Monday, April 9, 2012

ఈ పదానికి అర్ధమేమిటి?

కళ్లం లేదా కళ్ళం లేదా కల్లం.

మీకు తెలిసిన నానార్ధాలు చెప్పండి, మీ మీ మాండలీకాల్లో.

~సూర్యుడు :-)

14 comments:

Worldz Loving said...

వరికంకుల నుంచి ధాన్యం సేకరించు ప్రదేశం.పొలం లొ పంట సేకరించు ప్రదేశం.

Anonymous said...

కళ్ళం అనేది కోసిన వరిని పడుగులా వేసి తొక్కించి ధాన్యాన్ని తీసుకునే ప్రదేశం. దీన్ని తయారు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు, ప్రతి పంటకీ.

Anonymous said...

ఈ పదాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా వాడుతారు.

అన్వేషి said...

కృష్ణా లో కూడా ఇదే అర్ధంలో "పంట నూర్చు ప్రదేశం" గానే వాడుతారు. కాని దానికి వేరే ప్రర్యాయపదం ఉన్నట్లు నేనెరుగను.

రసజ్ఞ said...

నాకు తెలిసినంతవరకూ ముందుగా అది ఒక ఇంటి పేరు.
అలానే పైన అందరూ చెప్పినట్టు ధాన్యపు కళ్ళం, ఇంకా గుఱ్ఱపు కళ్ళం.
అలానే కళ్ళం అంటే మోసం, మాయ, అడ్డు అనే అర్ధాలున్నాయి.

gaddeswarup said...

కల్లాం is also used in Krishna, Guntur districts. See, for example 'regadi vittulu' by Chandralatha.

Anonymous said...

This word is used in the same sense as said above by others in Karimnagar and Mehaboob nagar districts too.

Alapati Ramesh Babu said...

నిన్న మీ పొస్ట్ లొ కామేంట్ చేసిన తరువాత మరలా విషసేకరణ చెస్తే ఇలా ఇంకొద్దిగా తెలినది 1)పానుపు 2)రొడ్డకొట్టుడు 3) మాట్లువేసేవారు నిప్పు వెలిగించు ప్రదేశం అనగా రాపిడి,ఘర్షణ కలిగించు ప్రదేశాలకు "కల్లము" అనిపేరు.
ఆలాగె మీరు ప్రశ్న వ్రాసెటప్పుడు "ల"కారానికి ,"ళ" కారానికి స్వరభేదం గమనించి అడిగినట్లుయితె బాగుండేది.
ఇంటి పేర్లు వారు చేసిన వ్రుత్తులు, నివసించిన ప్రాంతాలబట్టి మొదట ఎర్పడ్డాయి.

సూర్యుడు said...

@Worldz Loving, kastephale, born2perform, అన్వేషి:

మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. మా ఊరు వైపు కూడా ఈ అర్ధంలో వాడతారు.

@రసజ్ఞ: అవునా, నేనెప్పుడూ ఈ ఇంటిపేరు వినలేదు. గు‌‌ఱ్ఱానికి వేసేది కళ్లెమేమోనండి, మోసం, మాయ అనే అర్ధాలుకూడా ఉన్నాయా :), కన్నడంలో కళ్ళ అంటే దొంగ అని అర్ధం :). మీ వ్యాఖ్యకి/కు ధన్యవాదాలు

@gaddeswarup: Thanks for your comment.

@Anonymous: Looks like a global term :). Thanks for sharing this information.

@ramesh babu alapati: బాబోయ్, ఇన్ని అర్ధాలున్నాయా దీనికి :). మీ వ్యాఖ్యకి/కు ధన్యవాదాలు.
======

మా ఊర్లో ఇంకో రెండర్ధాల్లో వాడతారు;
1. చెరువుకి కళ్లం వేయడమంటే, గండిపడ్డం అనే అర్ధంలో
2. పొలం దగ్గర నివాసముండే ప్రాంతం, kind of a poor man's farmhouse :)

వ్యాఖ్యాతలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ

కళింగ (రాజ్యం, ప్రాంతం, కులము వగైరా కాదు) అంటే ఏమిటో మీకెవరికైనా తెలుసా?

~సూర్యుడు :-)

Alapati Ramesh Babu said...

కళింగ :- పక్షి,నల్లని వారు నివసించె ప్రదేసము, హానికర వ్యక్తులు వుండు ప్రదేశము,విషతుల్య సమానము:- కాళి అనగా నల్లని,చీకటి సౌందర్యము అనే ఆర్థాలు వున్నయి ఆప్రాంతము బౌద్దముకు మారినతరువాత రకరకాలకారణాలతొ ఆప్రాంత ప్రజలు చరిత్రకు ఆందనికాలం నుంచివున్న వారి ఆలవాటు ఆయిన కాళి పూజ పద్ధతులను వదలలేక పొయారు అనగా వామచారం (బలులు,క్షుద్రమంత్రొపాసన) ఆందువలన కాళి వుపాసనలొ వున్నవారిని కాళింగులు అన్నారు వారు వున్న ప్రదేశము కళింగ.

భాగవతము లొ క్రిష్ణుడు కాళింది మడుగు అనగా విషతుల్య మడుగు.

నాకు ఇంతవరకు బుధజనులకు తెలిసినవి తెలిపిన తెలుసికొవాలని నా విన్నపము.

సూర్యుడు said...

@ramesh babu గారు:

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఈ పదానిక్కూడా చాలా అర్ధాలున్నాయన్నమాట :)

నేను ఆశించిన అర్ధమిందులో లేదు. ఇంకెవరైనా ప్రయత్నిస్తారేమో చూసి తర్వాత నాకు తెలిసిన అర్ధం చెప్తా (నాకు తెలిసింది కరెక్టవ్వాలని లేదు :))

~సూర్యుడు :-)

రసజ్ఞ said...

కళింగము అంటే పక్షి అనే నాకు కూడా తెలుసు. ఇంకా కళింగ ఫలము అంటే నేరేడు పండు అనుకుంటా!

Anonymous said...

ధాన్యం నూర్పు ప్రదేశాన్ని కల్లం అని, పుచ్చకాయని కళింగ(ర) పండు అని, కర్నాటక బార్డర్, అనంతపురం జిల్లాలో అంటారు.

సూర్యుడు said...

@రసజ్ఞ, Anonymous:

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. నాకు తెలిసిన అర్ధం, కళింగ అంటే చెరువులకి గండ్లు పడకుండా నీరు ఓ హద్దుమీరినప్పుడు బయటకి పోవడానికి వీలుగా కట్టే కట్టడం :)

నేనింతకు ముందు చెప్పినట్లు ఇదే దాని అర్ధమో కాదో తెలీదు :D

Thanks for all your active participation.

~సూర్యుడు :-)