Sunday, March 27, 2011

ఆలోచనలు ...

ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళడానికి ఓ గంటన్నర పడుతుంది రోజూ. ఆ పిచ్చి ట్రాఫిక్కులో చెయ్యగలిగేదేముంటుంది, ఆలోచించడం తప్ప :)

కాకపోతే, ఎఫ్.ఎమ్ రేడియో ఉంటుంది, ఆ మధ్య రేడియో సిటీ, ఫీవర్ మొదలైనవి విని విని బోర్‌కొట్టి విన్డం మానేసా, ఈ మధ్యనే 100.1. 101.3 చానల్స్ వింటూన్నాను. మొదటిది, భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి, పొద్దున్న 7:30 నుండి 8:00 వరకు మళ్లీ 8:30 నుండి 9:30 వరకు కర్నాటక శాస్త్రీయ సంగీతం వస్తుంది, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటున్నాయి. అలాగే 101.3 (ఆకాశవాణి) రైన్‌బో చానెల్. ఇందులోకూడా కొన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి, కన్నడలో వస్తాయనుకోండి, అర్ధంచేసుకోగలిగితే బాగుంటాయి.

ఇవి వింటూకూడా ఆలోచనల్లోకి వెళిపోతుంటాను. ఈ మధ్య తరచుగా వస్తున్న ఆలోచనేమంటే, రోడ్డుమీడ ఇంతమంది వెళ్తుంటారు కదా, అందులో కారుల్లో వెళ్లేవారినే తీసుకుంటే, అందులో మళ్ళీ ఒకే వయస్సు కలిగిన వాళ్లని తీసుకుంటే కొందరు ఏదో చిన్న మారుతి కారులో వెళ్తుంటే ఇంకొంతమంది హోండా సివిక్‌లో వెళ్లిపోతుంటారు, ఎందువల్ల, ఎందుకు కొంతమంది ఇలా, ఇంకొంతమంది అలా. సరే, వాళ్ళు చదివిన చదువులు వేరే వేరే అయ్యుండొచ్చు, పనిచేసే కార్యాలయాలు వేరే వేరే ఉండొండచ్చు కాబట్టి వీళ్ళనొదిలేసి, ఒకే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను, అందులో ఒకే వయసు కలిగిన వాళ్ళను తీసుకుంటే, కొంతమంది మేనేజర్లై ఉండొచ్చు, ఇంకొంతమంది, ఇంకా ఏ సీనియర్ ఇంజనీరో అయ్యుండొచ్చు, ఎందుకిలా?

ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మా కన్నడ మితృడొకడు ఎప్పుడు ఓ కన్నడ సీరియల్ (ముక్త) లో ఓ డయలాగ్ కోట్ చేస్తుంటాడు, అందులో ఓ జడ్జ్ ఓ డబ్బున్నవాడిని ఇలా అడుగుతాడు "ఆ బీదవాడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు, వాడికి నీలా ఎందుకు డబ్బులెక్కువ రావట్లేదు" అని. నాకెందుకో ఈ ప్రశ్న అంత అర్ధవంతమైన దానిలా అనిపించలేదు, ఇక్కడ వాళ్లు సృష్టించే విలువలో తేడాలుండొచ్చు, అందువల్ల ఇలా కంపేర్ చెయ్యడం కుదరదు, అసలు కంపేర్ చెయ్యకూడదు (ఆపిల్ కి ఆరెంజ్ కి పోలికా).

సో, ఐ రిపీట్ మై క్వశ్చన్,
ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?

మిగిలిన ఆలోచన్లు మళ్ళీ ఇంకోసారి ...

~సూర్యుడు

Monday, March 21, 2011

తీరికగా ఉన్న ఓ వారాంతం

సరే, ఈ వారాంతం అనేది ఆంగ్ల వీకెండ్ కి మక్కీ కి మక్కీ అయినా వేరే పదమేదీ గుర్తుకురాలేదు. ఈ శని, ఆది వారాలు కొద్దిగా తీరిక దొరికి, సినేమా మేళా అని నిశ్చయం చేసి, శని వారం ఉదయాన్నే "ద అన్‌టచబుల్స్" అనే చిత్రరాజంతో మొదలు పెట్టి, తర్వాత సాల్ట్, ఆ తర్వాత నో వన్ కిల్డ్ జెస్సికా, ఆ తర్వాత వాల్ స్ట్రీట్ చూసేసి ఓ పనయ్యిందనిపించా.

ద అన్‌టచబుల్స్ గురించి చెప్పాల్సిందేమీ లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే, సూపర్. ఇలాంటి వాళ్లు మన దేశంలో ఉంటారా అనుకుంటుండంగానే, నో వన్ కిల్డ్ జెస్సికా లో ఓ పోలీసు ఆఫీసర్ కనిపించి ఆశ్చర్యం కలిగించాడు.

సాల్ట్ సినేమా గురించి కూడా చెప్పడానికేమీలేదు. నాకు స్పై సినేమాలిష్టం కాబట్టి, ఓకె అదర్వైస్, టైం వేస్ట్.

వాల్ స్ట్రీట్ సినేమా పర్వాలేదు. ఈ మధ్య ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దీనిమీద ఓ బొచ్చెడు పుస్తకాలు కొనేసి, ప్రస్తుతానికి ఏనిమల్ స్పిరిట్స్ చదువుతున్నాను. నా చిన్నప్పుడొక తెలుగు ఉపన్యాసకులు, ఓ సభలో మాట్లాడుతూ, "లెక్కలు చదుకున్నవాళ్లు, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్లు, ఎప్పుడు అప్పులపాలైపోకూడదు, అలా అయితే ఆ చదువుకి అర్ధంలేదు" అని. మరి ఈ రోజుల్లో ఏ ఖర్చైనాఅప్పే (అదే "క్రెడిట్" కార్డ్ మీదే కదా) కాని తీర్చగలిగినంతకాలం ఓకె.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్సెప్షన్ అనే సినేమా చూద్దామని మొదలుపెట్టి కళ్లు మూతలు పడిపోతుంటే అర్ధమయ్యింది, ఇది పట్టపగలు చూస్తేనే అర్ధంచేసుకోడానికి టైం పట్టేట్టుంది, ఈ అర్ధరాత్రి చూస్తే అంతా కలలోఉంటుందనిపించి అప్పటికాపా.

ఆదివారం టైమ్స్ ఆఫ్ ఇండియా లో సెంటర్ పేజ్ లో రెండు ఆర్టికల్స్, ఓకటి శోభా డే ది ఇంకోటి, ఎస్ ఏ అయ్యర్. మొదటిది ప్రస్తుతం భారతదేశంలో జరిగిపోతున్న అవినీతి గురించి, ఎందుకింకా మన భారత విద్యార్ధులు నిరశన ప్రదర్శనలు మొదలు పెట్టడంలేదని అనుకుంటా, సరిగ్గా దీనికి సమాధానమా అన్నట్లు, ఎస్ ఎ అయ్యర్ గారి కాలం, మన జనాభానే అంత. ఇప్పటికి మనవాళ్లు వచ్చిన ప్రతీ ప్రత్యామ్నాయాన్నీ ప్రయత్నించారు. ఒకే ఒక్క చాన్స్, అన్న వాళ్లనీ ట్రై చేసి, అందరూ ఇంతే అన్న భావనకి వచ్చేసారు. తప్పు ఒక్క రాజకీయ నాయకులదే కాదు, మొత్తం జనాభాది. ప్రతి ఒక్కడూ "ఒక్క" చాన్స్ కోసం ఎదురుచూసేవాడే, ఎందుకు? సేవ చెయ్యడానికా, హు, దోచెయ్యడానికి. ఇప్పుడున్న వాడ్ని దింపేస్తే ఇంకొకడు, ఇలా కొనసాగాల్సిందే మళ్లీ ఏదో దేశం మనల్ని కంట్రోల్ చెయ్యడం మొదలుపెట్టేదాకా.

ఈ వారాంతపు తీరికలు ఇలానే కొనసాగితే ఇంకొన్ని సినేమాలు, పుస్తకాలు పూర్తవుతాయి :)

~సూర్యుడు

Sunday, February 13, 2011

బెంగళూరు ఏరో ఇండియా - 2011

మొత్తానికి నిన్న ఏరో ఇండియా చూసే అవకాశం కలిగింది. 2 గంటలనుండి 4 గంటలవరకు చూశాము, పనిలో పనిగా షాహిద్ కాపుర్‌ని కూడా. మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన LCA, తేజస్ విన్యాసాలు బాగా ఆకట్టుకున్నాయి. F16, F18, అదే కోవకు చెందిన మరికొన్ని విన్యాసాల్లో పాల్గొన్నాయి. నాకైతే, తేజస్, F16, F18 విన్యాసాలు బాగా నచ్చాయి. చివర్లో సూర్యకిరణ్‌లు కూడా తమ ప్రతాపాల్ని చూపించాయి :)

అసలే నా ఫొటోగ్రఫీ పరిజ్ఞానమంతంతమాత్రం, ఎప్పుడు నొక్కితే అవి మన ఫొటోలోకొస్తాయో కనిపెట్టేసరికే పుణ్యకాలం గడిచిపోయింది :). ఇందులో కనిపించేవే F16లు, F18లు, లేకపోతే, మీకేవి నచ్చితే వాటిపేరు పెట్టేసుకోండి ...


Sunday, January 9, 2011

బసవ వచనాలు

Saw below lines while I was going to Kemmangundi, found interesting and wanted to share:


ಮೃದುವಚನವೇ ಸಕಲ ಜಪಂಗಳಯ್ಯ!
ಮೃದುವಚನವೇ ಸಕಲ ತಪಂಗಳಯ್ಯ ?

Sunday, January 2, 2011

ఆహ్లాదకరమైన పాట




ఈ పాటలో వాడిన వ్యవసాయ పనిముట్టుని మీ మీ ప్రాంతాల్లో ఏమంటారో తెలుసా?

~సూర్యుడు :-)

Wednesday, December 29, 2010

పశ్చిమ కనుమలలో ప్రయాణం

ఓ రెండురోజుల క్రితం చిక్కమగళూరు, ఆ చుట్టుప్రక్కల చూద్దామని బయలుదేరాము. ముఖ్యంగా, కెమ్మనగుండి. కెమ్మనగుండి గురించి ఇంతకుముందు చాలాసార్లు విని, చదివి, తప్పకుండా చూడవలసిందే అని తీర్మానించి, ఇప్పుడు వీలుకుదరడంతో బయలుదేరాము. బెంగళూరులో ఉదయం 6:30 కి బయలుదేరి, నేలమంగళ, హాసన్ మీదుగా హళేబీడు వెళ్లి అక్కడ శివాలయాన్ని దర్శించి అక్కడనుండి బేళూరు వెళ్లి అక్కడ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నాము. ఈ హళేబీడు, బేళూరు దేవాలయ కట్టడాలు పూర్తిగా కాకపోయినా కోణార్క్ కట్టడాలకు దగ్గరగా ఉన్నాయి. కోణార్క్ సూర్యదేవాలయాన్ని కట్టించింది కూడా కన్నడ (గంగా అనుకుంటా) రాజవంశస్థులే.



అక్కడనుండి చిక్కమగళూరు మీదుగా పశ్చిమకనుమలలోకి బయలుదేరాము. దారికిరువైపులా కొబ్బరి తోటలు, పోక తోటలు భలేఉన్నాయి. ఇంకొంచం ముందుకెళ్లేసరికి దట్టమైన అడవి మొదలయ్యింది. దారి అస్సలు బాగోలేదు. ముందు బాబా బుడాన్‌గిరి వెళ్లి అక్కడనుండి కెమ్మనగుండి వెళ్లాము.


నిజానికి ఈ దారి కొద్దిగా చుట్టూ తిరిగి అయినా ఇవన్నీ చూసుకుంటూ వెళ్లాము కాబట్టి పెద్దగా విసుగనిపించలేదు. కెమ్మనగుండి వెళ్లేసరికి చీకటిపడింది, అక్కడే కృష్ణ రాజేంద్ర వసతిగృహంలో బసచేసి


మర్నాడు ఉదయం హెబ్బె జలపాతాన్ని చూడ్డానికి వెళ్లాము, ఆ దారి చాలా దారుణంగా ఉంది, వెళ్తే నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి, వేరే రకంగా వెళ్లే అవకాశమే లేదు. అది 13 kms దూరమేకాని, ఓ నలభై కి.మీ దూరంలా అనిపించింది :)



అక్కడనుండి మద్యాహ్నం బయలుదేరి అరిసికెరె, త్రిప్టూరు, తుముకూరు మీదుగా మళ్లీ బెంగళూరు చేరుకున్నాము. మొత్తానికి ఎప్పట్నుంచో అనుకుంటున్న కెమ్మనగుండి చూడాలనే కోరిక తీరింది, కొద్దిగా కష్టమనిపించినా ;)

బాబా బుడాన్‌గిరి, కెమ్మనగుండి ప్రదేశాల్లో, కాఫీ, మిరియాలు, ఏలకులు, వెనీలా, వక్కలు, అల్లం బాగా పండిస్తారు.