Monday, October 21, 2013

నాకు నచ్చిన రెండు పాటలు ...

నాకు నచ్చిన తెలుగు పాటలు చాలానే ఉన్నాయి కాని ఈ రెండూ నాకెప్పుడువిన్నా బాగానే అనిపిస్తాయి :)

మీరుకూడా విని నచ్చితే ఆనందించండి :)

వెలుగు నీడలు (పాడవోయి భారతీయుడా)
రోజులు మారాయి (ఏరువాక సాగారో)

Sunday, October 13, 2013

మనిషి మనసు

మనసు

మనసు అంటే ఏంటో? మనసు మీద మన తెలుగు సినేమాల్లో బోల్డు పాటలున్నాయి (మన'సుకవి' గారి ధర్మమా అని). మిగిలిన పాటలన్నీ ఎలాఉన్నా బాలమురళీకృష్ణ గారు పాడిన "మౌనమె నీ భాష ఓ మూగ మనసా" (సరే ఈ పాట ఎవరు వ్రాసారో తెలీదు) పాట భలే అనిపిస్తుంది, అంటే మనసుని చాల చక్కగ వర్ణించిందేమో అనిపిస్తుంది. అది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మా స్నేహిడొకడనేవాడు, డాగ్ బిజీ అని, అంటే ఏమిటంటే, కుక్కకి పని ఉన్నా లేకున్నా ఎప్పుడూ పరిగెట్టి వెళ్తుంటుంది అని :-) అలాగే అవసరమున్నా లేకున్నా, మనసు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఎందుకో ?

ఉదాహరణకి, తెలంగాణా వస్తుందా? రాదా? (వచ్చినా, రాకపోయినా తనకి పెద్దగా తేడాఏమీ లేకపోవచ్చు, కాని మనసు ఊరుకోదు), ఇండియా ఈసారి ఆస్ట్రేలియా మీద (క్రికెట్టులో) గెలుస్తుందా? గెలవదా?, మనకి తేడా ఏమైనా ఉంటుందా, ఏమీలేదు అయినా సరే, మనసు ఊరుకోదు.

పూర్వం, అంటే ఇంటర్నెట్ లేని అజ్ఞానంధకార యుగంలో వార్తా పత్రికల్లో ఏదైనా వార్త చదివినప్పుడు, నచ్చకపోతే (అంటే, మనసుకు నచ్చకపోతే అని తీసుకోవాలి) ఆ పేపర్‌వాడిని కొంత తిట్టుకొని ఊరుకునేవాళ్ళం, ఇప్పుడలాకాదు, మన బ్లాగుల్లోనో, ఫేసుబుక్కుల్లోనో, ఆ పేపర్‌వాడి (లేకపోతే న్యూస్ చానెల్ వాడి) తాట తీస్తాం కదా. కాని అదే వార్త వేరొకరికి చాల సంతోషంగా అనిపించొచ్చు, అంటే ఏదైనా సరే ప్రపంచంలో కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని కాని నచ్చకూడదనికాని లేదు మరి అలాంటప్పుడు నచ్చనివాటిమీదపడి చావకొట్టాల్సిన అవసరముందంటారా?

కన్యాశుల్కం‌లో కరకట శాస్త్రి శిష్యుడు ఏదో తెలుగు పద్యం/కవిత్వం చదివి (ఆ పద్యంలో కవిగారికి ఏదో పువ్వు ఇష్టం లేదని వర్ణన) వళ్ళు మండి, మా గురువుగారికి దొండకాయలంటే ఇష్టం ఉండదు కాని ఇంట్లో దొండపాదుందని వాళ్ళావిడ రోజూ దొండకాయ కూరే చేస్తారు, బ్రతికిన వాళ్ళిష్టాఇష్టాలే ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాళ్ళిష్టాఇష్టాలతో ఏమిపని అని అనుకుంటాడు. అసలు సంగతేంటంటే, మనకు నచ్చనివి కనిపించినప్పుడల్లా, మన అభిప్రాయాల్ని చెప్పేయాలా? ఈ భూపెపంచకమ్మీద మనకి నచ్చనవి బొచ్చెడుంటాయి, వాటన్నిటినీ ఎంతకన్న వ్యతిరేకిస్తూ మన అభిప్రాయాల్ని వ్యక్తీకరించగలుగుతాం? కాని మనసు మాత్రం రగిలిపోతుంటుంది, అదీ సంగతి, దీనివల్ల రక్తపోటు పెరుగుతుందేమో కాని ప్రపంచమేమీ మారిపోదుకదా మనకోసం.

అందువల్ల నేచెప్పొచ్చేదేంటంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు; బోడిగుండంత సుఖం లేదు అని :)

ఈమద్య బ్లాగులు చదివి ఉండబట్ట/ఊరుకోలేక ఇలా ఇక్కడ, మీరుకూడా ఇది చదివింతర్వాత మామూలుగ మీకు నచ్చనివాటిని ఉతికారేసే కార్యక్రమంలో ఉంటారని ఆశిస్తూ ... ;)

~సూర్యుడు :-)

Sunday, August 25, 2013

ముచ్చట్లు ...

ఈ మద్య ద లాస్ట్ స్నో అన్న ఓ నవల చదివా, పరమ బోరు, ఓపిక ఉన్నవాళ్ళు ప్రయత్నిచ్చొచ్చు.

పశ్చిమ తీరంలో ఓ జలాంతర్గామి గోవిందా అయ్యింది, ఇప్పుడు తూర్పుతీరంలో చమురుశుద్ధి కర్మాగారంలో పేలుళ్ళు, హేఁవిటో, ఏదో కిరి కిరి ఉందనిపిస్తోంది.

మెడ్రాస్ కెఫె సినేమా చూశాను, గొప్పగాలేకపోయినా బాగానే ఉంది. కొన్ని సీన్లు మ్యూనిక్ నుండి కాపీ కొట్టినట్టనిపించాయి. జాన్ అబ్రహాం బాగా నటించాడు, నర్గీస్ ఫఖ్రి కూడా పర్వాలేదు, ఇంకొంతమంది పేరుతెలియని వాళ్ళు బాగానే చేసారు. రామ్‌గోపాల్ వర్మ లేక మణిరత్నమైతే ఇంకా బాగా (ఎక్కువ ఇంటెన్సిటీతో) తీసేవారేమో అన్పించింది.

ఈ మద్య ఎ బయాస్ ఫర్ యాక్షన్ పుస్తకం చదువుతున్నా, చాలా బాగుంది, ఇంకా ముందు చదివుంటే ఇంకా బాగుండేది (నువ్వు చదవవలసిన పుస్తకం ఓ ఉద్యోగకాలం లేటు :) (విత్ డ్యు క్రెడిట్స్ టు ద అన్‌నోన్))

ద హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ నవల మొదలుపెట్టి చాలా రోజులయ్యింది కాని ఇంకా పూర్తవ్వలేదు, టాం క్లాన్సీ ఈజ్ టూ స్లో ఫర్ మి, ఎనీ వేజ్, దిస్ హ్యాజ్ టు వెయిట్ ఫర్ సం మోర్ టైం.

ద ఉటోపియా ఎక్స్పెరిమెంట్ చదువుదామని తీసా, అదీ అలాగే ఉంది :(

రెండు ప్రాంతాలు విడిపోవడానికి ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది, ఇంతకుమునుపు మూడు కొత్త రాష్త్రాలు ఏర్పడినప్పుడు ఇలాంటి గొడవలు ఎందుకు జరగలేదు? ఎందుకు మనము ఇలాంటివి నేర్చుకోలేకపోతున్నాము?

హైదరాబాదులో ఉన్న డబ్బులకోసం కలిసుండాలి అన్నదాంట్లో ఏమైనా అర్ధముందా? డబ్బులే ముఖ్యమైతే అదే కావాలని అడగాలి, దానికోసం కలిసుండక్కర్లేదు కదా :) ఓ ఇరవయ్యేళ్ళపాటు హైదరాబాదుమీద వచ్చే డబ్బుల్లో కొంత వాటా కొత్త ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని అడిగితే సరి :) ఇదేదో భరణం టైపులా అనిపిస్తోందా ;)


~సూర్యుడు :-)


Saturday, August 10, 2013

చెలువములన్నీ చిత్ర రచనలే ...

"చెలువములన్నీ చిత్ర రచనలే" అంటే ఏమిటో తెలిసింది :) Thanks to బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు.

ఈ చరణం మాయా బజార్ లో చూపులు కలసిన శుభవేళ పాటలోది. ఈ చరణాన్ని సరిగ్గా వ్రాసానో లేదో, పాట విన్నప్పుడల్లా అలా వినిపిస్తుంటుంది :)


~సూర్యుడు :-)


Sunday, August 4, 2013

Sunday, July 7, 2013

Technical Books


The Books I wanted to read but could manage some and couldn't the other :)

1. The C Programming Language - K & R
2. The C++ Programming Language - Bjarne Stroustrup
3. The Design of UNIX Operating System - Maurice J Bach
4. UNIX Network Programming - W Richard Stevens
5. Advanced Programming in the UNIX Environment - W Richard Stevens
6. TCP/IP Illustrated, Vol 1 - W Richard Stevens
7. TCP/IP Illustrated, Vol 2 - W Richard Stevens, Gary R Wright
8. TCP/IP Illustrated, Vol 3 - W Richard Stevens
9. UNIX Network Programming, Vol 1 - W Richard Stevens
10. UNIX Network Programming, Vol 2 - W Richard Stevens
11. Unix Internals: The New Frontiers - Uresh Vahalia
12. The Art of UNIX Programming - Raymond
13. Operating Systems Concepts - Avi Silberschatz, Peter Baer Galvin, Greg Gagne
14. Operating Systems Design and Implementation - Andrew S Tanenbaum
15. The Art of Computer Programming, 1 - D E Knuth
16. The Art of Computer Programming, 2 - D E Knuth
17. The Art of Computer Programming, 3 - D E Knuth
18. The Art of Computer Programming, 4a - D E Knuth

Rest follows after I take some rest for now :-)

~సూర్యుడు :-)Business Books

Books I have seen or want to read (if time permits :))


HBR Guide To:
 1. Project Management
 2. Better Business Writing
 3. Finance Basics for Managers
 4. Getting The Right Work Done
 5. Managing Up and Across
 6. Persuasive Presentations

HBR On:

 1. Advancing Your Career
 2. Smart Decisions
 3. Communicating Effectively
 4. Finding and Keeping Best People
 5. Winning Negotiations
 6. Managing People
 7. Developing High-Potential Leaders
 8. Managing Your Career in Tough Times
 9. Motivating People
 10. Talent Management
 11. Managing Difficult People
 12. What Makes A Leader
 13. Managing Through a Downturn
 14. Effective Communication

HBR's 10 Must Reads:

 1. Managing Yourself
 2. Managing People
 3. Leadership
 4. Strategy
 5. Change

Harvard Business Essential:

 1. Manager's Toolkit
 2. Negotiation
 3. Coaching and Mentoring
 4. Creating Teams with an Edge
 5. Performance Management

Harvard Press:

 1. First 90 Days - Michael Watkins 
 2. Becoming A Manager - Linda A Hill
 3. Being The Boss - Linda A Hill
 4. What To Ask The Person In The Mirror - Kaplan

Peter Drucker:

 1. Managing For Results
 2. The Effective Exective
 3. The Practice of Management
 4. Technology, Management and Society
 5. The Essential Drucker
 6. Management: Tasks, Responsibilities, Practices
 7. Managing in Turbulent Times
 8. Management Challenges for the 21st Century

Michael E Porter:

 1. Competitive Strategy
 2. Competitive Advantage
 3. On Competition

Ram Charan & Co

 1. The Talent Masters - Bill Conaty, Ram Charan
 2. Global Tilt - Ram Charan
 3. Execution - Ram Charan, Larry Bossidy
 4. Leadership Pipeline - Ram Charan
 5. Know-How - Ram Charan

 1. The Leadership Engine - Noel M Tichy, Eli Cohen

 1. The Innovator's Dilemma - Clayton M Christensen
 2. The fortune at the bottom of the pyramid -  C.K.Prahalad
 3. Systems Thinking - Jamshid Gharajedaghi

Daniel Goleman

 1. Emotional Intelligence
 2. Working with Emotional Intelligence
 3. Ecological Intelligence - Daniel Goleman
 4. Destructive Emotions - Daniel Goleman

Coveys

 1. The 7 Habits of highly Effective People - Stephen R Covey
 2. The 8th Habit - Stephen R Covey
 3. The Speed of Trust - Stephen M R Covey


Marcus Buckingham & Co
 1. The One Thing you need to Know - Marcus Buckingham
 2. First Break All the Rules - Marcus Buckingham
 3. Strengths Finder - Tom Rath
 4. Go Put Your Strengths to Work - Marcus Buckingham

 1. What Got You Here Won't Get You There - Marshall Goldsmit
 2. Managing Difficult Conversations at Work - Sue Clark, Mel Myers
 3. Difficult Conversations - Douglas Stone, Bruce Patton, Sheila Heen


Bios & Case Studies
 1. The HP Way - Dave Packard, Bill Hewlett
 2. Build to Last - Jim Collins, Jerry I Porras
 3. Good to Great - Jim Collins
 4. The Google Story - David A Vise
 5. Business @ The Speed of Thought - Bill Gates
 6. Direct From Dell - Michael Dell
 7. Only The Paranoid Survive - Andrew S Grove
 8. Who Says Elephants Can't Dance? - Louis V Gerstner, Jr.
 9. The Toyota Way - Jeffrey K Liker
 10. Toyota Talent - Jeffrey K Liker, David P Meier
 11. Freedom Inc. - Brian M Carney, Isaac Getz
 12. iCon Steve Jobs - Jeffrey S Young, William L Simon
 13. Maverick - Ricardo Semler
 14. Employees First, Customers Second - Vineet Nayar
 15. Winning - Jack Welch, Suzy Welch

Economics Related
 1. Economics
 2. False Economy - Alan Beatite
 3. When Genius Failed - Roger Lowenstein
 4. Capitalism At Risk - Joseph L Bower, Herman B Leonard, Lynn S Paine
 5. The New Digital Age- Eric Shmidt, Jared Cohen
 6. Animal Spirits - George A Akerlof, Robert J Shiller
 7. Crisis Economics - Nouriel Roubini, Stephen Mihm
 8. Extreme Money - Satyajit Das 
 9. Breakout Nations - Ruchir Sharma
 10. An Age of New Possibilities - Reinhard Mohn
 11. Empires of Mind - Denis Waitley
 12. Games People Play - Eric Berne
 13. Five Roads to The Future - Paul Starobin
 14. Small is Beautiful - E F Schumacher

 1. The Habit of Winning - Prakash Iyer
 2. Excellence - J Pincott
 3. In Search Of Excellence - Thomas J Peters, Robert H Waterman Jr.
 4. Be Excellent at Anything - Tony Schwartz
 5. The Leader's Guide to Storytelling - Stephen Denning
 6. Think Better - Tim Hurson
 7. Mobilizing Minds - Lowell L Bryan, Claudia I Joyce
 8. Getting More - Stuart Diamond
 9. What Works - Hamish McRae

 1. Crossing The Chasm - Geoffrey A Moore
 2. Talent is never enough - John c maxwell
 3. Hacking Work - Bill Jensen, Josh Klein
 4. The Fifth  Discipline - Peter M Senge
 5. The Checklist Manifesto - Atul Gawande


~సూర్యుడు :-)

Sunday, June 23, 2013

ఈటి విద్య

ఈటి విద్య అంటే ఏంటో తెలుసా?

Saturday, June 22, 2013

good one ...

I saw the below caption on the back of a T-shirt:

while (! (succeed=try ())){;}


Sunday, June 9, 2013

ఊసుపోక ఇలా ...

ముందుగా ఓ విషయం, ఈ మద్య యధాలాపంగ ఓ ఏపియస్ ఆర్టిసి బస్సు వెనకాల పడితే "ఆర్టిసి బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం అని వ్రాసి, శుభప్రదాన్ని తీసేసారు :)

ఈ మద్య ఓ వారంరోజులు హైదరాబాదులో ఉన్నా, అబ్బో అసలు ఆ వేడి, నీళ్ళకరువు, కొద్దిగా కాదు బాగా కష్టమే.

బెంగళూరులో ఈమద్య వర్షాలు పడి చల్లబడింది కాని, ఇక్కడకూడా ఎండలు మండుతున్నాయి, నీళ్ళకీ ఇబ్బంది మొదలయ్యింది, జనభా కోటికి పైనేట మరి :(

పుస్తకాలు కొనడం ఎక్కువై చదవడం తక్కువైంది, ఇంక కొనడం తగ్గించి, కొన్నవి చదవడం మొదలుపెట్టాలి.

ఇవి కొన్నా:

The Utopia Experiment  (Kyle Mills/Ludlum)
Inferno
Threat Vector


ఇది చదువుతున్నా:

The Hunt for Red October

ఇవికూడా కొన్నాను కాని చదువుతాననే నమ్మకం లేదు :)

On Education
Why I am not a Christian (దీన్నెవరైనా తెలుగులో కాపీ కొట్టారా ;))
In Praise of Idleness  (నాకైతే దీన్నెవరో తెలుగులో కాపీకొట్టారనే అనుమానం ;))

హైదరాబాదు (సికిందరాబాదు స్టేషన్లో కూడా) రైల్వే స్టేషన్లో మళ్ళీ తెలుగు అనువాదాలు కనిపించాయి. ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో, ఏ పుస్తకం అనువాదం చెయ్యాలో అని, ఇంగ్లీషులో బాగా అమ్ముడుపోయినంత మాత్రాన తెలుగులో అమ్ముడుపోతాయన్న నమ్మకమేమిటి? ఇప్పటిదాకా ఏ అనువాద పుస్తకాన్ని తెరచి చూడలేదు, బ్లాగు తెలుగో, మామూలు తెలుగో :)

ఎచ్‌బి‌ఆర్ వాడి బెటర్ బిజినెస్ రైటింగ్ అన్న పుస్తకం కొన్నా, చాలా బాగుంది. అసలు తెలుగులో చక్కగ ఎలా వ్రాయలో నేర్పించే పుస్తకం అవసరముంది అనిపిస్తోంది. నాలాంటివాడికి పనికొస్తుంది :)


~సూర్యుడు :-)

Sunday, May 5, 2013

Just a try

I wanted to publish a post from my mobile in Telugu but looks like it not so easy from my droid mobile.  So for now please bear with me.

Recently I read couple of novels, Janson Command and Trevayne. First one is so so and the second one is a thriller. I recommend Trevayne,  if you like fiction.

I bought couple of more novels but not yet started reading.  They are "The Hit" and "Threat Vector". I will read them when time permits and share my opinion on these novels.

I also bought Economics from The Economist group, not sure if I will be able to read it :)

Typing in mobile is no fun, even if it is a droid phone. However, typing in a tablet is ok.

~Suryudu :-)

Saturday, March 16, 2013

మీకు ఈ విషయం తెలుసా?

ఈ మద్య ఫొటోలు బ్లాగుల్లో పెట్టడం మొదలుపెట్టాక అనుమానమొచ్చింది. ఈ ఫొటోల్లో ఎలాంటి సమాచారం ఉంటుందో అని. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వాడి తీసిన ఫొటోల్లో. ఒక్కోసారి మనఫోన్ అమరికలు బట్టి జిపియస్ సమాచారం కూడా ఫొటోయొక్క మెటాడాటాలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమాచారాన్ని మీరు వేరేవాళ్ళకు తెలియకూడదనుకుంటే ఏంచెయ్యాలి?


పనిలో పని ఈ కీర్తన వినండి, ఆ ఫొటోల గురించి తర్వాత ఆలోచిద్దాం :)


Sunday, March 10, 2013

పసుపురంగు పువ్వులు

ఓ నాలుగేళ్ళ క్రితం ఈ పువ్వుల చెట్లని చూసి వీటి గురించి రాయాలనిపించింది కాని అప్పుడు వీటి ఫొటోలు నాదగ్గర లేవు, వీటి పేరు నాకు అప్పుడూ తెలీదు, ఇప్పుడు కూడా :( కాబట్టి ఇప్పుడు ఈ ఫొటోలు చూసేయండి :)Sunday, February 17, 2013

శ్రీసూర్యనారాయణా మేలుకో ...


రధసప్తమి శుభాకాంక్షలు!!
Sunday, January 6, 2013

భజరే రే మానస ...

pallavi
bhajarE rE mAnasa shrI raghuvIram bhukti mukhti pradam vAsudEvam harim
(bhajarE)


anupallavi
vrijina vidUram vishvAdhAram sujana mandAram sundarAkAram
(bhajarE)caraNam
rAvana mardanam rakSita bhuvanam ravi shashi nayanam ravijAti madanam
ravijAdi vAnara parivrtam naravaram ratnahAra parishObhita kandarammadhyama kaalam
ravi shashi kuja budha guru shukra shanIscara rAhu kEtu nEttAram
rAjakumAram rAmam pavanajAptam avanijA manOharam
(bhajarE) 


Courtesy 

 తెలుగులో (సౌజన్యము)

 పల్లవి

భజరే రే మానస శ్రీ రఘువీరం భుక్తి ముక్తి ప్రదం వాసుదేవం హరిం
(భజరే)

అనుపల్లవి

వ్రిజిన విదూరం విశ్వాధారం సుజన మందారం సుందరాకారం
(భజరే)

చరణం

రావణ మర్దనం రక్షిత భువనం రవి శశి నయనం రవిజాతి మదనం
రవిజాది వానర పరివృతం నరవరం రత్నహార పరిశోభిత కందరం

మధ్యమ కాలం

రవి శశి కుజ బుధ గురు శుక్ర శ్శనైశ్చర రాహు కేతు నేత్తారం
రాజకుమారం రామం పవనజాప్తం అవనిజా మనోహరం
(భజరే)

Liquid Metal Battery and some others ...

ఈ ప్రొఫెసర్ గారు మాట్లాడిన తీరు నచ్చకపోయినా, ఈయన కనిపెట్టిన బ్యాటరీ వల్ల ఎక్కువమొత్తంలో విద్యుత్తును చౌకగా నిలువ చెయ్యవచ్చని, ఇందువల్ల, సౌరశక్తి, గాలిమరలద్వారా వచ్చే విద్యుత్తును నిలువచేసి అవరసరమైనప్పుడు ఉపయోగించుకునే అవకాశముటుందని అంచనా:పనిలో పనిగా ఇవికూడ వినేయండి :) (దీనికి సబ్‌టైటిల్స్ అవసరమౌతాయేమో)


 Tuesday, January 1, 2013

Happy New Year!!

ముందుగ అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

మానవుడు ఆశాజీవి కాబట్టి, వచ్చే సంవత్సరమెప్పుడు పోయిన సంవత్సరం కంటే బాగుంటుందని / బాగుండాలని కోరుకుంటు ...

ఈ మద్య మాఊరెళ్ళెచ్చా. మాఊరు విశాఖపట్నం జిల్లాలో ఉన్నా విజయనగరానికి దగ్గర అవడం వల్ల ఓరోజు అలా వెళ్ళొద్దామని బయలుదేరి, మహాత్మా గాంధీ రోడ్డు, అంటే గంటస్తంబం నుండి బయలుదేరి కోటకి ఒక ప్రదక్షిణం చేసి, ఆ దారిలో కనిపించిన ఓ పుస్తకాలకొట్టులో, పాత తెలుగు నవలలు కావాలంటే, విశాలాంధ్రా పుస్తక ప్రదర్శన నడుస్తోంది, అక్కడ ప్రయత్నించండి అన్నారు, అలాగేఅని గురజాడ గ్రంధాలయం దగ్గరకు వెళ్ళి చూస్తే చాలానే పుస్తకాలు కనిపించాయి. నచ్చిన కొన్ని పాత నవలలు కొనుక్కొని, అలాగే మనసు ఫౌండేషన్ వారి గురుజాడలు కొన్నా. కాకపోతే ఓవిషయం అర్ధమయ్యింది (ఇన్ని రోజులు గమనించని విషయం), అనువాద రచనలు, ఈ మద్య కాలంలో వచ్చిన విదేశీ రచయితల పుస్తకాలను తెలుగులోకి అనువదించి అమ్ముతున్నారు. ఇది మంచిదో కాదోఅర్ధం కాలేదు. ఇంగ్లీష్ చదవడం రానివారికి తెలుగులో ఆపుస్తకాలు చదువుకునే అవకాశం కలుగుతుంది కాని ఈ అనువాదకులు మూల ప్రతికి ఎంత న్యాయం చేకూరుస్తారో అన్నదానిమీద అవి చదవడం వల్ల ఎంత ఉపయోగముంటుందో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, గురు జాడలు మొదటి పుటల్లో ఇలా ఉంది: "అది గురజాడ వారి నిలువు (stand)". ఇది చదివాక అర్ధమయ్యింది, "బ్లాగు తెలుగు" పుస్తకాల్లో కూడా మొదలయ్యిందని :). ఈ stand అనే పదానికి నిలువు తప్ప వేరే పదమేమీ లేదా? ఈ సందర్బంలో "అది గురజాడ వారి గొప్పతనం" అంటే బాగుంటుందేమో అనిపించింది :-). నా చిన్నప్పుడు మాఊరివైపు నూతుల లోతుల్ని నిలువుల్లో చెప్పేవారు :), నిలువంటే ఆరడగులేమో?

ఇప్పుడొక పిట్ట కథ:

గూగులిస్తే ఈ రెండు లంకెలు కనిపించాయి -

భోజరాజు - విక్రమాదిత్యుని సింహాసనము
భోజరాజు - విక్రమాదిత్యుని సింహాసనము (పిడిఎఫ్)సూక్ష్మంగా కథేమిటంటే, ఓ రైతు, విక్రమాదిత్యుని సింహాసనమున్నచోటు నుండి నిల్చుని భోజరాజుని రమ్మని ఆహ్వానిస్తుంటాడు, అక్కడనుండి క్రిందకు రాగానే తన వ్యవసాయాన్ని పాడుచేసారని తిడుతుంటాడు, ఇదొక పొజిషనల్ బిహేవియర్ సమస్య :-). ఇలాగే ఇప్పుడు కొంతమంది బ్లాగర్లు, పోస్టులు/టపాలు వ్రాసేటప్పుడు, విక్రమాదిత్యుని సింహాసనమ్మీదున్నట్లు, పాఠక దేవుళ్ళలారా, ఇవి (టపాలు) చదివి మీ మీ వ్యాఖ్యలు వ్రాయండి/వదలండి అంటుంటారు, కాని వ్యాఖ్యలు చూసుకోవడానికి వచ్చేటప్పుడు, సింహాసనమ్మీదనుండి క్రిందకు దిగినట్లు, నాకు నచ్చినవ్యాఖ్యలనే అనుమతిస్తాను అని కొందరు, ఇది పాతకాలపు (అదే సనాతన ధర్మం బ్లాగు), ఈ ధర్మానికి వ్యతిరేకంగా (అంటే నే చెప్పినదాని వ్యతిరేకంగ అని తాత్పర్యం) ఎవరైనా వ్యాఖ్యలు వ్రాస్తే అనుమతించబడవు అని కొందరు :-)

సరే మరీ జనవరి ఫస్ట్ ఫస్ట్‌నే గోలెక్కువైంది కదా, ఇంక చాలు :D~సూర్యుడు :-)