Saturday, April 19, 2025

ఒక పరిశీలన

చీమలు ఎక్కడకు వెళ్తాయి? బెల్లమున్నచోటికి (ఆహారమున్నచోటికి). అబ్బా ఛా, మాకిన్నిరోజులు తెలీలేదే అనుకోకండి, నేను Linux installation గురించి అనుకున్నట్టు. ఇది మనకందరికీ తెలిసిందే, క్రొత్తగా కనిపెట్టిందేమీ లేదు. అలాగే మిగిన జంతువులూ, మనం కూడా. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడకు. మనకు ఆహారం పని చేస్తేగాని దొరకదు కాబట్టి, ఎక్కడ పనుంటే అక్కడకు పోతాం. మనవాళ్ళు రైల్వే ఉద్యోగాలకోసం ఖరగపూర్ వెళ్ళినా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం బెంగళూరు, చెన్నై , పూణే ఇంకా ఇతర దేశాలు వెళ్ళినా ఇందుకోసమే. ఎక్కడ ఉపాధి అవకాశాలుంటే అక్కడకు వలసలు సహజం.


బ్రిటిష్ పరిపాలనలో చాలా మంది వ్యవసాయ కూలీలుగా ఇతరదేశాలకు వలసవెళ్ళినట్లు చదువుకుంటుంటాము కదా.  ప్రస్తుతం మన దేశంలో చూసినట్లైతే వివిధ ప్రాంతాలనుండి బెంగళూరుకు వలస వచ్చేస్తున్నారు. అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వలసలు ఎక్కువైనట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నిజమయ్యుండొచ్చు కాకపోవచ్చు. 


ఎప్పుడో ఆర్యులు వలస వచ్చారా లేదా అన్నది ప్రక్కన పెడితే, ఇప్పటి వలసలు నిజం, మనం చూస్తున్నాము. దక్షిణాది రాష్ట్రాల వారు ఉత్తరాదికి వలసలు వెళ్ళలేదా అంటే, వెళ్ళుండొచ్చు కానీ ఇంత కొట్టొచినట్లుగా అనిపించలేదు. ఇవి ఇలాగె కొనసాగితే కొన్ని తరాల తర్వాత జనాభా లెక్కలెలా (అదే demography ) ఉంటాయో.


మీకేమనిపిస్తోంది?


~సూర్యుడు :-)

Friday, April 18, 2025

మనతోనే ఉండే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం - 3

దీని మీద ఇంకొన్ని ప్రయోగాలు చేసి ప్రస్తుతానికి Fedora 42 ను ఓ 16GB USB డ్రైవ్ లో ఇన్స్టాల్ చేశాను. ఇంతకుముందు కూడా ఇలాగె చేసేవాడిని కాకపోతే లైవ్ ఇమేజ్, అప్డేట్ చేసుకోడానికి లేదు. ఇప్పుడు ఏంచేసానంటే మొదట ఒక USB డ్రైవ్ లో లైవ్ ఇమేజ్ ఇన్స్టాల్ చేసి ఇంకొక USB డ్రైవ్ లో ఫెడోరా 42 ను ఒక హార్డ్ డిస్క్ లో ఇన్స్టాల్ చేసే విధంగా ఇన్స్టాల్ చేశాను. ఈ USB డ్రైవ్ లో ఇన్స్టాల్ చేసిన ఫెడోరా 42 ను అప్డేట్ చేసుకోవచ్చు , పని అయిన తర్వాత తీసి పెట్టేసుకోవచ్చు. 

 ఈ క్రింద లింక్ లో చెప్పిన విధంగా ఫాలో అయిపోండి :)


 

ఇప్పుడు ఉబుంటు 25.04 ని ఈ విధంగా ఇన్స్టాల్ చెయ్యడానికి ట్రై చెయ్యాలి. 

ప్రస్తుతానికి ఈ టపా USB ఫెడోరా 42 నుండి. 

ఇది చాల సులభమైన విధానం. ఇంతకు ముందు కూడా ఇలా చేసుకుని ఉండొచ్చు కానీ ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదో :(

ఈ విధానం తెలిసిన తర్వాత ఇంకా దీని మీద ఇంతకన్నా పరిశోధనలు చెయ్యటానికి ఏమీలేదు.


~సూర్యుడు :-)