Sunday, November 29, 2015

ఈమద్య చదివిన నవలలు

డానియల్ సిల్వ "ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్" చదవడం పూర్తయ్యింది, బాగుంది కాని గాబ్రియల్ అలన్ నవలల్లా అనిపించలేదు, కొద్దిగ భిన్నంగా ఉంది. ద మార్చింగ్ సీజన్స్ మొదలుపెట్టాను కాని ముందుకు కదలడంలేదు, అలానే ద మర్డర్ ఆఫ్ క్వాలిటీ కూడా. ఇంకా ద అన్‌లైక్‌లీ స్పై కూడా చదవాలి.

ఈమద్య ద మౌంటైన్ షాడో నవల కొన్నాను, శాంతారాం చదివి చాలారోజులయ్యింది, అది మళ్ళీ చదివి, మౌంటైన్ షాడో మొదలుపెట్టాలి.

మర్డర్ ఆఫ్ క్వాలిటీ లో ఓ పంక్తి (నాకు నచ్చింది :)):

He wished he could paint; he would paint the pageant of Carne in the fallow browns of autumn ... What a shame, thought Fielding, that a mind so receptive of beauty had no talent for creation. (So nicely put :))

Tuesday, October 13, 2015

అంబిగ నా నిన్న నంబిదే

సౌజన్యం: http://lekhini.org/ , Lyrics, Explanation

అంబిగా నా నిన్న నంబిదే
జగదంబ రమణ నిన్న నంబిదే
తుంబిద హరిగోలంబిగ అద కొంబత్తు ఛిద్రవు అంబిగా
సంభ్రమదిం నొడంబిగ అదరింబు నొడీ నడెసంబిగా || 1 ||
హొళెయ భరవ నొడంబిగా అదకె సెళవు ఘనవైయ్య అంబిగా
సుళియొళు ముళుగిదె అంబిగ ఎన్న సెళెదుకొండొయ్యొ నీనంబిగ || 2 ||
ఆరు తెరెయ నోడంబిగ అదు మీరి బరుతలిదె అంబిగ
యారిందలాగదు అంబిగ అద నివారిసి దాటిసొ అంబిగ || 3 ||
సత్యవెంబుదె హుట్టంబిగ సదా భక్తియెంబుదె పథవంబిగా
నిత్య మురుతి పురందర విట్ఠల నమ్మా ముక్తిమంటపకొయ్యొ అంబిగ || 4 ||

Saturday, September 26, 2015

Daniel Silva - Grabiel Allon series

మొత్తానికి మొన్న డానియల్ సిల్వ గాబ్రియల్ ఆలన్ సీరీస్ నవలలన్నీ చదవడం పూర్తయ్యింది. అన్ని నవలలు చాల బాగున్నాయి. ఈ నవలేవీ ఎక్కడా విసుగు పుట్టించవు. ఎక్కడా పదాలను వ్యర్ధంగా వాడకుండా ఎలా వ్రాయాలో బాగా తెలుస్తుంది ఇవి చదివితే. కొన్ని నవలలో వ్యూహ్యాలు/ఎత్తుగడలు (plot)  ఒకేలా ఉండడం అంత బాగా అనిపించకపోయినా మరీ ఇబ్బందిగా అయితే ఉండవు. The Heist చడువుతుంటే అర్ధమైపోయింది, The English Spy ఎవరో కాని ఈ నవలలో IRA ఇతివృత్తాన్ని తీసుకోవడంవల్ల కొద్దిగా భిన్నంగా ఉంది. ఈ నవలలో గాబ్రియల్‌ని నవలా నాయకుడిగా చూపించాలో క్రిష్టాఫర్‌ని నవలా నాయకుడిగా చూపించాలా అనే సందిగ్దంలో రచయిత పడ్డాడేమో అనిపించింది.

 1. The Kill Artist
 2. The English Assassin
 3. The Confessor
 4. A Death in Vienna
 5. Prince of Fire
 6. The Messenger
 7. The Secret Servant
 8. Moscow Rules
 9. The Defector
 10. The Rembrandt Affair
 11. Portrait of a Spy
 12. The Fallen Angel
 13. The English Girl
 14. The Heist
 15. The English Spy

డానియల్ సిల్వావి ఇంకా మూడు నవలు మిగిలాయి, అవి, The Unlikely Spy, The Marching Season and The Mark of the Assassin. The Unlikely Spy మొదలు పెట్టాను కాని మళ్ళీ John Le Carré's, A Murder of Quality చదవాలనిపించి తీసాను, చూడాలి ఏది త్వరగా ముందుకు కదులుతుందో.

Thursday, September 17, 2015

పువ్వులు - పిల్లి


Do you know the name of this flower?

(sitting near the flowers giving pose for a photo that I couldn't refuse :))

Sunday, September 13, 2015

Sunday, August 9, 2015

ఈ రెండు పదాలు ఒకటేనా?

ఈ పదాలు Asset, Traitor రెండు ఒకటేనా?

BTW, I have completed The Rembrandt Affair and The Fallen Angel and both of them are very nicely written. Meanwhile, I have read, Call for the Dead of John le Carré. It is a different kind of narration, a bit old fashioned :), of course the story background is post WWII.

Now, I am thinking of reading, A Murder of Quality and The English Girl in parallel :)

I watched MI5 (not the British Security Service) and it is very nice too ;)

Saturday, July 25, 2015

Sunday, July 19, 2015

ఈ పాటలు విని ఆనందించండి


Jaane Kahan Mera Jigar Gaya Ji -  Mr. and Mrs. 55 

 

ఈ క్రింద రెండు పాటలు ఒకే బాణీలో ఉన్నాయా? లేక నాకే అలా అనిపిస్తోందా?

 

Mera Yaar Bana Hain Dulha - Chaudhavin Ka Chand

Meri Jaan Balle Balle - Kashmir Ki Kali

Friday, July 17, 2015

గాబ్రియల్ అలన్ రెండో సారి

మాస్కో రూల్స్, ద డిఫెక్టర్ చదవడం పూర్తయ్యాయి, రెండు నవలలు చాలా బాగున్నాయి. మొదట్లో మాస్కో రూల్స్ నచ్చకపోయినా, కొద్దిగ మొందుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది. ద డిఫెక్టర్ కూడ చాలా బాగుంది. ఫ్రస్తుతం The Rembrandt Affair చదువుతున్నాను, ఇదికూడా బాగానే ఉంది, ఇప్పటిదాకా.

ఇంతకు ముందు వ్రాసినట్లు, ఈ నవలలు చదువుతుంటే, మధుబాబు, షాడో నవలలు కొద్దికొద్దిగ గుర్తుకొస్తుంటాయి, సరే పాత్రల బిహేవియర్‌లలో చాలా తేడాలున్నాయనుకోండి. గాబ్రియల్ అలన్, అరి షమ్రన్, ఎలి లావన్, ఛియారా, యుజి నావట్ (ఈ పేర్లు ఎలా పలకాలో సరిగ్గా తెలీదు), దినా, రిమోనా, యాకోవ్, మిఖాయిల్, అలన్ కార్టర్, గ్రహమ్ సేయ్మర్ పాత్రలన్నీ బాగా పరిచయమైన వాళ్ళలా అనిపిస్తారు (మధుబాబు నవలల్లో, గంగారాం, కులకర్ణి, బిందు, ముఖేష్, శ్రీకర్, వాసు, చంద్ర, సులోచన, బెట్టీ ల్లా).


మీకెవరికైనా పత్తేదారు సాహిత్యమంటే మక్కువుంటే ఈ నవలలు చదివి, మీ అభిప్రాయాల్ని పంచుకోండి :)


Thursday, July 16, 2015

Sunday, July 5, 2015

D E Knuth

Wednesday, June 24, 2015

తంబూరి మీటిదవ భవాబ్ది దాటిదవ (పురందరదాసు)
ರಾಗ : ಸಿಂಧುಭೈರವಿ
ತಾಳ : ಆದಿ

ತಂಬೂರಿ ಮೀಟಿದವ ಭವಾಬ್ಧಿ ದಾಟಿದವ
ತಾಳವ ತಟ್ಟಿದವ ಸುರರೊಳು ಸೇರಿದವ

ಗೆಜ್ಜೆಯ ಕಟ್ಟಿದವ ಖಳರೆದೆಯ ಮೆಟ್ಟಿದವ
ಗಾನವ ಪಾಡಿದವ ಹರಿ-ಮೂರುತಿ ನೋಡಿದವ

ವಿಠ್ಠಲನ ನೋಡಿದವ
(ಪುರಂದರ) ವಿಠ್ಠಲನ ನೋಡಿದವ ವೈಕುಂಠಕೆ ಓಡಿದವ


Raaga : sindhu Bhairavi
Taala : Adi taala

tamboori meeTidava bhavaabdhi daaTidava
taaLava taTTidava suraroLu sEridavaa

gejjeya kaTTidava khaLaredeya meeTTidava
gaanava paaDidava harimoorti nODidava

vittalana nodidavaa
(purandhara) vittalana nodidava vaikuntakke ODidavaa

 Courtesy: http://majesticpeak.blogspot.com/2012/01/tamburi-meetidava.html

Tuesday, June 23, 2015

స్మరిసువ జనకెల్ల (పురందరదాసు)

ఈ పాట వినడానికి క్రింద లింకు నొక్కండి
స్మరిసువ జనకెల్ల

స్మరిసువ జనకెల్ల

రాగ: సురుటి
తాళ: ఆది
కృతికర్త: ఫురందరదాస

భాష: కన్నడ
-------------------------------------------------------------------------------

స్మరిసువ జనకెల్ల భవ భయ పరితాపగళిల్ల
శరణాగతజన వత్సలనెనిసిద కరిగిరి దుర్గద నరహరి నిన్నను

పూర్వ సుకృతదింద సుజనకె తోరువె నీ ముదదింద
సర్వ కాలదొళు మహదానందది దుర్వాసరు పూజిప మూరుతి నిన్న

అడవియ మృగగళిగె బగె బగె గిడ లతె మరగళిగె
ఒడెయ నీనల్లదె అన్నోదకగళ కొడువరె మనుజరు నీ గతి సలహెందు

కరిగిరి నరసింహ భక్తర దురితదంతి సింహ
పరిపాలిసు నా మొరెహొక్కెను నిన్న గురు పురుందరవిఠ్ఠల నిన్నను

సౌజన్యం: లేఖిని, http://sangitasopana.blogspot.in/2014/09/smarisuva-janakella.html

rAga: suruTi
tALa: Adi
Composer: Purandaradasa
Language: Kannada
-------------------------------------------------------------------------------
smarisuva janakella bhava bhaya paritApagaLilla
sharaNAgatajana vatsalanenisida karigiri durgada narahari ninnanu

pUrva sukrtadinda sujanake tOruve nI mudadinda
sarva kAladoLu mahadAnandadi durvAsaru pUjipa mUruti ninna

aDaviya mrgagaLige bage bage giDa late maragaLige
oDeya nInallade annOdakagaLa koDuvare manujaru nI gati salahendu

karigiri narasimha bhaktara duritadanti simha
paripAlisu nA morehokkenu ninna guru purundaraviTThala ninnanu
Courtesy:
http://sangitasopana.blogspot.in/2014/09/smarisuva-janakella.html 

Sunday, May 31, 2015

తొలకరి జల్లులు

బెంగళూరులో ఈ మద్య ఓ మూడు వారాలనుండి తరచుగ సాయంత్రాలు జల్లులు పడి వేసవి తీవ్రత తెలియకుండ గడిచిపోయింది, ఇప్పటిదాక. ఋతుపవనాలు ఎలాఉంటాయో తెలియకపోయినా ఈమద్య వర్షాలు బాగానే పడుతున్నాయి.

డానియల్ సిల్వా నవలలు చదివే కార్యక్రమంలో, ద మెసెంజర్ చదవడం పూర్తయ్యింది, నవల బాగుంది. ఇప్పుడు మాస్కో రూల్స్ చదవడం మొదలుపెట్టాను, ఇదికూడా బాగానే ఉంది కాని, కొన్ని ప్లాట్స్ ఊహించినవే అవ్వడం అంత బాగా అనిపించలేదు.

ఈమద్య John le Carré నవలలు కొన్ని కొన్నాను, డానియల్ సిల్వా నవలలు పూర్తయ్యిన తర్వాత ఇవి మొదలుపెట్టాలి.

Sunday, April 19, 2015

గాబ్రియల్ అలన్

ద కిల్ ఆర్టిస్ట్, ద ఇంగ్లిష్ అసాసిన్, పోట్రైట్ ఆఫ్ ఎ స్పై, ద కన్ఫెస్సర్, ఎ దెత్ ఇన్ వియెన్నా, ప్రిన్స్ ఆఫ్ ఫైర్ నవలలు చదివిన తర్వాత డానియల్ సిల్వ అంటే బాగ ఇష్టం పెరిగిపోయింది, ఆ తర్వాత ఆ నవలా నాయకుడు, గాబ్రియల్ అలన్ అన్నా కూడా. ముఖ్యంగా చెప్పుకోవలసిందేమంటే, డానియల్ సిల్వా వ్రాసే విధానం, చాలా క్లుప్తంగ, ఏ వాక్యం కూడా అనవసరం అనిపించదు. కొన్ని పేరాలు అంతకు ముందు నవలల్లోనుండి తీసుకోబడ్డా అవి సందర్బోచితంగా ఉండి అనవసరం అనిపించదు. వ్రాసే పద్దతి మధుబాబు షాడో నవలల్లా అనిపించినా, కొంచం వేరేగా ఉండి బాగా అనిపిస్తుంది.


ఇప్పుడు ద మెస్సెంజర్ చదవటం మొదలు పెట్టాను, ఇప్పటిదాకా బాగుంది.

May be I should watch the Munich movie again :)

Sunday, April 12, 2015

Sunday, March 22, 2015

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

శ్రీ మన్మధ నామ నూతన సంవత్సరం మీకు శుభ సంతోషాలని కలిగించాలని కోరుకుంటు ...
ఉగాది శుభాకాంక్షలు
Sunday, March 8, 2015

Monday, January 12, 2015

గూఢచారి చిత్రపటము (Portrait of A Spy)

Kill Artist, English Assassin చదివిన తర్వాత ఇవాళే Portrait of A Spy చదవటం పూర్తిచేసాను. చాలా బాగుంది. ఈ మద్య Eric Van Lustbader, Lee Child novels చదివిన తర్వాత ఈ నవలలు చదివితే కొద్దిగ refreshing గ అనిపించాయి. మీకు కాల్పనిక (fiction) నవలలు, అందులో థ్రిల్లర్స్ ఇష్టమైనట్లైతే మీకు Daniel Silva నవలలు నచ్చే అవకాశం ఎక్కువ.

Saturday, January 10, 2015

పసుపు గులాబీ


Thursday, January 1, 2015

Happy New Year - 2015Wish You A Very Happy and Prosperous New Year 2015