Tuesday, January 1, 2013

Happy New Year!!

ముందుగ అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

మానవుడు ఆశాజీవి కాబట్టి, వచ్చే సంవత్సరమెప్పుడు పోయిన సంవత్సరం కంటే బాగుంటుందని / బాగుండాలని కోరుకుంటు ...

ఈ మద్య మాఊరెళ్ళెచ్చా. మాఊరు విశాఖపట్నం జిల్లాలో ఉన్నా విజయనగరానికి దగ్గర అవడం వల్ల ఓరోజు అలా వెళ్ళొద్దామని బయలుదేరి, మహాత్మా గాంధీ రోడ్డు, అంటే గంటస్తంబం నుండి బయలుదేరి కోటకి ఒక ప్రదక్షిణం చేసి, ఆ దారిలో కనిపించిన ఓ పుస్తకాలకొట్టులో, పాత తెలుగు నవలలు కావాలంటే, విశాలాంధ్రా పుస్తక ప్రదర్శన నడుస్తోంది, అక్కడ ప్రయత్నించండి అన్నారు, అలాగేఅని గురజాడ గ్రంధాలయం దగ్గరకు వెళ్ళి చూస్తే చాలానే పుస్తకాలు కనిపించాయి. నచ్చిన కొన్ని పాత నవలలు కొనుక్కొని, అలాగే మనసు ఫౌండేషన్ వారి గురుజాడలు కొన్నా. కాకపోతే ఓవిషయం అర్ధమయ్యింది (ఇన్ని రోజులు గమనించని విషయం), అనువాద రచనలు, ఈ మద్య కాలంలో వచ్చిన విదేశీ రచయితల పుస్తకాలను తెలుగులోకి అనువదించి అమ్ముతున్నారు. ఇది మంచిదో కాదోఅర్ధం కాలేదు. ఇంగ్లీష్ చదవడం రానివారికి తెలుగులో ఆపుస్తకాలు చదువుకునే అవకాశం కలుగుతుంది కాని ఈ అనువాదకులు మూల ప్రతికి ఎంత న్యాయం చేకూరుస్తారో అన్నదానిమీద అవి చదవడం వల్ల ఎంత ఉపయోగముంటుందో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, గురు జాడలు మొదటి పుటల్లో ఇలా ఉంది: "అది గురజాడ వారి నిలువు (stand)". ఇది చదివాక అర్ధమయ్యింది, "బ్లాగు తెలుగు" పుస్తకాల్లో కూడా మొదలయ్యిందని :). ఈ stand అనే పదానికి నిలువు తప్ప వేరే పదమేమీ లేదా? ఈ సందర్బంలో "అది గురజాడ వారి గొప్పతనం" అంటే బాగుంటుందేమో అనిపించింది :-). నా చిన్నప్పుడు మాఊరివైపు నూతుల లోతుల్ని నిలువుల్లో చెప్పేవారు :), నిలువంటే ఆరడగులేమో?

ఇప్పుడొక పిట్ట కథ:

గూగులిస్తే ఈ రెండు లంకెలు కనిపించాయి -

భోజరాజు - విక్రమాదిత్యుని సింహాసనము
భోజరాజు - విక్రమాదిత్యుని సింహాసనము (పిడిఎఫ్)



సూక్ష్మంగా కథేమిటంటే, ఓ రైతు, విక్రమాదిత్యుని సింహాసనమున్నచోటు నుండి నిల్చుని భోజరాజుని రమ్మని ఆహ్వానిస్తుంటాడు, అక్కడనుండి క్రిందకు రాగానే తన వ్యవసాయాన్ని పాడుచేసారని తిడుతుంటాడు, ఇదొక పొజిషనల్ బిహేవియర్ సమస్య :-). ఇలాగే ఇప్పుడు కొంతమంది బ్లాగర్లు, పోస్టులు/టపాలు వ్రాసేటప్పుడు, విక్రమాదిత్యుని సింహాసనమ్మీదున్నట్లు, పాఠక దేవుళ్ళలారా, ఇవి (టపాలు) చదివి మీ మీ వ్యాఖ్యలు వ్రాయండి/వదలండి అంటుంటారు, కాని వ్యాఖ్యలు చూసుకోవడానికి వచ్చేటప్పుడు, సింహాసనమ్మీదనుండి క్రిందకు దిగినట్లు, నాకు నచ్చినవ్యాఖ్యలనే అనుమతిస్తాను అని కొందరు, ఇది పాతకాలపు (అదే సనాతన ధర్మం బ్లాగు), ఈ ధర్మానికి వ్యతిరేకంగా (అంటే నే చెప్పినదాని వ్యతిరేకంగ అని తాత్పర్యం) ఎవరైనా వ్యాఖ్యలు వ్రాస్తే అనుమతించబడవు అని కొందరు :-)

సరే మరీ జనవరి ఫస్ట్ ఫస్ట్‌నే గోలెక్కువైంది కదా, ఇంక చాలు :D



~సూర్యుడు :-)



2 comments:

వీవెన్ said...

Stand అనేది వైఖరి/అభిప్రాయం అనే అర్థంలో వాడారేమో.

నిలువు అంటే మనిషి ఎత్తు (బ్రౌణ్యంలో చూసానిప్పుడే). ఆరడుగులు అనుకోచవచ్చులేండి.

సూర్యుడు said...

@వీవెన్ గారు:

Thanks for your comment. After long time :)

Wish you a very happy new year!!

~సూర్యుడు :-)