Tuesday, March 17, 2009

చిన్నప్పటి నవలా పఠనం!!

చిన్నప్పుడు ఎలా ఉందేదంటే ఏది కనిపిస్తే అది చదివేయాలని. అందువల్ల అప్పుడు దొరికిన పుస్తకాలు నేను చదవ తగ్గవా కాదా అని ఎప్పుడూ అలోచించలేదు. అలా చదివిన వాటిలో, తాడిగిరి పోతరాజు గారి "మట్టిబొమ్మలు", ఎంకెవరో వ్రాసిన వైకుంఠపాళి, గ్రహణం విడిచింది, విజేత, శాంతినికేతన్, సి ఆనందరామం గారు వ్రాసినవేవో చదివినట్టు గుర్తు. వెలుగు-నీడలు కూడా చదివినట్టున్నాను.

తర్వాత హైస్కూల్ కొచ్చాక, మాంత్రికుల కథలు, మధుబాబు షాడో నవలు చదివేసి, ఇంటరు కొచ్చాక విరామమిచ్చి మళ్లీ డిగ్రీ టైం లో ఏవో కొన్ని "పుణ్యభూమీ కళ్లుతెరు", కన్యాశుల్కం, కాప్టన్ కథ, ఇంకా కొన్ని గుర్తులేని నవలలు ఏవో చదివాను.

తర్వాత ఇంగ్లీష్ ఫిక్షన్ ...

6 comments:

మాలతి said...

ఎన్నాళ్లకి చూశానండీ ఇవి చదివాం అని చెప్పినవాళ్లని. గ్రహణం విడిచింది, వైకుంఠపాళీ ద్వివేదుల విశాలాక్షిగారు రాసారు. విజేత సులోచనారాణి. శాంతినికేతన్ రాసింది కోడూరి కౌసల్యాదేవిగారు. పుణ్యభూమీ, కళ్లుతెరు రచయిత్రి బీనాదేవి. మీరన్నట్టు ఇప్పుడున్నలాటి శల్యపరీక్షలు లేవు ఆరోజుల్లో.

ramya said...

హైస్కూలుకి రాకుండానే అవన్నీ చదివారంటే!!
నాకు అలాంటి జ్ఞాపకాలేమీ లేవు మా ఇంట్లో వారపత్రికలూ నవలలూ పిల్లలు ముట్టకూడని పదార్ధాలని నమ్మేవారు (మాంత్రికుల కథలూ రష్యన్ పిల్లలకథలూ అప్పట్లో నా ఫేవరేట్ అవి మాత్రం సెలవల్లో చదివే వాళ్ళం) అలా నేనేమీ చదవలేకపోయాను. అందుకే ఆ నవలలంటే కాస్త జీర్ణం కావునాకు వాటిల్లో అదోలా నవ్వింది, ధీర్ఘంగా చూసాడు లాంటి డైలాగ్స్ :( కూడా;
పుస్తకాలపై కోరిక పెళ్ళైయ్యాక తీర్చేసుకున్నా కొనగల్గినన్ని పుస్తకాలు కొనేసా:) కానీ ఎంచుకుని ఎంచుకుని.
నాకు గుర్తుండి నేను చదివిన మొదటి పుస్తకం కన్యాశుల్కం :) అదీ ఇంటర్ లో.

సుజాత వేల్పూరి said...

మా ఇంట్లో ఆంక్షలుండేవి కావు. పైగా పిల్లలు చదవకూడని కంటేంట్ ఉండే పుస్తకాలేవీ వచ్చేవి కావు. అందువల్ల జ్యోతి మంత్లీ,యువ,విజయచిత్ర, వనిత,ఆంధ్రజ్యోతి, ప్రభ వీక్లీలు, మాసపత్రికల తాలూకు అనుబంధ నవలలు, అన్నీ నేను ఐదారు క్లాసుల్లోనే చదువుతూ ఉండేదాన్ని......మిగతా బాల సాహిత్యంతో పాటుగా!

మురళి said...

నేను ఎలిమెంటరీ స్కూల్లో కథలు, హైస్కూల్లో నవలలు చదవడం మొదలు పెట్టాను.. బాగుంది మీ టపా..

సూర్యుడు said...

వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదములు.

మాలతి గారు, రచయిత(త్రు)ల పేర్లు తెలిపినందుకు ధన్యవాదములు. వ్రాసిన తర్వాత గుర్తొచ్చింది, సి ఆనందరామం గారి నవల నానృషిః కురుతే కావ్యం ఇంకా, ఎండమావులు అనే ఇంకొక నవల (టి వి ధారావాహికం కాదు :))

రమ్య గారు, మీ సందేహం కరక్టే, అన్ని హైస్కూల్ కి ముందే చదవలేదు, కొన్ని రెండు మూడు సార్లు చదివాను. బాగా పట్టుకున్నారు :)

ఏడవ తరగతి చదువుతున్నప్పుడు, యుండమూరివి కొన్ని చదివాను, తులసిదళం, తులసి, డబ్బు డబ్బు, అభిలాష. వెన్నెల్లో ఆడపిల్ల ఎప్పుడు చదివానో గుర్తులేదు.

ధన్యవాదాలు, మురళి గారు.

నమస్కారములతో,
~సూర్యుడు :-)

krishna rao jallipalli said...

POST IS VERY GOOD..BYE