Sunday, June 26, 2022

కొన్ని పుస్తకాలు మరియు నవలలు

ఇంతకుముందు కొన్ని పుస్తకాలు చదివాను కదా. కొన్ని మన దేశం గురించి కూడా చదివితే బాగుంటుందని అనిపించి, బి రామన్ వ్రాసిన ది కావో బాయ్స్ అఫ్ ఆర్ ఏ &డబ్ల్యు మరియు విక్రమ్ సూద్ వ్రాసిన "ది అనెండింగ్ గేమ్" పుస్తకాలు చదివాను. రెండు పుస్తకాలు చాలా బాగున్నాయి. మొదటిది ఒక రకంగా ఆత్మ కథ లాంటిదైతే రెండవది గూఢచర్య వృత్తి గురించి. రెండు పుస్తకాలు చదవవలసినవే. మొన్నెప్పుడో జల్సా సినేమా చూస్తుంటే అందులో "ది అనెండింగ్ గేమ్", వింతేమీ లేదు, గమనించాను, అంతే. అడ్రియన్ లెవీ మరియు కాథీ స్కాట్ - క్లార్క్ లు వ్రాసిన గూఢచారుల కథలు చదువుతుంటే అందులో బి. రామన్ ని జార్జ్ స్మైలేయ్ తో పోల్చారు అంటే గొప్పవాడనే కదా అర్థం. సరే, ఈ రెండు పుస్తకాలు చదువుతున్నంతసేపు అంతర్లీనంగా రష్యన్ గూఢచార వ్యవస్థ మీద సానుభూతి, అమెరికన్ రష్యన్ గూఢచార వ్యవస్థ మీద వ్యతిరేకత కనిపించింది (నాకలా అనిపించి ఉండవచ్చు).  సాధారణంగా గూఢచార సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండి, దేశ ప్రయోజనాలే ముఖ్యోద్దేశంగా పనిచేయాలి. ఎప్పుడైతే వీటి నాయకత్వం బలహీనమౌతుందో అప్పుడు ఈ సంస్థలు కూడా బలహినమై పాలకవర్గానికి బానిసలవుతాయి. ఇదే విషయాన్ని The Recruiter by Douglas London లోను, విక్రమ్ సూద్ వ్రాసిన "ది అనెండింగ్ గేమ్" పుస్తకంలోనూ కనిపించింది / అనిపించింది. ముఖ్యంగా Douglas London తన పుస్తకంలో ఏమంటాడంటే, గూఢచారి సంస్థలు పాలకులకి నిజాల్ని చెప్పాలని (స్పీక్ ట్రూత్ టు పవర్), నిజం నచ్చనిదైనా సరే. 

 

కొన్ని సంవత్సరాల క్రితం Jason Matthews వ్రాసిన ఎఱ్ఱ పిచ్చుక అనే నవల చదివాను, ఆతర్వాత అదే రచయిత వ్రాసిన ది ప్యాలస్ అఫ్ ట్రీసన్ నవల కొన్నాను కానీ ఇప్పటివరకు చదవలేదు. ఈ మధ్య మొదలుపెట్టిన గూఢచారుల కథలు ఆపేసి ది ప్యాలస్ అఫ్ ట్రీసన్ నవల పూర్తిచేశాను, ఇది కూడా బాగుంది. ఇప్పుడు అతను వ్రాసిందే ది క్రెమ్లిన్'స్  కాండిడేట్ చదువుతున్నాను, ఇంకా మొదట్లో ఉన్నాను, బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను.

 

పుస్తకాలు చదవడానికి సమయం దొరకడంలేదు :-(

 

~సూర్యుడు :-)