Sunday, September 23, 2018

ద అదర్ వుమన్

డానియల్ సిల్వా ద అదర్ వుమన్ చదవడం పూర్తయింది. ఇది ఇంతకుముందొచ్చిన డానియల్ సిల్వా రెండు నవలలుకన్నా బాగుంది. రష్యన్ ఆపరేషన్ నవలల్లో ఇది మూడోదేమో. ఇంటరెస్టింగ్ ప్లాట్. చాలావరకు తెలిసి పాత్రలే :)

ఇంతకుముందే ఎక్కడో అన్నట్టు డానియల్ సిల్వా నవలల్లో నాకు నచ్చే అంశం వ్రాసే విధానం. అయన మొదట్లో విలేఖరి కాబట్టి, విలేఖర్లకు వ్రాసేవిధానమే ముఖ్యం కాబట్టి అయన బాగా వ్రాయడంలో ఆశ్చర్యమేమీ లేకపోవచ్చు. మొన్న చదివిన ద ఆక్సిడెంటల్ ప్రిమినిస్టర్ పుస్తకం కూడా అలానే అనిపించింది. సంజయ బారు కూడా సంపాదకుడిగా పనిచేసిన అనుభవం ఆసక్తికరంగా వ్రాయడానికి పనికొస్తుందేమో.

నవలైనా మరేదైనా పుస్తకమైనా ఆసక్తికరంగా ఉండాలంటే ఉపోద్ఘాతం ముఖ్యమేమో. కొన్ని పుస్తకాలు మొదలు అంత గొప్పగాలేకపోయినా చదవగా చదవగా బానే అనిపిస్తాయి. అంటే ఈ రచయితలకు స్టార్టింగ్ ప్రాబ్లమేమో ...

హెచ్ బి ఆర్ గైడ్ టు బెటర్ బిజినెస్ రైటింగ్ పుస్తకంలో ఏమంటాడంటే ఏవిషయమైనా క్లుప్తంగా (నాట్ ఏ వర్డ్ మోర్ నాట్ ఏ వర్డ్ లెస్ లైక్ నాట్ ఏ పెన్నీ మోర్ నాట్ ఆ పెన్నీ లెస్ టైప్) అర్థమయ్యేటట్లు వ్రాయాలని. నాఅభిప్రాయమేమంటే డానియల్ సిల్వా వ్రాసేవిధానం సరిగ్గాలనే ఉంటుందని.

ఇప్పుడేం మొదలుపెట్టాలో ద స్పైస్ ఆఫ్ వార్సా నా లేక ఎనీ ఆఫ్ దోజ్ జాన్ లె కారి నవలా ..

Sunday, September 16, 2018

విదేశీ విలేఖరి

అదే ద ఫారెన్ కరెస్పాండెంట్ అని ఒక నవల చదివాను. నా మొదటి Alan Furst నవల, పూర్తిగా చదివినది. ఇంతకుముందు ద స్పైస్ ఆఫ్ వార్సా మొదలుపెట్టాను కాని పూర్తిచెయ్యలేదు. ద ఫారెన్ కరెస్పాండెంట్ నవల బాగుంది. ముస్సోలిని ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కొంతమంది ఇటలీ పౌరులు ఫ్రాన్స్ ఇటలీలనుండి నడిపించిన వ్యతిరేక ఉద్యమ కథ. ఇది 1938 నుండి 1939 మద్యలో జరిగిన సంఘటనలు, కల్పనా అయ్యుండొచ్చు లేదా నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని రాసినదయ్యుండొచ్చు. ఒక నవల చదివి Alan Furst రచనా విధానం గురించి చెప్పడం కష్టం.

ఏదేశంలోనైనా ఏకాలంలోనైనా కొంతమందే తమకు నచ్చని విధానాలని వ్యతిరేకించి పోరాడతారు, మిగిలినవారు తటస్థంగానైనా ఉంటారు లేదా సమర్థిస్తారు. ఈపోరాడేవారు ఎన్ని కష్టనష్టాలను భరించి తాము నమ్మిన సిద్దాంతాలకోసం తమ ప్రాణాలను ఫణంగాపెట్టి పనిచేస్తారన్న విషయం ఈనవలలో కనిపిస్తుంది. డానియల్ సిల్వా నవలల్లోలాగ ఎక్కువ యాక్షన్ లేదు కానీ బాగుంది. ద స్పైస్ ఆఫ్ వార్సా మళ్ళీ మొదలుపెట్టాను, చూడాలి ఎప్పుడు పూర్తవుతుందో.

ఈలోగా ఏదో రైలుప్రయాణంకోసం కొన్న ద ఏక్సిడెంటల్ ప్రెమినిస్టర్ పుస్తకం మొదలుపెట్టినప్పటినుండి ఆపకుండా చదివేసాను. సంజయ బారు బాగా ఆకట్టుకొనేవిధంగా వ్రాసారు. ఈపుస్తకం వ్రాయడానికి శ్రీ మన్మోహన్ సింగ్ గారి అనుమతి తీసుకున్నారో లేదో తెలియదు (ఏదో ఇంటర్వ్యూలో సంజయ బారు తీసుకోలేదు అని చెప్పారని చదివినట్టు గుర్తు) కాని చాలా అంతర్గతమైన విషయాలను ప్రస్తావించారు ఈపుస్తకంలో. ఇది చదివిన తర్వాత అర్దమైయిందేమిటంటే పత్రికల్లో వచ్చే వార్తలు ఎలా పుట్టుకొస్తాయా అని :). ఆ తర్వాత శ్రీ మన్మోహన్ సింగ్ గారి రాజకీయ పరిణతి. ఈ పుస్తకంలో ఎవరో చెప్పినట్లుగా అయన ఓవర్ రేటెడ్ ఎకనామిస్ట్ అవునోకాదో కానీ తప్పకుండా అండర్ రేటెడ్ పొలిటీషియన్ అని మాత్రం అర్ధమవుతుంది.

నాకర్ధంకాని ఒకవిషయం సంజయ బారు ఎందుకు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో దూరం పెంచుదామనుకున్నారో నాకర్ధం కాలేదు. తాను ప్రధానమంత్రికాగలిగి కూడా శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసిన శ్రీమతి సోనియా గాంధీకి వ్యతిరేకంగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ప్రవర్తిస్తారనుకున్నారో కూడా నాకర్ధంకాలేదు. అంతేకాకుండా సంజయ బారు తిన్నగా ప్రధానమంత్రికి రిపోర్ట్ చేయడంవలన, ప్రధానమంత్రిగారి ప్రధాన కార్యదర్శికి ప్రధానమంత్రిగారి మీడియా అడ్వైసర్ కి మధ్యలో బాధ్యతలు ఓవర్లాప్ అయ్యి రెండు పవర్ సెంటర్స్ అయినట్లనిపించింది. చివర్లో శ్రీ మన్మోహన్ సింగ్ గారు రెండు పవర్ సెంటర్స్ ఉండకూడదు శ్రీమతి సోనియా గాంధీగారే పవర్ సెంటర్ అని చెప్పినప్పుడు అదెందుకో ప్రధానమంత్రిగారి ప్రధాన కార్యదర్శికి ప్రధానమంత్రిగారి మీడియా అడ్వైసర్ కి కూడా వర్తించేలా చెప్పారేమో అనిపించింది. ఓవరాల్ ఒక ఆసక్తికరమైన పుస్తకం, పేజ్ టర్నర్ కూడా ...

మన తెలుగువారు సంజయ బారు శ్రీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అంత కీలకమైన పాత్ర పోషిండమన్నది మనమందరం గర్వించవలసిన విషయం 

ప్రస్తుతం డానియల్ సిల్వా ద అదర్ వుమన్ మొదలుపెట్టాను సో ఫార్ సో గుడ్.

~సూర్యుడు :-)