Showing posts with label Spy Novels. Show all posts
Showing posts with label Spy Novels. Show all posts

Friday, October 25, 2024

ఇంకో మూడు నవలలు

 ఈ మధ్య ఓ మూడు నవలలు కొన్నాను చదువుదామని. ఫాంటమ్ ఆర్బిట్, మాస్కో X ఆ తర్వాత ఏ డెత్ ఇన్ కాన్వాల్. మొదటి రెండిట్లో ఏది మొదలుపెడమా అని ఆలోచిస్తూ సీషన్డ్ రచయిత వ్రాసిన ఫాంటమ్ ఆర్బిట్ మొదలుపెట్టాను. ఇదేదో సైన్స్ స్పై ఫిక్షన్ లా అనిపించింది. నవల చాల బాగుంది. మౌలికంగా GPS సమాచారం చెడిపోతే ఎలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి లేదా సంభవించే అవకాశాలున్నాయన్నదే ఈ నవల ఇతివృత్తం. మన దేశంలో విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయా అన్నదే ప్రశ్న. అంటే GPS  లేదా స్పేస్ గురించే అవ్వక్కర్లేదు కానీ దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జరిపే పరిశోధనలు లాంటివి.

ఆ తర్వాత డేనియల్ సిల్వా ఏ డెత్ ఇన్ కాన్వాల్ నవల వచ్చింది. నవల బాగుంది. యూకే లో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్రాసిన నవల. ఇందులో ప్రధాన పాత్రలైన ప్రధాన మంత్రి, అతని భార్య పేర్లు ఇంగ్లీషువైనా అవెందుకో ప్రస్తుత ప్రధానమంత్రికి ముందున్న ప్రధాని గురించేమో అనిపించింది.

ఇప్పుడు డేనియల్ సిల్వా కథ నాయకుడు గురించి చెప్పుకోవాలి. అదే గాబ్రియేల్ అల్లోన్. ఇతని లెజెండ్ ఏమిటంటే, మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఇజ్రాయెల్ ఫుట్బాల్ టీం ను చంపిన వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకున్న టీమ్ కు నాయకుడుగా ఎలా విజయం సాధించాడన్నది. ఇలా కథానాయకులకు ఒక నిర్ణిత సమయంలో జరిగిన సంఘటనతో ముడిపెడితే వచ్చే ఇబ్బందేమంటే ఆ కథానాయకుడి వయస్సు సుమారుగా స్థిరీకరించబడి కొన్నేళ్ళకు ముసలితనం వచ్ఛేస్తుంది :)

నా లెక్క ప్రకారం ప్రస్తుతం గాబ్రియేల్ కు సుమారుగా ఓ 74 సవత్సరాలుండాలి. ఈ వయస్సులో తుపాకులు పట్టుకుని పరిగెత్తడం కష్టమే :)

ఈ నవలలో ఏదో సంభాషణ ఉంటుంది దాని అర్థం స్థూలంగా డబ్బులవల్ల అధికారం ఆ తర్వాత అధికారం వాళ్ళ ధనం వస్తాయని. సరే, అందరికి తెలిసిన విషయమే. 

ఆ తర్వాత మాస్కో X మొదలుపెట్టాను. ఎంతకీ ముందుకు కదలదే. మొత్తానికి పూర్తయ్యింది. మొదటి 200 పేజీలు ఎందుకున్నాయో  అర్ధం కాలేదు. పోగా పోగా బాగుంది. వాస్తవానికి దగ్గరగావుండే గూఢచారి కథలు ఇలాగే  ఉంటాయేమో :)


ఇప్పుడు ఏ జెంటిల్మన్ ఇన్ మాస్కో, ఏ కాలమిటీ అఫ్ సోల్స్, ది స్పై అండ్ ది ట్రైటర్ పుస్తకాలూ కొన్నాను. సమయం చూసుకొని చదవాలి.


~సూర్యుడు :-)

Saturday, July 20, 2024

బీరూట్ స్టేషన్

 బీరూట్ స్టేషన్ నవల పేరు కానీ కథ ఎపుడు బీరూట్ స్టేషన్ లోకి వెళ్ళలేదు :). రచయిత పేరు పాల్ విడిచ్. నవల చదవడానికి సులువుగా ఉంది, చదివించే లక్షణంకూడా ఉంది. పాల్ విడిచ్ వ్రాసిన నవల చదవడం ఇదే మొదటిసారి. బాగానే అనిపించింది. కథ వస్తువు క్రొత్తదేమికాదు, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంగా సాగిన కథ. సులభమైన కథ. ఎక్కడ రంధ్రాలు కనిపించలేదు కానీ అనుమానాలున్నాయి. అంటే మనకే ఆలాగైయుండచ్చేమో అనిపించేస్తుంటే అక్కడ పాత్రలకు అనిపించకపోతే మనకు అనుమానం రావడం సహజం కదా. 

నవల చివరిలో ఇలా రెండు మూడు లైన్లు, నాకు నచ్చాయి. ఏదో ఎవరిదో టపాలో ఎవరో కామెంట్ పెట్టారు, there is no truth అని, అది గుర్తొచ్చింది. 


'Truth is dangerous.'

Bauman laughed. 'That is a stupid thing to say. Truth is dangerous. Whose truth? My truth, the truth of my father, your truth. There is no truth. There are only things that you'd like to believe, and they become your truth, but the truth? You're smarter than that.'

Interesting lines, isn't it?


గూఢచారి నవలలు చదివే సరదా ఉంటే ఈ నవల చదవచ్చు. ఈ రచయిత వ్రాసిన ఇతర నవలలు చదవడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి మాస్కో X  కానీ ఫాంటమ్ ఆర్బిట్ కానీ మొదలుపెట్టాలి. 

అలాగే డేనియల్ సిల్వా ఏ డెత్ ఇన్ కాన్వాల్ కొన్నాను, ఇంకా రావాలి. 


సరే, ఏదైనా వేరే భాష పదాలకు "డు, ము, వు, లు" చేరిస్తే అవి తెలుగు పదాలు అవుతాయనుకుంటా కదా. మరి, కాలేజ్ పదాన్ని తెలుగులో కాలేజీ అని ఎందుకంటాం, కాలేజు అనాలికదా?


~సూర్యుడు :-)

Monday, July 15, 2024

కాలక్షేపం కబుర్లు

 Paulo Coelho's The Alchemist మళ్ళీ చదువుదామనుకున్నాను కానీ కుదర్లేదు. పనెక్కువైపోయింది :)

సరే క్రొత్త నవలలు చదువుదామని వెతికితే David McCloskey's Mascow X కనపడింది. ఇతనిదే ఇంతకుముందేదో చదివినట్టనిపించి కొన్నాను. అలాగే David Ignatius' Phantom Orbit కొన్నాను. వీటిగురించి goodreads లో చదువుతుంటే Paul Vidich's నవల Beirut  Station బాగుందన్నాడు. దాంతో అదికూడా కొనేసి ఓ పనయ్యందనిపించాను. ప్రస్తుతం Beirut  Station చదువుతున్నాను. సో ఫార్ సో గుడ్. Daniel Silva's A Death in Cornwall నవల రాబోతోంది, వచ్చాక కొని చదవాలి.

ఈ మధ్యనే Safe House సినిమా చూసాను. ఇంతకుముందు కూడా చూసాను కానీ మొత్తం పూర్తిగా చూడలేదు. ఈ సారి కుదిరింది. మీరు చూడకపోతే తప్పుకుండా చూడండి . నాకు నచ్చింది, మంచి సినిమా. 

 ఈ మధ్య BMTC బస్సులో వెళుతుంటే నాకు ప్రక్క స్టాపులో సీటు దొరికింది. ఇంకొంత దూరం వెళ్ళాక ఓ పెద్దాయన బస్సెక్కారు. నేను లేచి సీటు ఇద్దామా వద్ద అని ఆలోచించేలోగా వెనుక సీటులో కూర్చున్న ఓ చిన్నబ్బాయి, బహుశ నాలుగో క్లాసో ఐదో క్లాసో చదువుతుండొచ్చు, లేచి ఆ పెద్దాయనకు సీటిచ్చాడు. పెద్దవాళ్ళే ఆలోచిస్తున్నప్పుడు అంత చిన్నవాడు అలాచెయ్యడం నాకు చాల ఆశ్చర్యమనిపించింది, సంతోషం కూడా వేసింది. ఇంట్లో, బడిలో మంచి విలువలు నేర్పిస్తున్నారనిపించింది. 

చివరాఖరిగా ఇవాళ వార్తా పత్రికల గురించి చెప్పుకోవాలి. నాకు టైమ్స్ అఫ్ ఇండియా అంటే చిరాకు కానీ ఎవరో subscribe చేసుకోండి అని బుఱ్ఱ తినేస్తుంటే సరే అని మొదలు పెట్టాను. ఈ రోజు మొదటి పేజీలో డోనాల్డ్ ట్రంప్ డెత్ అని శీర్షిక. ఏమైనా అర్ధముందా. సెన్సేషనలైజషన్ కి పరాకాష్ట. అదే వార్తని ది హిందూ లో వేరే రకంగా వేశారు, బహుశ, అసాసినేషన్ ఆట్టెంప్ట్ ఆన్ డోనాల్డ్ ట్రంప్ అని అనుకుంట. ఎప్పుడో చిన్నప్పుడు వార్త పత్రికలు - విలువలు అని అనుకుంటా ఓ పాఠం చదువుకున్నాను. అందులో చదువుకున్నదేంటంటే, గాంధీ గారు చనిపోయినప్పుడు ది హిందు  న్యూస్ పేపర్లో, గాంధీ ఈస్ డెడ్ అని సింగల్ కాలమ్ న్యూస్ గా వేశారని. ఇప్పడు వార్తలంటే కాదు వార్తాపత్రికలంటేనే చిరాకొస్తోంది :). సరే TV న్యూస్ చానెల్స్, వెబ్ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ అంతకంటే గొప్పగా ఏమి లేవు. వాట్సాప్ గ్రూపుల గురించి చెప్పక్కర్లేదు కదా, ఎక్కడలేని చెత్తంతా అక్కడే. ఫేసుబుక్ వాళ్ళనుండి అంతకన్నా ఏం ఆశించగలం  కదా :)

 

~సూర్యుడు :-)

Sunday, August 13, 2023

ది కలెక్టర్

 కలెక్టర్ అంటే మన జిల్లా కలెక్టర్ కాదు కానీ డేనియల్ సిల్వా వ్రాసిన  ది కలెక్టర్ అనే క్రొత్త నవల. సరే గాబ్రియెల్ అలోన్ నవల కదా అని కొని చదివాను. నవల బాగుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జరిగిన కాల్పనిక కథ. నవలానాయకుడు పురాతన చిత్తరువులు పునరుద్ధరించేవాడవడంవల్ల (ప్రస్తుత ఉద్యోగం) నవల ఒక ప్రాచుర్యమైన చిత్తరువు దోపిడీతో మొదలవుతుంది. ఇది ఇంతకుమునుపు నవలకన్నా చాలా బాగుంది. డేనియల్ సిల్వా నవలల్లో ఉండే పాత్రలన్నీ (అన్ని అంటే అన్ని అని కాదు, చాలా వరకు అని) కనిపించాయి ఇందులో. 

ఈ నవలలో ఒక క్రొత్త పాత్ర ఇంగ్రిడ్ అని, మంచి దొంగ, అంటే అన్ని రకాలుగా కూడా మంచి దొంగ. ఏదైనా, ఎవరిదగ్గరనుంచైనా దొంగతనం చెయ్యగలదు కానీ రాబిన్ హుడ్ లాగ దానాలు చేస్తుంటుంది. ఆసక్తికరమైన పాత్ర. 

ఆమధ్య ఇంకో పుస్తకం చదివాను, నిశ్శబ్దమైన తిరుగుబాటు (జోసి జోసెఫ్), భయంగా అనిపించింది, ఇది ఒకరకంగా "కంచే చేను మేస్తే" లాంటి అనుభూతి. ఎక్కువగా వ్రాయడానికి ఏమీలేదు, చదివి అర్ధంచేసుకోవడమే. 

ఆర్ ఏ డబ్ల్యు (యతీష్ యాదవ్) పుస్తకమొకటి కొన్నాను, చదవాలి. అలాగే జేవియర్ మరియాస్ వ్రాసిన థోమస్ నెవిన్సన్ నవలొకటి కొని చదవడం మొదలుపెట్టాను కానీ మరీ తాపీగా (నెమ్మదిగా :)) ఉంది. తీరికచేసుకుని చదవాలి :)

ఇంకా బోళ్ళు పుస్తకాలున్నాయి చదవడానికి.  ఏసమయానికి ఏది నచ్చునో ఎవరూహించెదరు అనుకుంటూ అన్ని కొద్దికొద్దిగా చదివితే ఏదో ఒకటి కదులుతుంది :)


~సూర్యుడు :-)


Sunday, October 30, 2022

వార్సా గూఢచారులు (Spies of Warsaw)

ఎలాగో ఈ స్పైస్ అఫ్ వార్సా నవల పూర్తి చేసాను. మొదట్లో అంత గొప్పగా అనిపించకపోయినా తర్వాత్తర్వాత ఆసక్తికరంగా అనిపించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం మొదలవటానికి ముందు కథ. ఫ్రాన్స్, పోలాండ్ జెర్మనీను ఎదుర్కోవడానికి (ఒకవేళ యుద్ధం వస్తే, తప్పకుండా వస్తుందన్నది అప్పటి ప్రజల అనుమానం) ఎలా సహాయం చేసింది అన్న ఇతివృత్తం మీద ఆధారపడిన కథ. కొంత మొదటి ప్రపంచ యుద్ధం ప్రస్తావనలుకూడా ఉన్నాయి.


కథ పెద్దగాలేకపోయినా వ్రాసిన విధానం బాగుంది. ఇది చదివిన తర్వాత స్పైస్ అఫ్ బాల్కన్స్ చదువుదామనుకున్నాను కానీ ఎందుకో నైట్ సోల్జర్స్ చదువుదామనిపించింది, చదువుతున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఇది అలాన్ ఫర్స్ట్ కు మొదటి నవల అనుకుంటా. 

ఇది వ్రాస్తుంటే అనిపించిందేమంటే బ్లాగ్స్పాట్ లో గూగుల్ ట్రాన్స్లిటరేటర్ చాల బాగా మెరుగుపడిందని :-)

 

 Antique Cart Wheel Made Of Wood And Iron-lined, Isolated Over White  Background Stock Photo, Picture And Royalty Free Image. Image 15147487.

 

 గూగుల్ లో ఎడ్ల బండి చక్రం అని వెతికితే ఈ పైనున్న బొమ్మ ఒకటి నేను చూసినవాటికి దగ్గరగా అనిపించి ఇక్కడ పెడుతున్నాను. మీఎవరైనా ఇలాంటి ఎడ్ల బళ్ళు చూశారా? మీకెవరికైనా ఈ చక్రంలో ఉండే వివిధ భాగాలు, వాటి పేర్లు తెలుసా?


~సూర్యుడు :-)

Sunday, June 26, 2022

కొన్ని పుస్తకాలు మరియు నవలలు

ఇంతకుముందు కొన్ని పుస్తకాలు చదివాను కదా. కొన్ని మన దేశం గురించి కూడా చదివితే బాగుంటుందని అనిపించి, బి రామన్ వ్రాసిన ది కావో బాయ్స్ అఫ్ ఆర్ ఏ &డబ్ల్యు మరియు విక్రమ్ సూద్ వ్రాసిన "ది అనెండింగ్ గేమ్" పుస్తకాలు చదివాను. రెండు పుస్తకాలు చాలా బాగున్నాయి. మొదటిది ఒక రకంగా ఆత్మ కథ లాంటిదైతే రెండవది గూఢచర్య వృత్తి గురించి. రెండు పుస్తకాలు చదవవలసినవే. మొన్నెప్పుడో జల్సా సినేమా చూస్తుంటే అందులో "ది అనెండింగ్ గేమ్", వింతేమీ లేదు, గమనించాను, అంతే. అడ్రియన్ లెవీ మరియు కాథీ స్కాట్ - క్లార్క్ లు వ్రాసిన గూఢచారుల కథలు చదువుతుంటే అందులో బి. రామన్ ని జార్జ్ స్మైలేయ్ తో పోల్చారు అంటే గొప్పవాడనే కదా అర్థం. సరే, ఈ రెండు పుస్తకాలు చదువుతున్నంతసేపు అంతర్లీనంగా రష్యన్ గూఢచార వ్యవస్థ మీద సానుభూతి, అమెరికన్ రష్యన్ గూఢచార వ్యవస్థ మీద వ్యతిరేకత కనిపించింది (నాకలా అనిపించి ఉండవచ్చు).  సాధారణంగా గూఢచార సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండి, దేశ ప్రయోజనాలే ముఖ్యోద్దేశంగా పనిచేయాలి. ఎప్పుడైతే వీటి నాయకత్వం బలహీనమౌతుందో అప్పుడు ఈ సంస్థలు కూడా బలహినమై పాలకవర్గానికి బానిసలవుతాయి. ఇదే విషయాన్ని The Recruiter by Douglas London లోను, విక్రమ్ సూద్ వ్రాసిన "ది అనెండింగ్ గేమ్" పుస్తకంలోనూ కనిపించింది / అనిపించింది. ముఖ్యంగా Douglas London తన పుస్తకంలో ఏమంటాడంటే, గూఢచారి సంస్థలు పాలకులకి నిజాల్ని చెప్పాలని (స్పీక్ ట్రూత్ టు పవర్), నిజం నచ్చనిదైనా సరే. 

 

కొన్ని సంవత్సరాల క్రితం Jason Matthews వ్రాసిన ఎఱ్ఱ పిచ్చుక అనే నవల చదివాను, ఆతర్వాత అదే రచయిత వ్రాసిన ది ప్యాలస్ అఫ్ ట్రీసన్ నవల కొన్నాను కానీ ఇప్పటివరకు చదవలేదు. ఈ మధ్య మొదలుపెట్టిన గూఢచారుల కథలు ఆపేసి ది ప్యాలస్ అఫ్ ట్రీసన్ నవల పూర్తిచేశాను, ఇది కూడా బాగుంది. ఇప్పుడు అతను వ్రాసిందే ది క్రెమ్లిన్'స్  కాండిడేట్ చదువుతున్నాను, ఇంకా మొదట్లో ఉన్నాను, బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను.

 

పుస్తకాలు చదవడానికి సమయం దొరకడంలేదు :-(

 

~సూర్యుడు :-)

 

Sunday, March 6, 2022

రెండు పుస్తకాలు

ఈ మధ్య ఓ రెండు పుస్తకాలు చదివాను. వాటిని నవలలు అనడానికిలేదు. The Recruiter by Douglas London and First Causality by Toby Harnden. మొదటిది ఒక సి ఐ ఏ మాజీ ఉద్యోగస్తుని ఆత్మకథలాంటిది, రెండవది సెప్టెంబర్ 2001 దాడి తర్వాత అమెరికా ఆఫ్గనిస్తాన్లో తాలిబాన్లని ఎలా ఓడించారో వివరించే కథ. రెండు బాగానే ఉన్నాయి. మొదటిది ఎక్కువగా నచ్చింది. రచయిత వివరించిన ప్రకారం సీఐఏ గూఢచారులను కేస్ ఆఫీసర్స్ అనాలిట, ఏజెంట్స్ కాదు. అసలు ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది, ఎన్నిరకాల నిఘా విభాగాలున్నాయి, ఎన్నిరకాలుగా సమాచారాన్ని సేకరిస్తారో చాల చక్కగా వివరించారు. అసలు ఏజెంట్స్ ను ఎలా కనిపెట్టి చేర్చుకుంటారో, ఆ తర్వాత వాళ్ళని ఎలా కాపాడుకుంటూ సమాచారాన్ని సేకరిస్తారో - చాల కుతూహలంగా అనిపించింది. ఇది గూఢచారి వర్గాలకే కాకుండా మానవ సంబంధాలను వారి మానసిక పరిస్థితిని వాడుకుని నేర్పుగా ఎలా పనులు చేయించుకోవాలో తెలుసుకోవడానికికూడా ఉపయోగపడుతుంది. మంచి పుస్తకం. 


రెండవది చాల వరకు సీఐఏ రహస్యంగా ఎలా ముజాహిద్దీన్లను చేరదీసి ఆయుధాలు సమకూర్చి తాలిబన్లను తరిమికొట్టారో వివరించే కథ. ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్. మొదటి పుస్తకంలో చెప్పినట్టు, ఇందులో పనిచేసిన సీఐఏ విభాగం కమాండోలది. 

 

ది ఆఫ్ఘనిస్తాన్ పేపర్స్ పుస్తకం కొన్నాను, చదవాలి ఎలా ఉంటుందో.


~సూర్యుడు :-)

Wednesday, December 22, 2021

మూడు నవలలు

ఈ మధ్య ఓ మూడు నవలలు చదివాను. అవి Billy Summers by Stephen King, The Judge's List by John Grisham and Damascus Station by David McCloskey. మూడు నవలలు బాగున్నాయి, అదే వరుస క్రమంలో. 

 

Billy Summers ఒక sniper కథ. నేనింతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు, ఇదే మొదటిది. అంత గొప్పగా లేనప్పటికీ పరవాలేదు. 

 

The Judge's List ఒక న్యాయమూర్తి కథ. తనకు జరిగిన (perceived) అవమానాలకు, మోసాలకు ప్రతీకారంగా ఒక చిట్టా తయారు చేసి వాళ్ళందరిని ఎవరికీ దొరక్కుండా ఎలా చంపాడో వివరించే కథ. ఉత్కంతంగా ఉండి బాగుంది. 


Damascus Station is the best, love story, err, spy story or a Spy's Love Story 😀. వేళాకోళాల్ని ప్రక్కనపెడితే, నవల చాలా బాగుంది. సిరియా upraising నేపథ్యంలో జరిగిన కథ. స్పై నవలలు ఇష్టపడేవారు తప్పకుండ చావాల్సిన నవల. నవలా రచయిత David McCloskey CIA లో  పనిచేసి ఉండడం వల్ల నవలకు కొంత సాధికారత వచ్చిందనిపించింది. వ్రాసిన విధానం కూడా చాలా బాగుంది. 

 

ప్రస్తుతానికి Douglas London వ్రాసిన The Recruiter చదువుతున్నాను. ఇది నవల కాదు. ఒకరకంగా ఒక CIA మాజీ ఉద్యోగస్తుని ఆత్మకథలాంటిది. సాధారణంగా నాకు ఆత్మకథలు అంతగా నచ్చవు కానీ ఇందులో కొన్ని నిజంగా జరిగిన సంఘటనల్ని వివరించడంవల్ల ఇప్పటివరకు బాగానే ఉంది. 

 

కోవిద్-19 ఓమిక్రాన్  వైరస్ విపరీతంగా వ్యాపించే అవకాశాలుండడంవల్ల మామూలు మాములుగా కోవిద్-19 జాగ్రత్తలు అన్ని పాటించి ఆరోగ్యంగ ఉంటారని ఆశిస్తూ ... 


~సూర్యుడు 😷

Sunday, September 12, 2021

ది చెలస్ట్ (The Cellist)

చాలా రోజుల తర్వాత మళ్ళీ గాబ్రియల్ అలన్ నవల ది చెలస్ట్  (The Cellist) చదివాను. ఇంతకు ముందు Daniel Silva నవలల్లాగే ఇదికూడా బాగుంది. ఒక రష్యన్ సంపన్నుడు ఇంగ్లాండ్ లో హత్యకు గురికావడంతో మొదలవుతుంది ఈ నవల. ఈ రష్యన్ గాబ్రియల్ అలన్ కు స్నేహితుడు కావడంతో ఆ హత్యకు కారణమైన వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ఈ నవల.

చివర్లో, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు, వాటి ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గొడవలు, రచయిత యొక్క రాజకీయ అభిప్రాయాలు ప్రస్తావించబడ్డాయి. ఇంతకుముందునుండి అనుకుంటున్నదే కానీ ఇది చదివిన తర్వాత మళ్ళీ అనిపించిందేమంటే, ప్రజలను ఎక్కువగా పోలరైజ్ (దీనికి తెలుగులో ఏ పదం వాడాలి?) చేసేయ్యకూడదు. ఇది మితిమీరితే ఒకే దేశంలో రెండు దేశాలు ఉన్నట్లుంటుంది. రాజకీయ పక్షాలకు, వాటి నాయకులకు పరిణతి లేకపోతే వచ్చే చిక్కే ఇది. ఇంతకు ముందు మనదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఓ రెండు చాలవా అనిపించింది కానీ బాగా ఆలోచిస్తే ఎక్కువ ఉండడమే మంచిదనిపిస్తోంది. 

ఈ నవల తర్వాత ఎప్పటినుండో ఆగిపోయిన టైఫూన్ నవల పూర్తిచేసేసాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా తర్వాత తర్వాత చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ నవలల్లో ఇదే బెస్టేమో. హాంగ్ కాంగ్ ను బ్రిటిష్ రూలింగ్ నుండి చైనా కు అప్పచెప్పే సమయంలో జరిగిన కథ ఇది. నాకు చాలా నచ్చింది. 

ఇంతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు కానీ ఈమధ్యనే Billy Summers కొన్నాను. చదవాలి, ఎలా ఉంటుందో ... 


~సూర్యుడు :-)

Sunday, May 23, 2021

ఊరికే ఊసుపోక ...

ఈమధ్య బ్లాగుకొచ్చి చాలా రోజులైపోయింది. ఇంట్లోంచి పనంటే మొదట్లో బాగానే ఉన్నా, పని సమయానికి కుటుంబ సమయానికి మధ్య తేడా చెరిగిపోయి ఎంతసేపు కంప్యూటర్ ముందు కూచుంటుంటే ఇంకేమైనా చెయ్యడానికి సమయమెక్కడుంటుంది, కదా?


సరే ఎంత తీరికలేకున్నా మనకి నచ్చిన పనులు చెయ్యడానికి సమయమెప్పుడూ ఉండనేవుంటుంది 😁


నచ్చినపనంటే ఇంకేముంటుంది పుస్తకాలు చదవడం తప్ప. పుస్తకాలు కొనడమైతే ఎక్కువే కొనుక్కున్నాను కానీ అన్ని చదవడం కుదర్లేదు. ఇది మామూలే కదా. మళ్ళీ David Baldacci నవలలు, A Minute To Midnight తర్వాత Walk the wire చదివాను. ఈ రెండు నవలలు బాగున్నాయి. అమెరికా లో కూడా అందరూ గొప్పవాళ్లే కాదు పేదలు కూడా ఉంటారని, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో కొద్దిగా తెలుస్తుంది.


ఈమధ్య Joseph Kanon నవలలు కొన్ని కొన్నాను. The Accomplice తర్వాత The Prodigal Spy నవలలు చదివాను. మొదటిది ఓమాదిరిగా ఉంది. The Prodigal Spy నవల నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు The Alibi, Stardust తర్వాత The Good German నవలలు చదువుదామని మొదలుపెట్టాను కానీ ఏదీ ముందుకు వెళ్లడంలేదు. అలాగే Jo Nesbo నవల The Kingdom కొని మొదలుపెట్టాను కానీ అదికూడా ముందుకి కదలడంలేదు. 

 

ప్రస్తుతానికి నవలలు చదవడం ఆపేసి రెండో కెరటం భారతదేశాన్ని ఎలా ముంచేస్తోందో చూడ్డంలో మునిగిపోయాను. ఏదేమైనా ప్రజలు ప్రభుత్వాలూ అశ్రద్ధచేసి తలమీదకి తెచ్చుకున్న వ్యవహారమిది. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి, ప్రభుత్వాలు ముందుగా మేలుకునివుంటే ఇంత ఉత్పాతము సంభవించేదికాదు కదా. సరే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మనకి కొత్తేమీకాదు.

 

https://www.thehindu.com/news/national/coronavirus-negative-covid-report-isnt-the-end-of-problem-warn-doctors/article34621913.ece?homepage=true


ఈమధ్య ఈక్రింద వ్యాసాన్ని చదివాను. అందులోంచి నాకు నచ్చిన ఓ పంక్తి ... 

https://www.ndtv.com/opinion/opinion-why-modi-shah-hyped-bengal-so-much-by-yashwant-sinha-2426394


Separately, the Congress has been a major loser in these elections. The Left has at least won Kerala and created history by being the first government in 40 years to be re-elected. There was some hope for the Congress in Assam but it failed there also. The time for serious introspection for the Congress party is now. It cannot postpone it forever. If a non-Gandhi has to lead the Congress party, then so be it, otherwise we may soon see a 'Congress-mukt Bharat'. That will be tragic indeed. The Congress party must live, if not for itself, then at least for the country.

 

నాక్కూడా అనిపిస్తుంది, కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఆలోచన, అదెప్పటికీ కనుమరుగవ్వదు, ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్య్రాలమీద  నమ్మకమున్నంతవరకు ... 

 

సరే ఎవరింటి కాపలా కుక్కలు వాళ్లకి, ఎవరి డబ్బాలు వాళ్లకి ఉంటాయనుకోండి 😃

 

~ సూర్యుడు :-)

Friday, September 18, 2020

ఈ మద్య నేను చదివిన నవలలు

నేను చదివిన నవలలు గురించి చెప్పేముందు కోవిడ్ 19 గురించి కొద్దిగ చెప్పుకోవాలి. పని ఎక్కువైపోయింది, భయం పెరిగిపోయింది, ఇది ఇప్పట్లో తగ్గదన్న విషయం తెలిసిపోయింది. ఇంక చేసేదేమీ లేదుకనుక పుస్తకాలు చదవడం మొదలుపెడదామనుకున్నాను, అదీ కుదరడంలేదు :-(

 

సరే టైఫూన్ మొదలుపెట్టానా ఆదీ ఇంతకుముందు చార్లెస్ కమ్మింగ్స్ నవలల్లాగే ముందుకుకదలడంలేదు. అమెజాన్ వాడు ఫ్రీగా ఇచ్చిన కిండిల్ నవలేదో ఏ ల్యాక్ ఆఫ్ మోటివ్ బై స్టీఫెన్ పెన్నెర్ చదివాను. ఇది లీగల్ థ్రిల్లర్ కానీ మనకి అమెరికా లీగల్ సిస్టం గురించి తెలిసుండాలి. టైంపాస్ నవల, చిన్నదనుకుంటా, బాగానే ఉంది. ఇప్పుడు అదే రచయితది ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ చదువుతున్నాను, ఇదికూడా బాగానే ఉంది. 


ఈమధ్యలో డేవిడ్ ఇగ్నాటియస్ "ది పలాడిన్" అన్న నవల ఒకటి చదివాను, చాలా బాగుంది. ఇది చార్లెస్ కమ్మింగ్స్ ది మాన్ బిట్వీన్ నవలకు నెక్స్ట్ వెర్షన్ లా అనిపించింది. అసలు సోషల్ మీడియాను ఎలా దుర్వినియోగపరచొచ్చో ఇందులో బాగా చెప్పాడు. ఒకసారి తప్పకుండా చదవాల్సిన నవల. 


తర్వాత డానియల్ సిల్వా "ది ఆర్డర్" చదివాను. ఇదికూడా ఇంతకుముందు డానియల్ సిల్వా నవలల్లాగానే బాగుంది. మధ్యలో కొంత హిస్టరీ టెక్స్ట్ బుక్ లా అనిపించినా, ఓకే. ఇంకో గాబ్రియల్ అలన్ నవల :-)

 

Daniel Silva interview on FB




 


మళ్ళీ టైఫూన్ మొదలుపెట్టాలి లేదా ఇంకేమైనా నవలలుంటే చూడాలి :-)


~సూర్యుడు :-)

Saturday, July 18, 2020

Trinity Six - Charles Cumming

చాలా రోజుల తరవాత మొత్తానికి ట్రినిటీ సిక్స్ నవల చదవడం పూర్తి చేశాను. మొదట్లో విసుగనిపించినా తర్వాత కొద్దిగా పరవాలేదనిపించింది. ఈ రచయిత నవల్లో లోపమో లేక నా ఆలోచనా లోపమో తెలియదు కాని నాకు పెద్దగా నచ్చటంలేదు.

కేంబ్రిడ్జి గూఢచారుల గుంపులో, బయటపడని ఆరో వ్యక్తి ఉన్నాడనే ఊహతో వ్రాసిన నవల. నాకైతే బోళ్ళు రంధ్రాలు కనిపించాయి, నా చదవడం (ఊహా శక్తి) లోనే లోపం ఉండుంటుంది

ఏదేమైనా ఈ నవలని పూర్తిచేసి ఇదే రచయితది, టైఫూన్ మొదలుపెట్టాను, చూడాలి ఎలా ఉంటుందో.

డానియల్ సిల్వా క్రొత్త  నవల, ది ఆర్డర్ వచ్చింది, కొని చదవాలి.


ఆ మద్య ఎప్పుడో ఓ టపా ఆసక్తికరమైన ప్రసంగం. అప్పుడు ఆసక్తికరమైన చర్చ అని వ్రాసినట్టు గుర్తు కాని అది YouTube లంకె అయ్యుంటుంది, ఆ తర్వాత YouTube లంకె కనిపించకుండా పోవడంతో ఇక్కడకూడా కనిపించకుండా పోయింది. ఇప్పుడు Ted లంకె ఇచ్చాను. వీలైతే చూడండి.


~సూర్యుడు :-)

Monday, December 23, 2019

చార్లెస్ కమ్మింగ్ ఇంకొన్ని నవలలు

A Foreign Country, A Colder War, A Divided Spy, The Man Between, A Spy By Nature చదివిన తరువాత, The Spanish Game, The Hidden Man చదివాను. ఈ రెండు నవలలు కూడా ఇంతకుముందు వాటిల్లానే ఉన్నాయి. చార్లెస్ కమ్మింగ్ రచనా విధానం కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చడం లేదు. ముఖ్య పాత్రలు ప్రవర్తించే విధానం అర్ధం చేసుకోవడమే కష్టంగా ఉంది. Sometime I feel they were behaving amateurishly. Any how, though there were hints, Sebastian Roth being an SIS agent was kind of a suspense. The Spanish Game లో కూడా అలెక్ ఎలా CIA, Spanish రెవల్యూషనరీ గ్రూపుల వల్ల ఎలా మోసపోయాడో, లేదా అలెక్ ని ఈ రెండు గ్రూపులు ఎలా వాడేసుకున్నాయో అర్ధంచేసుకునేసరికి కొద్దిగా తల తిరిగింది. This wasn't new. Even in The Man Between, hero gets cheated by an SIS imposter. This is the main thing I didn't like in the description of heroes. They were so gullible that I don't know if they can be fit for spying. Of course, even David Ignatius' novel, Agents of Innocence portraits the CIA agents as innocent.

ఇంకో రెండు నవలలు  మిగిలాయి చదవడానికి ది ట్రినిటీ సిక్స్ తర్వాత టైఫూన్. ఏది మొదలు పెడదామా అని ఆలోచనలో ...

The Spies of Warsaw ఇంకా పూర్తవ్వలేదు. Too many to chose from and of  course to complete :-)

~సూర్యుడు :-)

Sunday, December 1, 2019

A Spy By Nature

మొత్తానికి A Spy By Nature నవల పూర్తిచేసాను, yay :-)

నవలంతా చదివినతర్వాత ఇందులో నవలా నాయకుడు, Alec, A Spy By Nature ఎలా అయ్యాడో అర్థంకాలేదు. సరే, ఇది Charles Cumming మొదటి నవల కాబట్టి ఓకే. నవల వ్రాసిన విధానం బాగుంది. కథ కొద్దిగ నెమ్మదిగా కదులుతుంటుంది. చదవాలంటే బాగా ఓపికుండాలి. కొద్దిగా సమకాలీన సమాజం గురించి కొన్ని ప్రస్తావనలుంటాయి. ఈ రచయిత Conservative Party అభిమాని అనిపించింది.

ఇప్పుడు ది స్పానిష్ గేమ్ చదవడం మొదలుపెట్టాను. ఇందులో కూడా కథా నాయకుడు Alec. ఇప్పటిదాకా కథ అంతా స్పెయిన్ లో నడుస్తోంది. నాకిప్పటిదాకా Spain ప్రజలకి చదరంగం అంటే ఇష్టమని తెలీదు. Alec స్పెయిన్ లో అజ్ఞాతవాసంలో ఉన్నాడు, MI 5/6, సిఐఎ లనుండి తప్పించుకోడానికి. సో ఫార్ సో గుడ్. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో ...

The Spies of Warsaw మళ్ళీ బయటకుతీసాను కానీ, ది స్పానిష్ గేమ్ చదివిన తర్వాత చూడాలి, The Spies of Warsaw న లేక ది హిడెన్ మాన్ చదవాలా అని.

~సూర్యుడు (feeling a better spy by nature than Alec) :-)

Sunday, November 24, 2019

The Man Between

సరే A Spy By Nature మళ్ళీ మొదలు పెట్టాను కానీ అది ముందుకు కదలకపోవడంతో The Man Between తీసి మొదలుపెడితే ఉత్కంఠంగా ఉండి పూర్తి చేసాను. ఈ నవల బాగుంది, రంధ్రాలున్నాకూడా.

ఇది ఆమధ్య వచ్చిన Occupy Wall Street లాంటి ఉద్యమాలెలా మొదల్యయ్యాయో అనే ఇతివృత్తాన్ని తీసుకుని వ్రాసిన నవల. ఈ నవలాకారుడు కల్పన ప్రకారం ఇవన్నీ రష్యా గూఢచారి సంస్థ ప్రోద్బలంతో జరిగిన ఉద్యమాలని.

ఇలాంటివి చదివితే సామాజిక ప్రసార సాధనాలు వాడుకొని వేరే దేశంవాళ్ళు ఇంకొక దేశ ఎన్నికలను ప్రభావితం చేయడం పెద్ద కష్టమేమీకాదేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నికలేమిటి వివిధ మత వర్గ ప్రాంత ప్రజలమద్య చిచ్చుపెట్టి దేశాన్ని విఛ్చిన్నం చెయ్యడానికికూడా అవకాశముందనిపిస్తుంది.

రాక్షసులు లేకపోతే మనుషులకి దేవుడి అవసరమేముంది ;-)

~సూర్యుడు :-)

Sunday, November 3, 2019

A Divided Spy

చార్లెస్ కమ్మింగ్ నవల A Divided Spy చదవడం పూర్తయ్యింది. ఇది టామ్ కెల్ సిరీస్ లో (మూడవది) చివరిది, ఇప్పటివరకు. ఇదికూడా ఇంతకుముందు రెండు నవలల్లా బాగుంది. ఇతను కూడా MI6 వాడైనా జేమ్స్ బాండ్ లాంటి స్పై కాడు. ఫైటింగులు తక్కువ వెంటపడటాలు ఎక్కువ. ఇది A Colder War కొనసాగింపు. టామ్ కెల్ ఒక రష్యన్ గూఢచారి మీద పగ తీర్చుకొనే ఇతివృత్తం మీద ఆధారపడ్డ నవల. వీళ్ళిద్దరిమద్య విరోధం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే A Colder War నవల చదవాలి.

 ఇప్పుడు మళ్ళీ A Spy By Nature చదవడమా లేకపోతే వేరేదేమైనా చదువుదామా అని ఆలోచించి ప్రస్తుతానికి The Hidden Man బయటకు తీసాను. ఇదెలాగుంటుందో చూడాలి.


~సూర్యుడు :-)

Sunday, October 27, 2019

ఈమద్య చదివిన నవలలు

ఆమద్య Charles Cumming నవలలు కొన్ని కొని చదవకుండా వదిలేసాను. నిజానికి A Spy By Nature మొదలుపెట్టాను కాని సగం దాకా చదివేసరికి ఎందుకో ఆపేసాను. ఇప్పుడు దాన్ని వదిలేసి A Foreign Country మొదలుపెడితే చాలా ఆసక్తికరంగా అనిపించి మొత్తం చదివేసాను. ఈ నవల చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ మొదట్లో MI6 లో పనిచేసాడుట. పని చేయడం వేరు, బాగా వ్రాయగలగడం వేరు. కానీ ఈ నవల చాలా బాగుంది.


ఆ స్పూర్తితో దాని తర్వాత నవల, A Colder War మొదలుపెట్టి, అది కూడా పూర్తి చేసాను. ఇది కూడా బాగుంది. మద్యలో ఎవరు ఎవరి asset అని చెప్పడంలో కన్ఫ్యూస్ అయ్యాడేమో అనిపించింది, కానీ నేను కూడా కన్ఫ్యూస్ అయ్యుండొచ్చు :). ఏదేమైనా ఈ నవల కూడా చాలా బాగుంది.


ఇప్పుడు దాని తర్వాత నవల, A Divided Spy మొదలుపెట్టాను. చూడాలి ఇది ఎప్పుడు పూర్తవవుతుందో. సో ఫార్ సో గుడ్. ఈ నవలలన్నిటిలో కధా నాయకుడు థామస్ (టామ్) కెల్ . మీరుకూడా చదవాలనుకుంటే A Foreign Country తర్వాత A Colder War దాని తర్వాత A Divided Spy చదివితే బాగుంటుంది.

 దీని తర్వాత మళ్ళీ A Spy By Nature మొదలుపెట్టి చూడాలి :-)

అందరికీ నరకచతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు /|\

 ~సూర్యుడు :-)
 

Thursday, August 15, 2019

క్రొత్త అమ్మాయి

ఈ మద్య డానియల్ సిల్వా క్రొత్త అమ్మాయి (The New Girl) చదివాను. డానియల్ సిల్వా నవలల్లో బెస్ట్ కాదు కానీ బాగానే ఉంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు రష్యా ఇతివృత్తం మీద ఆధారపడ్డ కథ. ఎప్పటిలాగానే కథనం బాగుంది కానీ చాలా ఆన్రియలిస్టిక్ గా అనిపించింది. అమెరికా పాత్ర తగ్గడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆ దేశ ప్రాముఖ్యత తగ్గడాన్ని సూచిస్తుందేమో.

ఆసియన్ సెంచరీ అని ఉదహరించినప్పుడు రష్యా, చైనా, ఇరాన్ అని చెప్పారు కానీ, ఇండియాని కలపలేదు. మనం సరితూగమో లేక అంతర్జాతీయ రాజకీయాల్లో మన పాత్ర అంతంత మాత్రమో  :)

కధలో పాత్రలన్నీ తెలిసినవే, గాబ్రియేల్, ఎలి, యూజి, కెల్లర్, మిఖాయిల్, సారా (మన సారా కాదు :)), అరి etecetra etecetra. డానియల్ సిల్వా నవలలు చదివినప్పుడల్లా గుర్తుకొచ్చేది, మధుబాబు నవలలు, అందులో పాత్రలు. కొన్ని పాత్రలు వచ్చినప్పుడు మనం కొన్ని expect చేస్తాం, అవి ఇలా ఇలా చేస్తాయని, రచయిత గొప్పదనం వాటిని consistent గా maintain చెయ్యడం లోనే ఉంటుందేమో


ఎనీవేస్ ఇంకొక గాబ్రియల్ అలాన్ థ్రిల్లర్ ...


I think the phrase in this novel, "What has been done can't be undone" is a nice one.


~సూర్యుడు :-)



Friday, December 7, 2018

The Director / ద డైరెక్టర్

ద ప్రెసిడెంట్ ఈస్ మిస్సింగ్ నవల చదువుదామని మొదలుపెడితే ఎంతకీ ముందుకి కదలడంలేదు. సరే అని ద డైరెక్టర్ నవల మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇంక ఆపాలనిపించలేదు. చాలా ఉత్కంఠంగా ఉండి బాగుంది. మొత్తంమీద చూస్తే చాలా రంధ్రాలున్నాయి కాని ఇలాంటి నవలల్లో అవన్నీ ఓకే :)


సైబర్ హ్యాకింగ్ ప్రధానాంశంగా చేసుకుని వ్రానసిన నవల. ముఖ్యంగా స్నోడెన్ వ్వవహారం, వికీలీక్స్  తర్వాత అలాంటివి జరిగే అవకాశాన్ని చెప్పటం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. అసలు సి.ఐ.ఏ ఎలా ఉద్భవించింది దాని చరిత్ర కొంత.


సో, ఇంక సన్ కింగ్ ఒక్కటే మిగిలింది, David Ignatius నవలల్లో చదవటానికి. అదికూడా చదివేస్తే ఓ పనైపోతుంది :)

~సూర్యుడు :-)

Thursday, November 15, 2018

ద ఇంక్రిమెంట్

మొత్తానికి ద ఇంక్రిమెంట్ నవల పూర్తిచేసాను. చాలా బాగుంది.  ఇప్పటిదాకా చదివిన David Ignatius నవలల్లో ఇదే బెస్టేమో. నవల చాలా ఉత్కంఠంగా ఉండి ఎక్కడా విసుగనిపించదు. Daniel Silva నవలల్లో వస్తుంటుంది, ఇరాన్ సీక్రెట్ సర్వీస్  Taqiyya (I think it is used in the sense of deception) సూత్రం ఆధారంగా పనిచేస్తుందని కానీ ఈ నవలలో, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డెసెప్షన్ వాడి ఇరాన్ న్యూక్లియర్ పోగ్రామ్ ని ఎలా సబొటాజ్ చేసిందో వివరించే కథే ఈ ద ఇంక్రిమెంట్ నవల.

ఈ క్రింద నవలలు చదవడం పూర్తయ్యింది:

  1.  Agents of Innocence
  2.  Bloodmoney
  3.  The Bank of Fear
  4.  A Firing Offense
  5.  Siro
  6.  Body of Lies
  7.  The Quantum Spy
  8.  The Increment

ఇవి ఇంకా చదవాలి:

  1.  The Director
  2.  The Sun King