Monday, March 28, 2022

Sunday, March 6, 2022

రెండు పుస్తకాలు

ఈ మధ్య ఓ రెండు పుస్తకాలు చదివాను. వాటిని నవలలు అనడానికిలేదు. The Recruiter by Douglas London and First Causality by Toby Harnden. మొదటిది ఒక సి ఐ ఏ మాజీ ఉద్యోగస్తుని ఆత్మకథలాంటిది, రెండవది సెప్టెంబర్ 2001 దాడి తర్వాత అమెరికా ఆఫ్గనిస్తాన్లో తాలిబాన్లని ఎలా ఓడించారో వివరించే కథ. రెండు బాగానే ఉన్నాయి. మొదటిది ఎక్కువగా నచ్చింది. రచయిత వివరించిన ప్రకారం సీఐఏ గూఢచారులను కేస్ ఆఫీసర్స్ అనాలిట, ఏజెంట్స్ కాదు. అసలు ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది, ఎన్నిరకాల నిఘా విభాగాలున్నాయి, ఎన్నిరకాలుగా సమాచారాన్ని సేకరిస్తారో చాల చక్కగా వివరించారు. అసలు ఏజెంట్స్ ను ఎలా కనిపెట్టి చేర్చుకుంటారో, ఆ తర్వాత వాళ్ళని ఎలా కాపాడుకుంటూ సమాచారాన్ని సేకరిస్తారో - చాల కుతూహలంగా అనిపించింది. ఇది గూఢచారి వర్గాలకే కాకుండా మానవ సంబంధాలను వారి మానసిక పరిస్థితిని వాడుకుని నేర్పుగా ఎలా పనులు చేయించుకోవాలో తెలుసుకోవడానికికూడా ఉపయోగపడుతుంది. మంచి పుస్తకం. 


రెండవది చాల వరకు సీఐఏ రహస్యంగా ఎలా ముజాహిద్దీన్లను చేరదీసి ఆయుధాలు సమకూర్చి తాలిబన్లను తరిమికొట్టారో వివరించే కథ. ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్. మొదటి పుస్తకంలో చెప్పినట్టు, ఇందులో పనిచేసిన సీఐఏ విభాగం కమాండోలది. 

 

ది ఆఫ్ఘనిస్తాన్ పేపర్స్ పుస్తకం కొన్నాను, చదవాలి ఎలా ఉంటుందో.


~సూర్యుడు :-)