Sunday, July 29, 2012

!! ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది !!






ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను నీ చిత్తంబికను ||

చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్నానంబును మరచెద తత్త్వ రహశ్యము |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
 
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాశలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||

చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధమ్ముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

No comments: