Sunday, November 27, 2011

హిందువు కి/కు ఒక ఉత్తరం

ఇ-పుస్తకాలు వెతుకుతూంటె ఇది కంట పడింది (గూటెన్‌బర్గ్ లో). చదువుతూంటే ఆసక్తికరంగా అనిపించి ఇక్కడ ఉంచాలనిపింది.

"A commercial company enslaved a nation comprising two hundred millions.
Tell this to a man free from superstition and he will fail to grasp
what these words mean. What does it mean that thirty thousand men, not
athletes but rather weak and ordinary people, have subdued two hundred
million vigorous, clever, capable, and freedom-loving people? Do not the
figures make it clear that it is not the English who have enslaved the
Indians, but the Indians who have enslaved themselves?

When the Indians complain that the English have enslaved them it is as
if drunkards complained that the spirit-dealers who have settled among
them have enslaved them. You tell them that they might give up drinking,
but they reply that they are so accustomed to it that they cannot
abstain, and that they must have alcohol to keep up their energy. Is it
not the same thing with the millions of people who submit to thousands'
or even to hundreds, of others--of their own or other nations?

If the people of India are enslaved by violence it is only because they
themselves live and have lived by violence, and do not recognize the
eternal law of love inherent in humanity.

_Pitiful and foolish is the man who seeks what he already has, and does
not know that he has it. Yes, Pitiful and foolish is he who does not
know the bliss of love which surrounds him and which I have given him._
KRISHNA."


పూర్తిగా చదవాలనుకుంటె, ఇక్కడ చూడండి

Saturday, November 12, 2011

ఫెడోరా 16 - ఉబుంటు 11.10

ఈ మధ్య నా సిస్టంలో ఉబుంటు 11.04 నుండి 11.10 కి, అలాగే ఫెడోరా 15 నుండి 16 కి అప్‌గ్రేడ్ చేసాను. కొత్త ఉబుంటు ఎందుకో అంత స్టేబుల్‌గా అనిపించలేదు, డెస్క్‌టాప్ చాలాసార్లు హ్యాంగైపోతోంది. చూడ్డానిక్కూడా అంత పెద్దగా మార్పేమీలేదు.

కొత్త ఫెడోరా ఇప్పుడే వాడ్డం మొదలుపెట్టాను. మొదట్లో నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయలేదు. ఇప్పుడు పని చేస్తోంది కాని ఇంకా ఎక్కడో ప్రోబ్లెమ్ ఉందనిపిస్తోంది.

ఈ మధ్య యుఎస్‌బి బేస్డ్ వైర్‌లెస్ అడాప్టర్ నుండి పిసి‌ఐ బేస్డ్ వైర్‌లెస్ అడాప్టర్ కి మారడం వల్ల బ్రాడ్‌బ్యాండు స్పీడ్ బాగుంటోంది, కొత్త ఫెడోరా ఆన్‌లైన్ అప్‌డేట్ 1.5 GB ని 90 నిమిషాల్లో అయిపోయింది, సూపర్ అనిపించింది. కాని ఇప్పుడే అప్‌డేట్ అయ్యాక, నెట్‌వర్క్ పనిచెయ్యడమే సరిగ్గా లేదు :( . నా కాన్ఫిగరేషనే తప్పయ్యుంటుంది :)