Saturday, December 8, 2018

మాయావి / మాయావిని సంక్షిప్త నవలలు

చాలారోజుల క్రిందట, అంటే చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పాత యువ పత్రికల్లో చదివిన నవలలు అంటే సంక్షిప్త నవలలు, మాయావి / మాయావిని. తర్వాత అవి ఎలాగో కనిపించకుండా పోయాయి. తర్వాత అంతర్జాలంలో ఎంత వెతికినా అవి కనిపించలేదు. ఈమధ్య ఎవరో మళ్ళీ ఆ నవలల గురించ్చి ప్రస్తావిస్తే మళ్ళీ వెతికితే ఎవరో పాత యువ పత్రికల్ని అంతర్జాలంలో పెడితే వాటిలో 1964 డిసెంబర్ పత్రికలో మాయావి కనిపిస్తే పొందిన ఆనందం ఇంతా అంతా కాదు :). దురదృష్టవశాత్తు మాయావిని ప్రచురింపబడ్డ 1965 జనవరి పత్రిక దొరకలేదు :(. మళ్ళీ ఒక సారి అరిందముడు, పూల్ సాహెబు, జుమీలియా, దేవేంద్ర విజయమిత్రుడిని పలకరించి పులకరించి ఇలా మీతో పంచుకోవాలనిపించి, అదీ సంగతి ...

మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)

~సూర్యుడు :-)

11 comments:

శ్యామలీయం said...

పాంచ్ కడీ దేవ్ వ్రాసిన డిటెక్టివ్ నవలలు ఇవి మూడు. మాయావి, నీలాంబరి, మాయావిని. ఎప్పుడో అరవయ్యవ దశకంలో తూ.గో.జిల్లా కొత్తపేట లైబ్రరీలో చదివాను. యువలో సంక్షిప్తనవలల రూపంలో కాదు. పూర్తిసైజు నవలల రూపంలోనే. దేవేంద్రవిజయుడా ఉపేంద్రవిజయుడా? ఈ ఒక్కపేరు దగ్గర పొరబడ్డా రనుకుంటాను. ఒకవేళ నేనే పొరబడ్డానేమో.

సూర్యుడు said...

శ్యామలీయం గారు:

ఈ టపా చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదములు.

అపాత్ర పేరు దేవేంద్ర విజయమిత్రుడేనండి, పొరపాటుపడలేదు :)

~సూర్యుడు

nmrao bandi said...

సూర్యుడు గారు నమస్తే.
పాంచ్ కడీ దేవ్ వ్రాసిన డిటెక్టివ్ నవలలు ఒకటో రెండో
నేను కూడా చదువుకునే రోజుల్లో చదివిన గుర్తు. పూర్తిగా
చదివిందీ లేనిదీ కూడా గుర్తు లేదు. ఒక విషయం బాగా
గుర్తు 'ఆ నవలలు చాలా ఇంటరెస్టింగ్' గా ఉంటాయి.
నేనూ ఎప్పటినుంచో ఆ నవలలు తిరిగి చదవడానికి
చాలా ఆసక్తిగా ఉన్నాను. మీరు చదివిన'మాయావి' లింక్
దయచేసి ఇవ్వగలరు. ఇతర నవలలు దొరికే సందర్భంలో
కూడా దయచేసి మీ బ్లాగ్ లో ఆ లింక్ లు షేర్ చేయగలరు.
అలాగే 'రోషనార' గురించి కూడా ఏవైనా నావెల్స్, లింక్స్
వుంటే దయతో షేర్ చెయ్యగలరు.
థాంక్ యు సర్, ఫర్ యువర్ టైం.

Chiru Dreams said...

http://www.teluguthesis.com/2013/06/mayavini-novel.html

nmrao bandi said...

thank you very much chiranjeevi garu ...

సూర్యుడు said...

@Chiranjeevi Y: Thank you for sharing maayaavini link. What I read in Yuva was in modern Telugu and this book is in Old Telugu (or grandhika). Thanks again.

@nmrao bandi:

Here is the link to 1964 Dec Yuva magazine. This has maayaavi novel:

https://www.mediafire.com/file/bc92fvjkb2619f7/yuva_196412.pdf

~సూర్యుడు

శ్యామలీయం said...

నేను చిన్నతనంలో కొత్తపేట లైబ్రరీలో చదివిన మాయావిని నవల Chiranjeevi గారు చూపిన పుస్తకమే.

Chiru Dreams said...

కృతజ్ఞతలు సూర్యుడుగారు. ఇప్పుడే చదువుతాను..

శ్యామలీయంగారూ! మీరు చదివిన మాయావి ఎలావుంది?

శ్యామలీయం said...

అప్పట్లో నేను చదివిన పాంచ్ కడీ దేవ్ నవలలు మూడూ వేంకట పార్వతీశ కవుల అనువాదాలే.

nmrao bandi said...

Oh good! This version surely makes the reading pleasant and comfortable. Thanks a lot sir ...

addala said...

నేను 1950లలో కాకినాడ "ఓం తత్ సత్" భవనంలో లైబ్రరీ లో మాయావి, మాయావిని, .?.. అని మూడు డిటెక్టివ్ నవలలు ఎంతో ఉత్సాహంగా చదివాను. గొప్ప రచనలు.