మసాగత్తు అంటే అర్థమేమిటి?
Thursday, December 28, 2023
Sunday, December 17, 2023
కథనం
ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది. ఎవరో తాతో ముత్తాతో లేదా అవ్వో ముత్తవ్వో ఆస్తులని సంపాదించారనో లేదా పాడుచేశారనో. రోజులు బాగుంటే ప్రతి తరం ముందు తరం కంటె బాగుండొచ్చు . అంతమాత్రాన అంతకుముందు తరం చేతకానివారని కాదు కదా. ఎవరికి చేతనైంది వారు చేస్తారు . టాటాలకు ఇప్పుడిన్ని ఆస్తులున్నాయంటే అవన్నీ రతన్ టాటానే సంపాదించారని కాదుకదా, అంతకుముందు జెఆర్డీ టాటా అంతకన్నాముందు జెంషెడ్జీ టాటా ఎవరికి కుదిరింది వారు చేసుంటారు. Sir Isaac Newton quote, If I have been able to see farther than others, it was because I stood on the shoulders of giants. అనుకోగలగడం గొప్ప. చేసేవాడు చేయించేవాడు వేరే ఉన్నాడు అని నమ్మినప్పుడు అంతా మనమే చేశామనుకోవడం సరికాదేమో?
ప్రతి కుటుంబం మా పూర్వీకులేమీ చెయ్యలేదు, చేసిందంతా మేమే అని చెప్పుకుంటే
ఆత్తర్వాత్తరం కూడా అలాగే చెప్పుకుంటుంది, ఆ కుటుంబ చరిత్ర అంతమాత్రమే. ఏతరమైనా
ఇంకొంచం ముందుకెళ్ళి మా పూర్వీకులు అంతా చెత్తచేసారు అని చెప్పుకొని తిరిగితే ఇంక
చెప్పక్కర్లేదు కదా. ఆ కుటుంబానికి చరిత్రేలేదు.
ప్రతి దేశానికి ఒక చరిత్ర / కథనం ఉంటుంది. దాని గతమేంటి, అది ఒడిదొడుకుల్ని ఎలా తట్టుకొంది మొదలైనవి. ఆ దేశం ఆ కథనానికనుగుణంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి అశోకుడి కాలాన్ని తీసుకుంటే, మనం చదువుకున్న కథలు, రహదార్లు వేయించెను, సత్రములు కట్టించెను, చెట్లు నాటించెను వగైరా, ఆతర్వాత రాజ్యాన్ని విస్తరించెను, చక్రవర్తి కదా. మరివన్నీ అశోకుడు ఒక్కడే చేసుండడు కదా, చాణక్యుడు లాంటి గురువుగారు, మంత్రులు, సేనాధిపతులు కలిసే చేసుంటారు. ఇప్పుడు ఇందులో అశోకుడి గొప్పేమి లేదు అతని సేనాధిపతుడొకడు మహావీరుడు, అతనివల్లే ఇదంతా అయ్యింది అని తిరగరాస్తే ఏమౌతుంది?
మన దేశానికి స్వాతంత్య్రం శాంతియుత పోరాటం వల్ల వచ్చింది అని చదువుకున్నాము. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సాధించడానికి సాయుధపోరాటం చేస్తే మనమేం చెప్తాము, ఆయుధపోరాటాలతో ఏదీ సాధించలేము, శాంతియుత పోరాటమే మార్గము అని కదా. అదే ఇప్పుడు మనకి స్వాతంత్య్రం సాయుధపోరాటంవల్లే వచ్చిందని కొత్త కథ చెప్తే సభ్యసమాజానికి ఏంసందేశమిస్తున్నట్లు? తుపాకులు పట్టుకుని ఏమైనా సాధించుకోవచ్చుననే కదా? అలాంటప్పుడు తుపాకులు పట్టుకునేవాళ్ళు ఏమవుతారు? స్వాతంత్య్ర సమరవీరులా? ఉగ్రవాదులా?
ఎవరిని వీరులు చెయ్యాలో ఎవరిని ప్రక్కనపెట్టాలో ఆలోచించుకుని చెయ్యాలి. ఎవరో మనకి నచ్చలేదని కాదు.
మీకర్ధమయ్యిందనుకుంటాను :)
~సూర్యుడు :-)