Showing posts with label John le Carré. Show all posts
Showing posts with label John le Carré. Show all posts

Saturday, December 3, 2016

ఇంకొన్ని నవలలు

The Parsifal Mosaic చదవడం పూర్తయింది, బాగుంది. The Agents of Innocence (by David Ignatius) చదవడం కూడా పూర్తయింది. David Ignatius నవలలు చదవడం ఇదే మొదటిసారి. ఈ నవల బాగుంది. Daniel Silva నవలలు కన్నా కొద్దిగ భిన్నంగా ఉంది. వీలైతే మిగిలిన నవలలు చదవాలి.

John le Carré నవల, ది పర్ఫెక్ట్ మర్డర్ మొదలుపెట్టాను కాని ఎంతకీ పూర్తవడం లేదు :(

అలాగే డేనియల్ సిల్వా నవల ది అన్లైక్లి స్పై కూడా ముందుకి / ముందుకు (ఈ క గుణింతము తో చాలా కష్టంగా ఉంది :() వెళ్లడంలేదు.

ఇప్పుడు Frederick Forsyth's The Outsider మొదలుపెట్టాను, చూడాలి ఇదెలా నడుస్తుందో. సాధారణంగా నాకు ఆత్మకథలంత నచ్చవు.

Sunday, November 29, 2015

ఈమద్య చదివిన నవలలు

డానియల్ సిల్వ "ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్" చదవడం పూర్తయ్యింది, బాగుంది కాని గాబ్రియల్ అలన్ నవలల్లా అనిపించలేదు, కొద్దిగ భిన్నంగా ఉంది. ద మార్చింగ్ సీజన్స్ మొదలుపెట్టాను కాని ముందుకు కదలడంలేదు, అలానే ద మర్డర్ ఆఫ్ క్వాలిటీ కూడా. ఇంకా ద అన్‌లైక్‌లీ స్పై కూడా చదవాలి.

ఈమద్య ద మౌంటైన్ షాడో నవల కొన్నాను, శాంతారాం చదివి చాలారోజులయ్యింది, అది మళ్ళీ చదివి, మౌంటైన్ షాడో మొదలుపెట్టాలి.

మర్డర్ ఆఫ్ క్వాలిటీ లో ఓ పంక్తి (నాకు నచ్చింది :)):

He wished he could paint; he would paint the pageant of Carne in the fallow browns of autumn ... What a shame, thought Fielding, that a mind so receptive of beauty had no talent for creation. (So nicely put :))

Saturday, September 26, 2015

Daniel Silva - Grabiel Allon series

మొత్తానికి మొన్న డానియల్ సిల్వ గాబ్రియల్ ఆలన్ సీరీస్ నవలలన్నీ చదవడం పూర్తయ్యింది. అన్ని నవలలు చాల బాగున్నాయి. ఈ నవలేవీ ఎక్కడా విసుగు పుట్టించవు. ఎక్కడా పదాలను వ్యర్ధంగా వాడకుండా ఎలా వ్రాయాలో బాగా తెలుస్తుంది ఇవి చదివితే. కొన్ని నవలలో వ్యూహ్యాలు/ఎత్తుగడలు (plot)  ఒకేలా ఉండడం అంత బాగా అనిపించకపోయినా మరీ ఇబ్బందిగా అయితే ఉండవు. The Heist చడువుతుంటే అర్ధమైపోయింది, The English Spy ఎవరో కాని ఈ నవలలో IRA ఇతివృత్తాన్ని తీసుకోవడంవల్ల కొద్దిగా భిన్నంగా ఉంది. ఈ నవలలో గాబ్రియల్‌ని నవలా నాయకుడిగా చూపించాలో క్రిష్టాఫర్‌ని నవలా నాయకుడిగా చూపించాలా అనే సందిగ్దంలో రచయిత పడ్డాడేమో అనిపించింది.

  1. The Kill Artist
  2. The English Assassin
  3. The Confessor
  4. A Death in Vienna
  5. Prince of Fire
  6. The Messenger
  7. The Secret Servant
  8. Moscow Rules
  9. The Defector
  10. The Rembrandt Affair
  11. Portrait of a Spy
  12. The Fallen Angel
  13. The English Girl
  14. The Heist
  15. The English Spy

డానియల్ సిల్వావి ఇంకా మూడు నవలు మిగిలాయి, అవి, The Unlikely Spy, The Marching Season and The Mark of the Assassin. The Unlikely Spy మొదలు పెట్టాను కాని మళ్ళీ John Le Carré's, A Murder of Quality చదవాలనిపించి తీసాను, చూడాలి ఏది త్వరగా ముందుకు కదులుతుందో.

Sunday, August 9, 2015

ఈ రెండు పదాలు ఒకటేనా?

ఈ పదాలు Asset, Traitor రెండు ఒకటేనా?

BTW, I have completed The Rembrandt Affair and The Fallen Angel and both of them are very nicely written. Meanwhile, I have read, Call for the Dead of John le Carré. It is a different kind of narration, a bit old fashioned :), of course the story background is post WWII.

Now, I am thinking of reading, A Murder of Quality and The English Girl in parallel :)

I watched MI5 (not the British Secret Service) and it is very nice too ;)

Sunday, May 31, 2015

తొలకరి జల్లులు

బెంగళూరులో ఈ మద్య ఓ మూడు వారాలనుండి తరచుగ సాయంత్రాలు జల్లులు పడి వేసవి తీవ్రత తెలియకుండ గడిచిపోయింది, ఇప్పటిదాక. ఋతుపవనాలు ఎలాఉంటాయో తెలియకపోయినా ఈమద్య వర్షాలు బాగానే పడుతున్నాయి.

డానియల్ సిల్వా నవలలు చదివే కార్యక్రమంలో, ద మెసెంజర్ చదవడం పూర్తయ్యింది, నవల బాగుంది. ఇప్పుడు మాస్కో రూల్స్ చదవడం మొదలుపెట్టాను, ఇదికూడా బాగానే ఉంది కాని, కొన్ని ప్లాట్స్ ఊహించినవే అవ్వడం అంత బాగా అనిపించలేదు.

ఈమద్య John le Carré నవలలు కొన్ని కొన్నాను, డానియల్ సిల్వా నవలలు పూర్తయ్యిన తర్వాత ఇవి మొదలుపెట్టాలి.