Showing posts with label Charles Cumming. Show all posts
Showing posts with label Charles Cumming. Show all posts

Sunday, September 12, 2021

ది చెలస్ట్ (The Cellist)

చాలా రోజుల తర్వాత మళ్ళీ గాబ్రియల్ అలన్ నవల ది చెలస్ట్  (The Cellist) చదివాను. ఇంతకు ముందు Daniel Silva నవలల్లాగే ఇదికూడా బాగుంది. ఒక రష్యన్ సంపన్నుడు ఇంగ్లాండ్ లో హత్యకు గురికావడంతో మొదలవుతుంది ఈ నవల. ఈ రష్యన్ గాబ్రియల్ అలన్ కు స్నేహితుడు కావడంతో ఆ హత్యకు కారణమైన వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ఈ నవల.

చివర్లో, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు, వాటి ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గొడవలు, రచయిత యొక్క రాజకీయ అభిప్రాయాలు ప్రస్తావించబడ్డాయి. ఇంతకుముందునుండి అనుకుంటున్నదే కానీ ఇది చదివిన తర్వాత మళ్ళీ అనిపించిందేమంటే, ప్రజలను ఎక్కువగా పోలరైజ్ (దీనికి తెలుగులో ఏ పదం వాడాలి?) చేసేయ్యకూడదు. ఇది మితిమీరితే ఒకే దేశంలో రెండు దేశాలు ఉన్నట్లుంటుంది. రాజకీయ పక్షాలకు, వాటి నాయకులకు పరిణతి లేకపోతే వచ్చే చిక్కే ఇది. ఇంతకు ముందు మనదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఓ రెండు చాలవా అనిపించింది కానీ బాగా ఆలోచిస్తే ఎక్కువ ఉండడమే మంచిదనిపిస్తోంది. 

ఈ నవల తర్వాత ఎప్పటినుండో ఆగిపోయిన టైఫూన్ నవల పూర్తిచేసేసాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా తర్వాత తర్వాత చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ నవలల్లో ఇదే బెస్టేమో. హాంగ్ కాంగ్ ను బ్రిటిష్ రూలింగ్ నుండి చైనా కు అప్పచెప్పే సమయంలో జరిగిన కథ ఇది. నాకు చాలా నచ్చింది. 

ఇంతకుమునుపెప్పుడు Stephen King నవలలు చదవలేదు కానీ ఈమధ్యనే Billy Summers కొన్నాను. చదవాలి, ఎలా ఉంటుందో ... 


~సూర్యుడు :-)

Saturday, July 18, 2020

Trinity Six - Charles Cumming

చాలా రోజుల తరవాత మొత్తానికి ట్రినిటీ సిక్స్ నవల చదవడం పూర్తి చేశాను. మొదట్లో విసుగనిపించినా తర్వాత కొద్దిగా పరవాలేదనిపించింది. ఈ రచయిత నవల్లో లోపమో లేక నా ఆలోచనా లోపమో తెలియదు కాని నాకు పెద్దగా నచ్చటంలేదు.

కేంబ్రిడ్జి గూఢచారుల గుంపులో, బయటపడని ఆరో వ్యక్తి ఉన్నాడనే ఊహతో వ్రాసిన నవల. నాకైతే బోళ్ళు రంధ్రాలు కనిపించాయి, నా చదవడం (ఊహా శక్తి) లోనే లోపం ఉండుంటుంది

ఏదేమైనా ఈ నవలని పూర్తిచేసి ఇదే రచయితది, టైఫూన్ మొదలుపెట్టాను, చూడాలి ఎలా ఉంటుందో.

డానియల్ సిల్వా క్రొత్త  నవల, ది ఆర్డర్ వచ్చింది, కొని చదవాలి.


ఆ మద్య ఎప్పుడో ఓ టపా ఆసక్తికరమైన ప్రసంగం. అప్పుడు ఆసక్తికరమైన చర్చ అని వ్రాసినట్టు గుర్తు కాని అది YouTube లంకె అయ్యుంటుంది, ఆ తర్వాత YouTube లంకె కనిపించకుండా పోవడంతో ఇక్కడకూడా కనిపించకుండా పోయింది. ఇప్పుడు Ted లంకె ఇచ్చాను. వీలైతే చూడండి.


~సూర్యుడు :-)

Monday, December 23, 2019

చార్లెస్ కమ్మింగ్ ఇంకొన్ని నవలలు

A Foreign Country, A Colder War, A Divided Spy, The Man Between, A Spy By Nature చదివిన తరువాత, The Spanish Game, The Hidden Man చదివాను. ఈ రెండు నవలలు కూడా ఇంతకుముందు వాటిల్లానే ఉన్నాయి. చార్లెస్ కమ్మింగ్ రచనా విధానం కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చడం లేదు. ముఖ్య పాత్రలు ప్రవర్తించే విధానం అర్ధం చేసుకోవడమే కష్టంగా ఉంది. Sometime I feel they were behaving amateurishly. Any how, though there were hints, Sebastian Roth being an SIS agent was kind of a suspense. The Spanish Game లో కూడా అలెక్ ఎలా CIA, Spanish రెవల్యూషనరీ గ్రూపుల వల్ల ఎలా మోసపోయాడో, లేదా అలెక్ ని ఈ రెండు గ్రూపులు ఎలా వాడేసుకున్నాయో అర్ధంచేసుకునేసరికి కొద్దిగా తల తిరిగింది. This wasn't new. Even in The Man Between, hero gets cheated by an SIS imposter. This is the main thing I didn't like in the description of heroes. They were so gullible that I don't know if they can be fit for spying. Of course, even David Ignatius' novel, Agents of Innocence portraits the CIA agents as innocent.

ఇంకో రెండు నవలలు  మిగిలాయి చదవడానికి ది ట్రినిటీ సిక్స్ తర్వాత టైఫూన్. ఏది మొదలు పెడదామా అని ఆలోచనలో ...

The Spies of Warsaw ఇంకా పూర్తవ్వలేదు. Too many to chose from and of  course to complete :-)

~సూర్యుడు :-)

Sunday, December 1, 2019

A Spy By Nature

మొత్తానికి A Spy By Nature నవల పూర్తిచేసాను, yay :-)

నవలంతా చదివినతర్వాత ఇందులో నవలా నాయకుడు, Alec, A Spy By Nature ఎలా అయ్యాడో అర్థంకాలేదు. సరే, ఇది Charles Cumming మొదటి నవల కాబట్టి ఓకే. నవల వ్రాసిన విధానం బాగుంది. కథ కొద్దిగ నెమ్మదిగా కదులుతుంటుంది. చదవాలంటే బాగా ఓపికుండాలి. కొద్దిగా సమకాలీన సమాజం గురించి కొన్ని ప్రస్తావనలుంటాయి. ఈ రచయిత Conservative Party అభిమాని అనిపించింది.

ఇప్పుడు ది స్పానిష్ గేమ్ చదవడం మొదలుపెట్టాను. ఇందులో కూడా కథా నాయకుడు Alec. ఇప్పటిదాకా కథ అంతా స్పెయిన్ లో నడుస్తోంది. నాకిప్పటిదాకా Spain ప్రజలకి చదరంగం అంటే ఇష్టమని తెలీదు. Alec స్పెయిన్ లో అజ్ఞాతవాసంలో ఉన్నాడు, MI 5/6, సిఐఎ లనుండి తప్పించుకోడానికి. సో ఫార్ సో గుడ్. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో ...

The Spies of Warsaw మళ్ళీ బయటకుతీసాను కానీ, ది స్పానిష్ గేమ్ చదివిన తర్వాత చూడాలి, The Spies of Warsaw న లేక ది హిడెన్ మాన్ చదవాలా అని.

~సూర్యుడు (feeling a better spy by nature than Alec) :-)

Sunday, November 24, 2019

The Man Between

సరే A Spy By Nature మళ్ళీ మొదలు పెట్టాను కానీ అది ముందుకు కదలకపోవడంతో The Man Between తీసి మొదలుపెడితే ఉత్కంఠంగా ఉండి పూర్తి చేసాను. ఈ నవల బాగుంది, రంధ్రాలున్నాకూడా.

ఇది ఆమధ్య వచ్చిన Occupy Wall Street లాంటి ఉద్యమాలెలా మొదల్యయ్యాయో అనే ఇతివృత్తాన్ని తీసుకుని వ్రాసిన నవల. ఈ నవలాకారుడు కల్పన ప్రకారం ఇవన్నీ రష్యా గూఢచారి సంస్థ ప్రోద్బలంతో జరిగిన ఉద్యమాలని.

ఇలాంటివి చదివితే సామాజిక ప్రసార సాధనాలు వాడుకొని వేరే దేశంవాళ్ళు ఇంకొక దేశ ఎన్నికలను ప్రభావితం చేయడం పెద్ద కష్టమేమీకాదేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నికలేమిటి వివిధ మత వర్గ ప్రాంత ప్రజలమద్య చిచ్చుపెట్టి దేశాన్ని విఛ్చిన్నం చెయ్యడానికికూడా అవకాశముందనిపిస్తుంది.

రాక్షసులు లేకపోతే మనుషులకి దేవుడి అవసరమేముంది ;-)

~సూర్యుడు :-)

Sunday, November 3, 2019

A Divided Spy

చార్లెస్ కమ్మింగ్ నవల A Divided Spy చదవడం పూర్తయ్యింది. ఇది టామ్ కెల్ సిరీస్ లో (మూడవది) చివరిది, ఇప్పటివరకు. ఇదికూడా ఇంతకుముందు రెండు నవలల్లా బాగుంది. ఇతను కూడా MI6 వాడైనా జేమ్స్ బాండ్ లాంటి స్పై కాడు. ఫైటింగులు తక్కువ వెంటపడటాలు ఎక్కువ. ఇది A Colder War కొనసాగింపు. టామ్ కెల్ ఒక రష్యన్ గూఢచారి మీద పగ తీర్చుకొనే ఇతివృత్తం మీద ఆధారపడ్డ నవల. వీళ్ళిద్దరిమద్య విరోధం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే A Colder War నవల చదవాలి.

 ఇప్పుడు మళ్ళీ A Spy By Nature చదవడమా లేకపోతే వేరేదేమైనా చదువుదామా అని ఆలోచించి ప్రస్తుతానికి The Hidden Man బయటకు తీసాను. ఇదెలాగుంటుందో చూడాలి.


~సూర్యుడు :-)

Sunday, October 27, 2019

ఈమద్య చదివిన నవలలు

ఆమద్య Charles Cumming నవలలు కొన్ని కొని చదవకుండా వదిలేసాను. నిజానికి A Spy By Nature మొదలుపెట్టాను కాని సగం దాకా చదివేసరికి ఎందుకో ఆపేసాను. ఇప్పుడు దాన్ని వదిలేసి A Foreign Country మొదలుపెడితే చాలా ఆసక్తికరంగా అనిపించి మొత్తం చదివేసాను. ఈ నవల చాలా బాగుంది. చార్లెస్ కమ్మింగ్ మొదట్లో MI6 లో పనిచేసాడుట. పని చేయడం వేరు, బాగా వ్రాయగలగడం వేరు. కానీ ఈ నవల చాలా బాగుంది.


ఆ స్పూర్తితో దాని తర్వాత నవల, A Colder War మొదలుపెట్టి, అది కూడా పూర్తి చేసాను. ఇది కూడా బాగుంది. మద్యలో ఎవరు ఎవరి asset అని చెప్పడంలో కన్ఫ్యూస్ అయ్యాడేమో అనిపించింది, కానీ నేను కూడా కన్ఫ్యూస్ అయ్యుండొచ్చు :). ఏదేమైనా ఈ నవల కూడా చాలా బాగుంది.


ఇప్పుడు దాని తర్వాత నవల, A Divided Spy మొదలుపెట్టాను. చూడాలి ఇది ఎప్పుడు పూర్తవవుతుందో. సో ఫార్ సో గుడ్. ఈ నవలలన్నిటిలో కధా నాయకుడు థామస్ (టామ్) కెల్ . మీరుకూడా చదవాలనుకుంటే A Foreign Country తర్వాత A Colder War దాని తర్వాత A Divided Spy చదివితే బాగుంటుంది.

 దీని తర్వాత మళ్ళీ A Spy By Nature మొదలుపెట్టి చూడాలి :-)

అందరికీ నరకచతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు /|\

 ~సూర్యుడు :-)
 

Sunday, May 7, 2017

ఈ మద్య చదివిన / చదువుతున్న నవలలు

బ్యాంక్ ఆఫ్ ఫియర్, బ్లడ్ మనీ నవలలు చదవడం పూర్తయ్యింది . బాడీ ఆఫ్ లైస్ చదువుదామని మొదలుపెట్టాను కాని మద్యలో ఆపేసి, స్పై బై నేచర్ (బై చార్ల్స్ కమింగ్) చదువుదామని మొదలుపెట్టాను, ఏదీ పూర్తవ్వడంలేదు :(

ఇప్పుడు ద ఎన్వోయ్ (బై ఎడ్వర్డ్ విల్సన్) అని ఒక నవల మొదలుపెట్టాను, చూడాలి ఇది ఎప్పుడు పూర్తవవుతుందో

డానియల్ సిల్వా "ద హౌస్ అఫ్ స్పైస్" రాబోతొంది, చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా అది ఎలా ఉంటుందా అని. అలాగే, డేవిడ్ ఇగ్నేషియస్ నవల ద క్వాంటమ్ స్పై కూడా రాబోతొంది . ఇవన్నీ చదవడం ఎప్పుడవుతుందో ...

మీరెవరైనా వేరే రచయిత వ్రాసిన స్పై థ్రిల్లర్స్ చదువుతున్నట్లైతే , దయచేసి ఆ వివరాలు వ్యాఖ్యగా పెట్టగలరా !

~సూర్యుడు :-)