అంటే ఇదేమీ కొత్తకాదుగానీ, మనమేదైనా కంప్యూటర్ వాడుకోవాలంటే ఒక సిస్టం అందులో ఆపరేటింగ్ సిస్టం కావలికదా. లినక్సు లాంటి ఆపరేటింగ్ సిస్టం ఇంతకుముందు డీవీడీ రైటర్ వాడి ఇన్స్టాల్ చేసేవారు . ఆతర్వాత USB స్టిక్స్ వాడి చేస్తున్నారు. అదే లైవ్ ఇమేజ్ ఐతే, ఇన్స్టాల్ చెయ్యకుండా బూట్ చేసి వాడుకున్నంతసేపు వాడుకుని తర్వాత సిస్టం నుంచి తీసేసుకోవచ్చు. ఈ USB స్టిక్ ని ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు. మనక్కావలసిందల్లా ఒక సిస్టం, బూట్ చెయ్యడానికి (USB స్లాట్ ఉండాలనుకోండి).
కానీ ఇక్కడో చిక్కుంది. సిస్టం లో అయితే ఆపరేటింగ్ సిస్టం ని అప్డేట్ చేస్తూ ఉండొచ్చు కానీ USB స్టిక్ లో ఇమేజ్ ని అప్డేట్ చెయ్యడానికి లేదు. బూట్ అయిన ఇమేజ్ ని అప్డేట్ చేసినా అది నడుస్తున్నంతవరకే పనికొస్తుంది కానీ మళ్ళీ బూట్ చెస్తే పాత ఇమేజ్ బూట్ అవుతుంది. ఏమైనా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా అది USB స్టిక్ ఇమేజ్ లో అప్డేట్ అవ్వదు.
కానీ ఈ ఆపరేటింగ్ సిస్టం వాళ్ళు ఒక ఫీచర్ ఆడ్ చేస్తే, అంటే లైవ్ ఇమేజ్ ని USB స్టిక్ నుండి బూట్ చేసి దాన్ని అప్డేట్ చేసినా, కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, షట్ డౌన్ చేసేటప్పుడు ఈ కొత్త ఇమేజ్ ని USB స్టిక్ లోకి వ్రాసేయమంటావా అని అడిగి, వ్రాసేయ్ అంటే USB స్టిక్ లో కొత్త ఇమేజ్ ని వ్రాసేస్తే, నెక్స్ట్ టైం ఆ USB స్టిక్ వాడి బూట్ చేస్తే , కొత్త ఇమేజ్, అంటే అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ వస్తే ఇంకా బాగుంటుంది. బాగుంటుందనేకన్నా సౌకర్యంగా ఉంటుంది :)
~సూర్యుడు :-)