Sunday, December 12, 2010

Communication - ?

ఇప్పుడందరూ కమ్మ్యూనికేషన్, కమ్మ్యూనికేషన్ (టెక్నాలజీ కాదు) అంటున్నారు కదా, అసలు ఈ కమ్మ్యూనికేషన్ని తెలుగులో ఏమని అనాలో?

6 comments:

తెలుగు said...

అయ్యా,

తెలుగు భాషను మరచినవారు తప్ప గుర్తున్నవారు అడగవలసిన ప్రశ్న కాదిది. సంవాదము లేక సంవాదోపకరణం అంటే 'communication' లేక 'communication tools' లకు దగ్గరగా ఉంటుంది. తెలుగులో ప్రతి సందర్బానికి ఈ 'communication'కు పర్యాయ పదం ఉంటుంది. ఆంగ్లంలో చాలా విరివిగా అసందర్బోచితంగా ఈ 'communication' పదాన్ని వాడతారు. అంతేకాని ఆంగ్లంలాగా ఇష్టం వచ్చినొట్లుగా వాడడానికి మన తెలుగు భాష చిల్లరైన సులువు భాష కాదని మీరు గ్రహించాలి. మన భాషా సంపద... కాదు కాదు మీలాంటివారు నాలాంటివారు మరచిన భాషా విలువలు వెలకట్టలేనిది.

ఇట్లు, తెలంగాణ పౌరుడు

సూర్యుడు said...

అయ్యా తెలంగాణా పౌరుడు గారు :)

ఏదో ఒకటిలెండి, పోనీ తెలుగు భాషను మర్చిపోయాననుకోండి :)

సంవాదమంటే డిబేటో, ఆర్గ్యుమెంటో అంటారేమో కదా?

భావ వ్యక్తీకరణ అని నాకనిపించింది, అసలు వేరే ఏదైనా పదముందేమో తెలుసుకుందామని అడిగాను.

మీ సమాధానానికి ధన్యవాదములు :)

Anonymous said...

ప్రసారం కావొచ్చు.

Tejaswi said...

సందర్భాన్ని బట్టి వేర్వేరు అర్ధాలున్నాయి. 1. ప్రసారం(టెక్నికల్) 2. సమాచారం(జనరల్). భావ వ్యక్తీకరణను expressiveness అంటారుకదా.

సూర్యుడు said...

@Tejaswi:

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

ప్రసారానికి సరి‌ఐన పదం ట్రాన్స్‌మిషనేమో? అలాగే, సమాచారం కి ఇన్ఫర్‌మేషనుంది.

ఎక్స్‌ప్రెస్సివ్‌నెస్ అంటే వ్యక్తీకరణ అయ్యుండొచ్చు. ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అంటుంటారు కదా, అలా.

వేరే పదమేదో ఉండేఉంటుంది, మనకి గుర్తుకురావడంలేదంతే :-)

సూర్యుడు said...

భావప్రకటన
https://www.shabdkosh.com/dictionary/english-telugu/communication/communication-meaning-in-telugu