Thursday, December 29, 2011
Friday, December 23, 2011
Sunday, November 27, 2011
హిందువు కి/కు ఒక ఉత్తరం
ఇ-పుస్తకాలు వెతుకుతూంటె ఇది కంట పడింది (గూటెన్‌బర్గ్ లో). చదువుతూంటే ఆసక్తికరంగా అనిపించి ఇక్కడ ఉంచాలనిపింది.
పూర్తిగా చదవాలనుకుంటె, ఇక్కడ చూడండి
"A commercial company enslaved a nation comprising two hundred millions. Tell this to a man free from superstition and he will fail to grasp what these words mean. What does it mean that thirty thousand men, not athletes but rather weak and ordinary people, have subdued two hundred million vigorous, clever, capable, and freedom-loving people? Do not the figures make it clear that it is not the English who have enslaved the Indians, but the Indians who have enslaved themselves? When the Indians complain that the English have enslaved them it is as if drunkards complained that the spirit-dealers who have settled among them have enslaved them. You tell them that they might give up drinking, but they reply that they are so accustomed to it that they cannot abstain, and that they must have alcohol to keep up their energy. Is it not the same thing with the millions of people who submit to thousands' or even to hundreds, of others--of their own or other nations? If the people of India are enslaved by violence it is only because they themselves live and have lived by violence, and do not recognize the eternal law of love inherent in humanity. _Pitiful and foolish is the man who seeks what he already has, and does not know that he has it. Yes, Pitiful and foolish is he who does not know the bliss of love which surrounds him and which I have given him._ KRISHNA."
పూర్తిగా చదవాలనుకుంటె, ఇక్కడ చూడండి
Sunday, September 25, 2011
Sunday, September 18, 2011
Sunday, September 4, 2011
శ్రీ రాముని దయచేతను
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనుల నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ...!
నారూఢిగ సకల జనుల నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ...!
Wednesday, August 24, 2011
ద కోబ్రా
ఈ మధ్య నేనో మూడు నవలలు చదివా, The Matarese Circle, The Matarese
Countdown మరియు The Cobra. మొదటి రెండు, Ludlum మార్కు నవలలు,
చదువుతున్నంతసేపు బాగుంటాయి, గుర్తుపెట్టుకోడానికేమీ ఉండదు. ద కోబ్రా,
ఫోర్సిత్ క్రొత్త నవల. డ్రగ్ వ్యాపారం మీద ఓ మాదిరి పరిశోధన చేసి
వ్రాసినట్లనిపించింది. అమెరికా అద్యక్షుడు ఓ సంఘటన వల్ల, మొత్తం కొకైన్ వ్యాపారాన్నే నాశనం చెయ్యాలని ఓ పాత సి.ఐ.ఎ ఏజెంటుని అడుగుతాడు, దానికి అతను (పాల్, ద కోబ్రా) కొన్ని నిబందనలు పెట్టి ఒప్పుకుంటాడు
ఇందులో ఓ డైలాగుంటుంది, "ఐ యాం డిమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ డెలిబరేట్ డిస్‌ఇన్ఫర్మేషన్" అని.
ఇందులో ఓ డైలాగుంటుంది, "ఐ యాం డిమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ డెలిబరేట్ డిస్‌ఇన్ఫర్మేషన్" అని.
Tuesday, August 23, 2011
వేలంవెర్రి
వేలంవెర్రి కి ఎవరైనా నిర్వచనము, ఉదాహరణలు ఇవ్వగలరా?
సూచన: ఇప్పటిదాకా వారి జీవితంలో ఒక్కసారికూడ అవినీతి (దీన్నికూడ నిర్వచించి) కి పాల్పడనివారే ఈ టపాకి వ్యాఖ్య వ్రాయడానికి అర్హులు ;)
సూచన: ఇప్పటిదాకా వారి జీవితంలో ఒక్కసారికూడ అవినీతి (దీన్నికూడ నిర్వచించి) కి పాల్పడనివారే ఈ టపాకి వ్యాఖ్య వ్రాయడానికి అర్హులు ;)
Sunday, August 14, 2011
మీరు గమనించారా?
మీరు ఏదైనా క్రొత్తగా ఆలోచిస్తున్నాము అనిపించినప్పుడు, అది ఇదివరకెవరైనా అప్పుడే కనిపెట్టేసారా లేదా అని చూడ్డానికి ఏంచేస్తారు? గూగుల్‌ని అడుగుతారు, ఇది నీకేమైనా తెలుసా అని, అది ఉహూ అందనుకోండి, అంటే మీ ఆలోచన ఇంతవరకెవరికీ రాలేదన్నమాట కదా? కానీ, మరి మీఆలోచన్ని గూగుల్‌కి చెప్పేసారే, గూగుల్‌కి కూడా మీ ఆలోచన బాగుందనిపించిందనుకోండి, మరి వాళ్లు దాన్ని వాడుకోకుండా వదిలేస్తారా? ఏమో? :)
సరే, నేను చదువుకుంటున్న రోజుల్లో ఓ సిటీ బస్సు కండక్టర్ ఏమన్నాడంటే, ఇంట్లో పెళ్లామ్మీదలిగినా సిటీ బస్సుమీద రాళ్లేసేస్తారని, అలాగే, ఇప్పుడు మనింట్లో బల్లరిచినా బ్లాగుల్లో రాసేయాలి, మరి ఈ రాతలన్నీ ఎక్కడ నిలవౌతున్నాయి / పేరుకుపోతున్నాయి? ఎక్కడో గూగుల్ సర్వర్లలోనో, లేక వేరే బ్లాగు సర్వీసు ప్రొవైడర్ సర్వర్లలోనో కదా. డాటా ఎనలైటిక్స్ సాఫ్ట్‌వేర్లనుపయోగించి ఇవన్నీ గాలిస్తే, మనింట్లో బల్లరిచిన విషయం తెలియకుండా ఉంటుందా? ఈ మధ్యనే ఎవరో ఓ గోల పెట్టేస్తున్నారు, మన ఆధార్ డాటా అంతా ఎక్కడికో వెళ్లిపోతోందని. ఊరికే కూర్చుని బ్లాగుల్లో మన బుర్రలో ఆలోచనల్ని రాసేస్తుంటే, ఇంకా ఆధార్ డాటా ఎందుకు, ఇక్కడే మన పల్స్ తెలియటంలా? ఉదాహరణకి, మన తెలంగాణా విషయమే తీసుకోండి, మన బ్లాగురాతలు, మన ప్రాంతీయ బేధాలని బయటకు చెప్పట్లేదా?
సరే, మన విషయాలన్నీ బ్లాగుల్లో వ్రాసేయాలా?

Saturday, August 6, 2011
అదీ సంగతి ...
ఈమధ్య మా ఆఫీసుకి వెళ్లే ప్రయాణ సమయంలో ముసురుకొనే ఆలోచన్లను కాస్త మీతోకూడా
పంచుకుందామని, ఇలా :)
మీరెప్పుడైనా క్యూల్లో నుంచున్నట్లైతే, ఎప్పుడూ, మన ప్రక్క క్యూ మన క్యూ కన్నా
ఫాస్ట్ గా కదులుతున్నట్టనిపిస్తుంటుంది కదా :), ఇది రోడ్డుమీద వాహనాల
క్యూలక్కూడా వర్తిస్తుంది. ఇండియాలో డ్రైవింగు, లేన్ డిసిప్లేన్ అనేవి
ఆక్సీమోరన్ లాంటివని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా కదా, సరే మనమేళ్లే
లేన్ ఫాస్ట్ గా కదలకపోతే, ప్రక్క లేన్ లోకి దూకు అనేది మనలాజిక్కు, అదీ
కదలకపోతే ఆ ప్రక్కలేన్లోకో లేకపోతే ఈప్రక్క లేన్లోకో దూకుతూ దూకుతూ ఎలాగోలా
ఆఫీసుకి టైంకి చేరామా లేదా అనేదే ప్రశ్న. ఇలా దూకడంలో అప్పుడప్పుడూ
ఈప్రక్కవాడినో ఆప్రక్కవాడినో ముద్దెట్టేసుకుని వాడితో ఓ నాలుగనిపించుకుని భలే
మజా వస్తూంటుంది :)
ఇలా దూకుతూ దూకుతూ వెళ్తూండగా, లేటుగా అయినా లేటెస్టుగా కనిపెట్టిందేమంటే,
ట్రాఫిక్కు సిగ్న్ల్సనేవి నార్మలైజేషన్ పాయింట్లు. మనమెంత కంగారుగా
వెళ్దామన్నా, వేరే ఎవరైనా వెళ్లిపోదామనుకున్నా, ట్రాఫిక్కు సిగ్నల్దగ్గరో,
జాంలోనో ఇటూ అటూ చూస్తే మళ్ళీ వారే :). సో, ఎంత కంగారుపడినా, మళ్లీ అక్కడే, అదీ
సంగతి ... (ఈ మూడు చుక్కలగురుంచొకసారి చెప్పుకోవాలి, పిట్టకథ: చిన్నప్పుడు
పరీక్షల్లో ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పడానికి ఈ చుక్కలు పెట్టేవాళ్లం కదా,
పరీక్ష పేపర్ ఇంకా సరిగ్గా నిండటంలేదని అనుమానమొచ్చినప్పుడు, ఈ చుక్కల సంఖ్య
పెరిగిపోతుండేది :), అంటే ఓ పది పదిహేను చుక్కలు, ప్లేసు సరిపోకపోతే ఓ రెండు
చుక్కలు, ఈ టైపులో నడిపించుకొచ్చేస్తుంటే, ఓ క్రొత్త క్లాసులో ఓ క్రొత్త
మాష్టారొచ్చి, ఈ చుక్కల సూత్రం చెప్పారన్నమాట, మీ ఓపిక్కొద్దీ చుక్కలుకాదు,
ఎప్పుడైనా మూడే చుక్కలుపెట్టాలని, అంతే, అక్కడనుండి, మన పరీక్ష పేపర్ సైజ్
రిక్వైర్‌మెంట్ తగ్గిపోయింది, చుక్కలతోపాటుగా :))
ఇలా లేన్లు దూకినట్టే కొంతమంది కంపెనీలే దూకేస్తుంటారు, కెరీర్ గ్రోత్తో, సాలరీ
గ్రోత్తో, ఇంకేదో గ్రోత్తో అనుకుంటూ, గోతిలో పడుతూంటారు, ఈ నార్మలైజేషన్
టెక్నిక్కులు అర్ధంచేసుకోలేక :), ఇది నాఅపోహ లేక నిజమేనా, మీకేమనిపిస్తోంది?
Thursday, July 21, 2011
సహాయం చెయ్యగలరా?
ఆ మధ్య, అంటే ఎప్పుడో ఓ రెండు, మూడేళ్ల క్రితమైయ్యుంటుంది. ఏదో సోమాలియా కథలో అనో
ఏదో ఓ కథ చదివా ఇక్కడ బ్లాగుల్లో, ఓ తండ్రి తన కొడుక్కి మనమేంచేసినా ప్రజలేదో
ఒకటి అంటూనే ఉంటారనే విషయాన్ని ఎలా తెలియచెప్పాడో అనేది ఆ కథ. అది ఏ బ్లాగో, ఏ
పొస్టో కొద్దిగా చెప్తారా?
~సూర్యుడు
~సూర్యుడు
Sunday, July 17, 2011
జోగద సిరి బెళకినల్లి
జోగద సిరి బెళకినల్లి (శబ్దరూపం) (ఇదే వినడానికి బాగుంది, దృశ్యరూపం అంత బాగోలేదు)
నాకు అర్ధమైనది ఇక్కడ (లేఖిని సహాయంతో తెలుగులో):
జోగద సిరి బెళకినల్లి తుంగెయ తెనె బళుకినల్లి
సహ్యాద్రియ లోహదదిర ఉత్తుంగద నిలుకునల్లినిత్య హరిద్వర్ణ వనద తేగ గంధ తరుగళల్లి
నిత్యోత్సవ తాయె నిత్యోత్సవ నినగె నిత్యోత్సవ
తాయె నిత్యోత్సవ
ఇతిహాసద హిమదల్లిన సింహాసన మాలెయల్లి
గత సాహస సారుతిరువ శాసనగళ సాలినల్లి
ఓలెగరియ సిరిగళల్లి దేగులగళ భిత్తిగళలి
నిత్యోత్సవ తాయె నిత్యోత్సవ నినగె నిత్యోత్సవ
తాయె నిత్యోత్సవ
హలవెన్నద హిరిమెయే కులవెన్నెద గరిమెయె
సద్వికాస శీల నుడియ లోకవృత సీమెయే
ఈ మత్సర నిర్మత్సర మనగుదార మహిమెయే
నిత్యోత్సవ తాయె నిత్యోత్సవ నినగె నిత్యోత్సవ
తాయె నితోత్సవ
jOgada siri beLakinalli tungeya tene baLukinalli
sahyAdriya lOhadalira uttungada nilukinallinitya haridvarNa vanada tEga gandha tarugaLalli
nityOtsava tAye nityOtsava ninage nityOtsava
itihAsada himadallina simhAsana mAleyalli
gata sAhasa sArutiruva shAsanagaLa sAlinalli
Olegariya sirigaLalli dEgulagaLa bhittigaLali
nityOtsava tAye nityOtsava ninage nityOtsava
Halavennada hirimeye kulavennada garimeye
sadvikAsa shIla nuDiya lOkAvruta sImeyE
I matsara nirmatsara managuDara mahimeyE
nityOtsava tAye nityOtsava ninage nityOtsava
tAye nitOtsava
మాతృక (http://www.justsomelyrics.com/1082700/Nissar-Jogada-Lyrics)
You can find a Kannada version of this song at: ptsg.eecs.berkeley.edu/~venkates/doc.ps
దృశ్యరూపం:
Sunday, July 10, 2011
నా ఊహ
నర్గిస్ నవ్వు (http://www.youtube.com/v/A4OLVYD5ItA) చూస్తే ఒక్కోసారి మన జమున
నర్గిస్‌ని అనుకరించిందేమో అనిపిస్తుంటుంది (ఏ సినేమాలో అనిమాత్రం అని అడక్కండి,
ఎందుకో అలా అనిపించింది)
అలాగే ఏచూరి సీతారాం గారి తలకట్టు (Hair Style) (http://www.youtube.com/watch?v=yEvpPWMGOS0) లో నాగేశ్వరరావు గారి తలకట్టులా అనిపిస్తుంటుంది (మళ్లీ అవునా అని అడక్కండి :)). ఇది నా ఊహ లేదా కల్పన (imagination)

Wednesday, June 29, 2011
Tuesday, June 28, 2011
Sunday, May 15, 2011
ఏంటో విసుగ్గా ...
ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మిగిలిన చోట్ల ఉప ఎన్నికలైనా, కొన్ని పార్టీలు తలక్రిందులైనా, ఎవరూ రిగ్గింగనడంలేదు, ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లడంలేదు, అందరికీ సడెన్‌గా ఏమైందబ్బా :p
Saturday, May 14, 2011
Saturday, April 23, 2011
Mr. పర్‌ఫెక్ట్
అనుకోకుండా ఈరోజు Mr. పర్‌ఫెక్ట్ సినేమా చూడ్డం జరిగింది. నాకైతే సినేమా ఓకె.
ఓసారి చూడొచ్చు. ఏ.పిలో ఈ మధ్య ఆస్ట్రేలియా గోలెక్కువైపొయినట్టుంది. ఈ మధ్య
సినేమాలు చూడ్డం తగ్గిపోడంతో కొన్ని సినేమాలు అర్ధంకాట్లే, ఇంకొన్ని నచ్చట్లే,
థియేటర్ సౌండ్ గోలలో ఏ పాటా అర్ధం కాలేదు, బేసిక్‌గా గోల గోల :)
కథ ఓకె, సో ఇంక మిగిలినవాటిగురించి చెప్పుకోవటానికి పెద్దగా ఏంలేదు. ఇదేమీ ఆర్ట్ సినేమాకాదు కాబట్టి ఎక్కువగా రంధ్రాన్వేషణ అనవసరం :)
జై
కథ ఓకె, సో ఇంక మిగిలినవాటిగురించి చెప్పుకోవటానికి పెద్దగా ఏంలేదు. ఇదేమీ ఆర్ట్ సినేమాకాదు కాబట్టి ఎక్కువగా రంధ్రాన్వేషణ అనవసరం :)
జై
Sunday, March 27, 2011
ఆలోచనలు ...
ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళడానికి ఓ గంటన్నర పడుతుంది రోజూ. ఆ పిచ్చి ట్రాఫిక్కులో
చెయ్యగలిగేదేముంటుంది, ఆలోచించడం తప్ప :)
కాకపోతే, ఎఫ్.ఎమ్ రేడియో ఉంటుంది, ఆ మధ్య రేడియో సిటీ, ఫీవర్ మొదలైనవి విని విని బోర్‌కొట్టి విన్డం మానేసా, ఈ మధ్యనే 100.1. 101.3 చానల్స్ వింటూన్నాను. మొదటిది, భారతీయ శాస్త్రీయ సంగీత వాహిని, అమృత వర్షిణి, పొద్దున్న 7:30 నుండి 8:00 వరకు మళ్లీ 8:30 నుండి 9:30 వరకు కర్నాటక శాస్త్రీయ సంగీతం వస్తుంది, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటున్నాయి. అలాగే 101.3 (ఆకాశవాణి) రైన్‌బో చానెల్. ఇందులోకూడా కొన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి, కన్నడలో వస్తాయనుకోండి, అర్ధంచేసుకోగలిగితే బాగుంటాయి.
ఇవి వింటూకూడా ఆలోచనల్లోకి వెళిపోతుంటాను. ఈ మధ్య తరచుగా వస్తున్న ఆలోచనేమంటే, రోడ్డుమీడ ఇంతమంది వెళ్తుంటారు కదా, అందులో కారుల్లో వెళ్లేవారినే తీసుకుంటే, అందులో మళ్ళీ ఒకే వయస్సు కలిగిన వాళ్లని తీసుకుంటే కొందరు ఏదో చిన్న మారుతి కారులో వెళ్తుంటే ఇంకొంతమంది హోండా సివిక్‌లో వెళ్లిపోతుంటారు, ఎందువల్ల, ఎందుకు కొంతమంది ఇలా, ఇంకొంతమంది అలా. సరే, వాళ్ళు చదివిన చదువులు వేరే వేరే అయ్యుండొచ్చు, పనిచేసే కార్యాలయాలు వేరే వేరే ఉండొండచ్చు కాబట్టి వీళ్ళనొదిలేసి, ఒకే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను, అందులో ఒకే వయసు కలిగిన వాళ్ళను తీసుకుంటే, కొంతమంది మేనేజర్లై ఉండొచ్చు, ఇంకొంతమంది, ఇంకా ఏ సీనియర్ ఇంజనీరో అయ్యుండొచ్చు, ఎందుకిలా?
ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?
మా కన్నడ మితృడొకడు ఎప్పుడు ఓ కన్నడ సీరియల్ (ముక్త) లో ఓ డయలాగ్ కోట్ చేస్తుంటాడు, అందులో ఓ జడ్జ్ ఓ డబ్బున్నవాడిని ఇలా అడుగుతాడు "ఆ బీదవాడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు, వాడికి నీలా ఎందుకు డబ్బులెక్కువ రావట్లేదు" అని. నాకెందుకో ఈ ప్రశ్న అంత అర్ధవంతమైన దానిలా అనిపించలేదు, ఇక్కడ వాళ్లు సృష్టించే విలువలో తేడాలుండొచ్చు, అందువల్ల ఇలా కంపేర్ చెయ్యడం కుదరదు, అసలు కంపేర్ చెయ్యకూడదు (ఆపిల్ కి ఆరెంజ్ కి పోలికా).
సో, ఐ రిపీట్ మై క్వశ్చన్,
ఎందుకు కొంతమందికి అన్నీ కలిసొచ్చి ఉన్నత పదవుల్లోకి వెళ్తుంటారు ఇంకొంతమంది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటారు?
మిగిలిన ఆలోచన్లు మళ్ళీ ఇంకోసారి ...

Monday, March 21, 2011
తీరికగా ఉన్న ఓ వారాంతం
సరే, ఈ వారాంతం అనేది ఆంగ్ల వీకెండ్ కి మక్కీ కి మక్కీ అయినా వేరే పదమేదీ గుర్తుకురాలేదు. ఈ శని, ఆది వారాలు కొద్దిగా తీరిక దొరికి, సినేమా మేళా అని నిశ్చయం చేసి, శని వారం ఉదయాన్నే "ద అన్‌టచబుల్స్" అనే చిత్రరాజంతో మొదలు పెట్టి, తర్వాత సాల్ట్, ఆ తర్వాత నో వన్ కిల్డ్ జెస్సికా, ఆ తర్వాత వాల్ స్ట్రీట్ చూసేసి ఓ పనయ్యిందనిపించా.
ద అన్‌టచబుల్స్ గురించి చెప్పాల్సిందేమీ లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే, సూపర్. ఇలాంటి వాళ్లు మన దేశంలో ఉంటారా అనుకుంటుండంగానే, నో వన్ కిల్డ్ జెస్సికా లో ఓ పోలీసు ఆఫీసర్ కనిపించి ఆశ్చర్యం కలిగించాడు.
సాల్ట్ సినేమా గురించి కూడా చెప్పడానికేమీలేదు. నాకు స్పై సినేమాలిష్టం కాబట్టి, ఓకె అదర్వైస్, టైం వేస్ట్.
వాల్ స్ట్రీట్ సినేమా పర్వాలేదు. ఈ మధ్య ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దీనిమీద ఓ బొచ్చెడు పుస్తకాలు కొనేసి, ప్రస్తుతానికి ఏనిమల్ స్పిరిట్స్ చదువుతున్నాను. నా చిన్నప్పుడొక తెలుగు ఉపన్యాసకులు, ఓ సభలో మాట్లాడుతూ, "లెక్కలు చదుకున్నవాళ్లు, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్లు, ఎప్పుడు అప్పులపాలైపోకూడదు, అలా అయితే ఆ చదువుకి అర్ధంలేదు" అని. మరి ఈ రోజుల్లో ఏ ఖర్చైనాఅప్పే (అదే "క్రెడిట్" కార్డ్ మీదే కదా) కాని తీర్చగలిగినంతకాలం ఓకె.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్సెప్షన్ అనే సినేమా చూద్దామని మొదలుపెట్టి కళ్లు మూతలు పడిపోతుంటే అర్ధమయ్యింది, ఇది పట్టపగలు చూస్తేనే అర్ధంచేసుకోడానికి టైం పట్టేట్టుంది, ఈ అర్ధరాత్రి చూస్తే అంతా కలలోఉంటుందనిపించి అప్పటికాపా.
ఆదివారం టైమ్స్ ఆఫ్ ఇండియా లో సెంటర్ పేజ్ లో రెండు ఆర్టికల్స్, ఓకటి శోభా డే ది ఇంకోటి, ఎస్ ఏ అయ్యర్. మొదటిది ప్రస్తుతం భారతదేశంలో జరిగిపోతున్న అవినీతి గురించి, ఎందుకింకా మన భారత విద్యార్ధులు నిరశన ప్రదర్శనలు మొదలు పెట్టడంలేదని అనుకుంటా, సరిగ్గా దీనికి సమాధానమా అన్నట్లు, ఎస్ ఎ అయ్యర్ గారి కాలం, మన జనాభానే అంత. ఇప్పటికి మనవాళ్లు వచ్చిన ప్రతీ ప్రత్యామ్నాయాన్నీ ప్రయత్నించారు. ఒకే ఒక్క చాన్స్, అన్న వాళ్లనీ ట్రై చేసి, అందరూ ఇంతే అన్న భావనకి వచ్చేసారు. తప్పు ఒక్క రాజకీయ నాయకులదే కాదు, మొత్తం జనాభాది. ప్రతి ఒక్కడూ "ఒక్క" చాన్స్ కోసం ఎదురుచూసేవాడే, ఎందుకు? సేవ చెయ్యడానికా, హు, దోచెయ్యడానికి. ఇప్పుడున్న వాడ్ని దింపేస్తే ఇంకొకడు, ఇలా కొనసాగాల్సిందే మళ్లీ ఏదో దేశం మనల్ని కంట్రోల్ చెయ్యడం మొదలుపెట్టేదాకా.
ఈ వారాంతపు తీరికలు ఇలానే కొనసాగితే ఇంకొన్ని సినేమాలు, పుస్తకాలు పూర్తవుతాయి :)

Sunday, February 13, 2011
బెంగళూరు ఏరో ఇండియా - 2011
మొత్తానికి నిన్న ఏరో ఇండియా చూసే అవకాశం కలిగింది. 2 గంటలనుండి 4 గంటలవరకు చూశాము, పనిలో పనిగా షాహిద్ కాపుర్‌ని కూడా. మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన LCA, తేజస్ విన్యాసాలు బాగా ఆకట్టుకున్నాయి. F16, F18, అదే కోవకు చెందిన మరికొన్ని విన్యాసాల్లో పాల్గొన్నాయి. నాకైతే, తేజస్, F16, F18 విన్యాసాలు బాగా నచ్చాయి. చివర్లో సూర్యకిరణ్‌లు కూడా తమ ప్రతాపాల్ని చూపించాయి :)
అసలే నా ఫొటోగ్రఫీ పరిజ్ఞానమంతంతమాత్రం, ఎప్పుడు నొక్కితే అవి మన ఫొటోలోకొస్తాయో కనిపెట్టేసరికే పుణ్యకాలం గడిచిపోయింది :). ఇందులో కనిపించేవే F16లు, F18లు, లేకపోతే, మీకేవి నచ్చితే వాటిపేరు పెట్టేసుకోండి ...

Sunday, January 9, 2011
బసవ వచనాలు
Saw below lines while I was going to Kemmangundi, found interesting and wanted to share:
ಮೃದುವಚನವೇ ಸಕಲ ಜಪಂಗಳಯ್ಯ!
ಮೃದುವಚನವೇ ಸಕಲ ತಪಂಗಳಯ್ಯ ?
ಮೃದುವಚನವೇ ಸಕಲ ಜಪಂಗಳಯ್ಯ!
ಮೃದುವಚನವೇ ಸಕಲ ತಪಂಗಳಯ್ಯ ?
Sunday, January 2, 2011
Subscribe to:
Posts (Atom)