Saturday, December 7, 2019

మీరు రేడియో ప్రియులా ...

టెలివిషన్ అందుబాటులోలేని రోజుల్లో రేడియో చాలా ముఖ్యమైన ప్రసార సాధనం. అంతేకాదు కొన్ని తరాలు రేడియో (ఆకాశవాణి) సమయాలు / కార్యక్రమాలు ప్రకారముగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరుపుకొనేవారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు రేడియో అంటే FM రేడియోనే. పల్లెల్లోనే రేడియోలు పోయి TVలు వచ్చేశాయి. అయితే ఈమధ్యకాలంలో TV ప్రసారాలు (సరే నేనీమధ్య దూరదర్శన్ చూడలేదు) చూసినట్లయితే చాలా చిరాగ్గా ఉంటున్నాయి. వార్తా ఛానెల్స్ గురించి చెప్పనక్కర్లేదు, ఓ పదిమందిని పిలిచి కొట్లాటపెట్టి జనాలకు మనోరంజనాన్ని చేకూరుస్తుంటారు.

మరి వేరే ఏమైనా ప్రత్యామ్నాయమేమైనా ఉందా అంటే, ఏమో మళ్ళీ పాత ఆకాశవాణి ఉపయోగపడుతుందేమో చూడాలి. ప్రసార భారతి వాళ్ళు న్యూస్ ఆన్ ఎయిర్ అని ఒక మొబైల్ app విడుదల చేశారు. మీరుకూడా ఆకాశవాణి ప్రియులైతే ఈ యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన ఆకాశవాణి కేంద్రంనుండి ప్రాసరమయ్యే కార్యక్రమాలు విని ఆనందించండి.

http://prasarbharati.gov.in/AIR/

https://play.google.com/store/apps/details?id=com.parsarbharti.airnews

ఏకాంబరాలు, పెద్దన్నలు, చిన్నక్కలు లేకపోయినా ఆకాశవాణి ప్రసారాలు ఇంకా అంతే ఆసక్తికరంగా ఉంటాయని / ఉండాలని కోరుకుంటూ ...

~సూర్యుడు :-)

3 comments:

Sruti said...

రేడియో స్టేషన్లు వింటుంటే చిన్నతనం జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.. ఇంతకాలం ఈ టివి వచ్చాక ఎంత కోల్పోయామో తెలిసింది. తెలుగు ఆకాసవాని స్టేషన్లు ఇక్కడ వినండి http://indiaradios.blogspot.com/

Lalitha said...

That’s a treasure trove of AIR stations. Thanks a lot for sharing, Sruti garu!

Thanks to this blog owner for sharing the Prasarabharathi URL!

సూర్యుడు said...

Thanks, Sruti for sharing the radio blog. It is very nice.

లలిత: Thanks for your comment