Thursday, December 12, 2024

మనతోనే ఉండే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం - 2

సమయం తొందరగా గడిచిపోతోంది. ఈ విషయం మీద మళ్ళీ వ్రాద్దామనుకొనేసరికి చూస్తే ఓ పదకొండు నెలలైపోయాయి. అంటే కాలచక్రం గిర్రున తిరిగింది. అలాగే సాంకేతిక పరిజ్ఞానమూనూ. నేను క్రితం సారి మనతోనే ఉండే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం వ్రాసినప్పుడు నాకు ఇలా చెయ్యడానికి అప్పుడే పనిముట్లు ఉన్నాయని తెలీదు. ఈమధ్య మళ్ళీ కొంత శోధన చేసిన తర్వాత కనిపించిన సమాచారం లో usb స్టిక్ లో అప్డేట్ చేసుకోగలిగే Linux ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చొ చాల బాగా వివరించారు దాని వివరాలు ఇక్కడ 


https://kskroyal.com/run-ubuntu-from-usb-drive-with-persistence-storage/

పైన ఇచ్చిన లింక్స్ లోసమాచారం చాల సులభంగా ఉండి ఓ 128 GB USB స్టిక్ లో Ubuntu 24.10 ఇన్స్టాల్ చెయ్యడానికి ఉపయోగ పడ్డాయి. పైన వీడియోలో చూపించినట్టు SSD బేస్డ్ USB డ్రైవ్ అయ్యుంటే ఇంకొద్దిగా ఫాస్ట్ గా పనిచేస్తుందేమో. రూఫుస్ వాడి Fedora కూడా ఇంకో USB స్టిక్ లో ఇన్స్టాల్ చెయ్యడానికి ప్రయత్నించాలి. 

ప్రస్తుతం ఈ పోస్ట్ USB స్టిక్ లో ఉన్న Ubuntu నుండే :)

 

By the way,  కొన్ని రోజుల క్రింద దేనికోసమో వెతుకుతుంటే, మొగలాయి దర్బారు అనే పుస్తకం కనబడింది. ఇదికూడా ఎప్పుడో చదివినట్టనిపించింది. బహుశా తొమ్మిదో తరగతి చదువుకుంటునప్పుడేమో. వ్రాసింది మొసలికంటి సంజీవరావు. ఇది ది మిస్టరీస్ అఫ్ మొఘల్ కోర్ట్స్ కు తెలుగు అనువాదము. ఎప్పుడో మాయావి / మాయావిని నవలల గురించి ఓ పోస్ట్ వ్రాసినప్పుడు nmrao bandi గారు రోషనార గురించి ఏమైనా నవలలు గాని లింకులు గాని ఉంటే షేర్ చేసుకోమన్నప్పుడు ఎక్కడో చదివినట్టు గుర్తొచ్చింది కానీ పుస్తకం పేరు గుర్తుకు రాలేదు. నేను చదివినది రెండో మూడో భాగాలనుకుంటా, వేరే వేరే పుస్తకాలు. ఇప్పుడు చూసింది ఒక్కటే పుస్తకం. 

మొగలాయి దర్బారు

Mysteries of the mogul court by Dhirendra Nath Paul.


~సూర్యుడు :-)