Sunday, November 29, 2015

ఈమద్య చదివిన నవలలు

డానియల్ సిల్వ "ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్" చదవడం పూర్తయ్యింది, బాగుంది కాని గాబ్రియల్ అలన్ నవలల్లా అనిపించలేదు, కొద్దిగ భిన్నంగా ఉంది. ద మార్చింగ్ సీజన్స్ మొదలుపెట్టాను కాని ముందుకు కదలడంలేదు, అలానే ద మర్డర్ ఆఫ్ క్వాలిటీ కూడా. ఇంకా ద అన్‌లైక్‌లీ స్పై కూడా చదవాలి.

ఈమద్య ద మౌంటైన్ షాడో నవల కొన్నాను, శాంతారాం చదివి చాలారోజులయ్యింది, అది మళ్ళీ చదివి, మౌంటైన్ షాడో మొదలుపెట్టాలి.

మర్డర్ ఆఫ్ క్వాలిటీ లో ఓ పంక్తి (నాకు నచ్చింది :)):

He wished he could paint; he would paint the pageant of Carne in the fallow browns of autumn ... What a shame, thought Fielding, that a mind so receptive of beauty had no talent for creation. (So nicely put :))

Tuesday, October 13, 2015

అంబిగ నా నిన్న నంబిదే





సౌజన్యం: http://lekhini.org/ , Lyrics, Explanation

అంబిగా నా నిన్న నంబిదే
జగదంబ రమణ నిన్న నంబిదే
తుంబిద హరిగోలంబిగ అద కొంబత్తు ఛిద్రవు అంబిగా
సంభ్రమదిం నొడంబిగ అదరింబు నొడీ నడెసంబిగా || 1 ||
హొళెయ భరవ నొడంబిగా అదకె సెళవు ఘనవైయ్య అంబిగా
సుళియొళు ముళుగిదె అంబిగ ఎన్న సెళెదుకొండొయ్యొ నీనంబిగ || 2 ||
ఆరు తెరెయ నోడంబిగ అదు మీరి బరుతలిదె అంబిగ
యారిందలాగదు అంబిగ అద నివారిసి దాటిసొ అంబిగ || 3 ||
సత్యవెంబుదె హుట్టంబిగ సదా భక్తియెంబుదె పథవంబిగా
నిత్య మురుతి పురందర విట్ఠల నమ్మా ముక్తిమంటపకొయ్యొ అంబిగ || 4 ||

Saturday, September 26, 2015

Daniel Silva - Grabiel Allon series

మొత్తానికి మొన్న డానియల్ సిల్వ గాబ్రియల్ ఆలన్ సీరీస్ నవలలన్నీ చదవడం పూర్తయ్యింది. అన్ని నవలలు చాల బాగున్నాయి. ఈ నవలేవీ ఎక్కడా విసుగు పుట్టించవు. ఎక్కడా పదాలను వ్యర్ధంగా వాడకుండా ఎలా వ్రాయాలో బాగా తెలుస్తుంది ఇవి చదివితే. కొన్ని నవలలో వ్యూహ్యాలు/ఎత్తుగడలు (plot)  ఒకేలా ఉండడం అంత బాగా అనిపించకపోయినా మరీ ఇబ్బందిగా అయితే ఉండవు. The Heist చడువుతుంటే అర్ధమైపోయింది, The English Spy ఎవరో కాని ఈ నవలలో IRA ఇతివృత్తాన్ని తీసుకోవడంవల్ల కొద్దిగా భిన్నంగా ఉంది. ఈ నవలలో గాబ్రియల్‌ని నవలా నాయకుడిగా చూపించాలో క్రిష్టాఫర్‌ని నవలా నాయకుడిగా చూపించాలా అనే సందిగ్దంలో రచయిత పడ్డాడేమో అనిపించింది.

  1. The Kill Artist
  2. The English Assassin
  3. The Confessor
  4. A Death in Vienna
  5. Prince of Fire
  6. The Messenger
  7. The Secret Servant
  8. Moscow Rules
  9. The Defector
  10. The Rembrandt Affair
  11. Portrait of a Spy
  12. The Fallen Angel
  13. The English Girl
  14. The Heist
  15. The English Spy

డానియల్ సిల్వావి ఇంకా మూడు నవలు మిగిలాయి, అవి, The Unlikely Spy, The Marching Season and The Mark of the Assassin. The Unlikely Spy మొదలు పెట్టాను కాని మళ్ళీ John Le Carré's, A Murder of Quality చదవాలనిపించి తీసాను, చూడాలి ఏది త్వరగా ముందుకు కదులుతుందో.

Thursday, September 17, 2015

పువ్వులు - పిల్లి


Do you know the name of this flower?









(sitting near the flowers, giving pose for a photo that I couldn't refuse :))

Sunday, September 13, 2015