా పనిచెయ్యించలేకపోయాను, కాని ఇప్పుడది ఆటొమాటిక్‌గా పనిచేసేస్తోంది, సూపర్ కదా :)

ప్రస్తుతం నాకొచ్చిన సమస్యేమిటంటే, నా డివిడి రైటర్ డివిడి ని రికగ్నైజ్ చెయ్యలేకపోతోంది, గూగుల్ కూడా సహాయపడలేకపోయింది. సిడిని గుర్తించగలుగుతోంది, డివిడి పెట్టేసరికి కొంతసేపు మూలిగి, పడుకుంటోంది :( (అంటే ఎల్‌యిడి వెలిగి, ఆరడంలేదు). నా డివిడి, ఎల్‌జి కోంబో రైటర్. ఎవరికైనా దీన్ని ఎలా పరిష్కరించాలో తెలిస్తే నాక్కూడా తెలియపరచి సహాయపడగలరు :)

~సూర్యుడు :-)